SAINT OF THE DAY - June 6 పునీత నార్బర్టు / ST. NORBERT

St.Norbert

 (బిషప్పు, నార్బర్డుసభ స్థాపకుడు, క్రీ||శ|| 1080 - 1134)

పునీత నార్బెర్ట్ గారు జర్మనీ రాజవంశానికి చెందినవారు. ప్రుస్సియా లేక రీన్లాండ్ లోని డచ్చికైన్స్ ప్రాంతంలోని గ్సాంటెన్ పట్టణంలో క్రీIIశ|| 1080లో పుట్టారు. 5వ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో ఒక పూజారిగాను దానధర్మాలను జరిపించే సలహాదారుడుగా స్వేచ్చగా జీవించారు.

ఒకరోజు నార్బెర్ట్ గారు తన గుర్రాన్ని ఎక్కి వెడెన్ ప్రాంతంలో స్వారీచేస్తూ వెళ్తుండగా ఉరుములు మెరుపులతో పెను తుఫానువచ్చింది. ఆ తీవ్రగాలికి నార్బెర్ట్ గారు గుర్రం పైనుండి దూరంగా విసరివేయబడ్డారు. అపోస్తలుడైన పునీత పౌలుగారు దమాస్కునగరం పోతూ క్రిందపడినట్లుగానే వారికి కూడ సంభవించింది. ఒక దివ్యవాణి వినిపించింది. నార్బెట్టుగారు పరిశుద్ధ దైవ సేవకు అంకితంకావాలని ఆ పిలుపు సారాంశం. స్వేచ్ఛగా విహరించే తత్వంగల నార్బెట్టుగారిలో పరివర్తన కలిగింది. క్రీ||శ|| 1115లో వారు ఒక క్రైస్తవ గురువుగా అభి షేకం పొందారు.

రాజ సలహాదారుడు పదవిని త్యజించి క్రీ||శ|| 1118లో ఫాదర్ నార్బెర్ట్ గారు తమదైన ధనాన్ని, ఆస్థిని నికృష్టులు నిర్భాగ్యులకు దానధర్మంచేసి రాజప్రాసాదాన్ని విడిచి బైటకువచ్చారు. ల్యాంగుయేదోక్ పట్టణంలో విడిదిచేసియున్న 2వ జెలాసియస్ పోపుగార్ని కలసి ఎక్కడ అవసరమనుకుంటే అక్కడకువెళ్లి సువార్తా ప్రచారంచేయడానికి పూర్తి అనుమతి ఆశీర్వాదం పొందారు.

నార్బెర్ట్ గారు ఫ్రాన్సుదేశంలో తమ వేదప్రచారం మొదలు పెట్టారు. వీరికి తోడుగా (ధన్య) ఫోస్సెస్ హగ్ గురువర్యులుకూడా వచ్చిచేరారు. క్రీ||శ|| 1121లో ప్రెమోంతై పట్టణంలో ఫాదర్ నార్బర్జుగారు నలభై మంది అనుచరులను చేర్చి ప్రేమోన్ స్ర తెన్సియన్స్ అని “నార్బర్ట్ సభను ప్రారంభించారు. అలాగే స్త్రీలకోసం తెల్లఉత్తరీయమాత సభను కూడ ఆరంభించారు. ఇక వరుసగా లెక్కలేనన్ని మఠాశ్రమాలు, కాన్వెంట్లు నెలకొల్పుకుంటూ పోయారు. ఆనాటి 2వ లోతీయర్ చక్రవర్తి క్రీ.శll 1126లో మగ్గిబర్ట్ పీఠంకు నార్బర్జుగార్ని బిషప్పుగా నియమింపజేశారు.

బిషప్ నార్బర్ట్ గారు క్రైస్తవజీవితంకు కావాల్సిన కొన్ని సంస్కరణలను చేపట్టునట్లు దేవుని ప్రేరణ పొందారు. ముఖ్యంగా క్రైస్తవేతరులను ఆకర్షించే విధంగా వేదబోధ ఎలా ఉండాలో నిర్దేశించారు. పేతురు సింహాసనాధిపత్యంకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. తద్వారా పునీత బెర్నార్డు (ఆగష్టు - 20 చూడండి)గారికి సన్నిహిత మిత్రుడయ్యారు. వాగ్ధాటిగల బోధకుడుగా, శ్రీసభ తరపున మాట్లాడే వ్యక్తిగా పేర్గాంచిన వీరు తమ మధైబర్గ్ పీఠంలోనే క్రీ||శ|| 1134 జూన్ 6వ తేదీన పరలోకభాగ్యం పొందారు. క్రీ||శ|| 1582లో 13వ గ్రెగోరి పోపుగారు నార్బర్జుగారికి పునీత పట్టంకట్టారు. నార్బెర్టు అనగా భూలోక వెలుగు.

Born near Cologne in 1080, Saint Norbert, of noble rank and rare talents, passed a frivolous youth, abandoning himself to the pleasures and vanities of the world. Though he was a canon of the church, he refused to receive ecclesiastical Orders so as to continue to live in his caprices. He went to the court of the Archbishop of Cologne, then to that of the Emperor Henry IV, the famous adversary of Pope Saint Gregory VII, known also as Hildebrand. His conduct then became a scandal to his sacred calling, since at the court of the Emperor, like many clerics of those times, he was leading a life of dissipation and luxury.

One day, when he was thirty-three years of age, he was thrown from his horse in the midst of a terrible storm, and on recovering his senses a half hour later, he resolved upon a new life. After a severe and searching preparation, he went to the Archbishop of Cologne and humbly asked to receive Holy Orders. He was ordained a priest and began to preach against all the abuses and vices of his time. He encountered enemies and was silenced at first by a local council; however, he obtained the Pope's sanction and preached penance to listening crowds in France and the Netherlands. His example spoke still more eloquently than his words; he walked barefoot in the snows and wore a tunic which was a hair shirt, fasting all year long. He was compared to John the Baptist by his austerity and by the fervor of his preaching.

A chaplain of the bishop of Cambrai, impressed by the extraordinary changes in the former nobleman of the Emperor's court, asked to join him; this good priest, by the name of Hugh, later would succeed him in the government of the new religious Order which he was soon to found. In every place where Saint Norbert preached, those in attendance saw sinners converted, enemies reconciled and usurers return extorted wealth.

The bishop of Cambrai desired that he found a monastery and a new Order in his diocese, and the holy monk recognized at once, in a wild vale later called Premontre, the place he should choose. There he was favored, during a night of prayer, with a vision of many white-robed monks in procession with crucifixes and candles; the Blessed Virgin also appeared to him and showed him the habit he should give his religious. It was in 1120 that he gave to some trained disciples the rule of Saint Augustine, with the white habit he had been shown, denoting the angelic purity proper to the priesthood. The Canons Regular, or Premonstratensians, as they were called, were to unite the active work of the country clergy with the obligations of the monastic life. The foundations multiplied, and the fervor of these religious priests renewed the spirit of the priesthood, quickened the faith of the people, and overcame heresy.

In the time of Saint Norbert a pernicious heretic named Tankelin appeared at Antwerp, denying the reality of the priesthood, and above all blaspheming the Holy Eucharist. The Saint was sent for, to quench the error and its source, since three thousand persons had followed this man, who was allowing every vice to pass for legitimate. By Saint Norbert's burning words he exposed the impostor, corrected the erring, and rekindled faith in the Blessed Sacrament. Many of the apostates had proved their contempt for the Blessed Sacrament by burying it in walls and damp places; Norbert bade the converted ones search for the Sacred Hosts. They found them entire and uninjured, and the Saint bore them back in triumph to the tabernacle. Hence he is generally portrayed with the monstrance in his hand.

In 1126, Norbert was appointed Bishop of Magdeburg; and there, at the risk of his life, he zealously carried on his work of reform until he died, worn out with toil, at the age of fifty-three.

Add new comment

15 + 2 =