SAINT OF THE Day – May 6 పునీత దోమినిక్ సావియో|ST. DOMINIC SAVIO

@pjsri

(బాలుడు, మతసాక్షి క్రీ||శ|| 1842-1857) దోమినిక్ సావియో పునీత డాన్ (జాన్) బోస్కోగారి మొదటి విద్యార్థుల్లో ఒకరు. వీరు ఉత్తర ఇటలీలోని 'మురియాల్లో ప్రాంతంలోని “రివా' గ్రామంలో 1842 ఏప్రిల్ 2న జన్మించారు. తండ్రి చార్లెస్ సావియో, తల్లి బ్రిజిత. వీరిద్దరూ భక్తిగలవారు కావడంవల్ల ఇంటివద్ద, విచారణ గుడివద్ద అందించే ఆధ్యాత్మిక శిక్షణలో వృద్ధి చెందుతూ వచ్చారు. 

వారి ఇంటి వాతావరణంకూడ వీరి ఆథ్యాత్మిక అభివృద్ధికి దోహదంచేసింది. విచారణ గురువు ఫాదర్ జాన్గారు కూడ దోమినిక్ గారికి దేవుని, ప్రకృతిని, మేరీమాతను గాఢంగా ప్రేమించేటట్లు తీర్చిదిద్దారు. దోమినిక్ చిన్నపిల్లవాడైనను పెందలకడనేలేచి ప్రతిరోజు దేవాలయానికి వెళ్లేవాడు. చలికాలమైనా ఎండాకాలమైనా ప్రార్థనాకాండకు, దివ్యబలిపూజకు విధిగా హాజరయ్యేవారు. ఆ రోజుల్లో పన్నెండు సంవత్సరాలు దాటితేనేగాని దివ్యసత్రసాదం ఇవ్వబడేదికాదు. అయినా దోమినిక్ కోరికమేరకు మరియు వారి భక్తి ప్రపత్తులను బట్టి వారికి తమ ఏడవ ఏటనే 1849 ఏప్రిల్ 8న ప్రథమ దివ్యసత్రసాదం ఇవ్వబడింది. ఆ రోజు పవిత్రతలోను ఏసుతోను నిండిన హృదయంతో తన చిన్నడైరీలో తాను ఆచరించాల్సిన నాలుగు ప్రధాన నిర్ణయాలు వ్రాసుకున్నారు. 

అవి 1. వీలైనన్నిసార్లు పాపసంకీర్తనం చేయాలి.
2. అనుదినం దివ్యసత్రసాదాన్ని లోకొనాలి. 
3. పాపంచేయుటకన్నా మరణించటంమేలు 
4. ఏసు మరియలు నామిత్రులు.

దోమినిక్ గారికి కావలియైన సన్మనస్కుని పై నమ్మకం' గౌరవం ఎక్కువ. చాలాదూరం ఉన్నప్పటికి క్రమంతప్పక బడికివెళ్లి చెప్పే పాఠాలు శ్రద్దగా వినేవాడు, నేర్చేవాడు. 1853 ఏప్రిల్ 13న దోమినిక్ గారు భద్రమైన అభ్యంగ సంస్కారాన్ని పొంది, ఏసుకోసం యుద్ధవీరుడిలా పోరాడుతానని ప్రభువుకు వాగ్దానం చేశారు. ఆ దినాల్లోనే వారు తనకు బోధిస్తున్న గురువుతో “ఆత్మల రక్షణ కోసం నేను గురువుకావాలని ఆశిస్తున్నాను. లోక రక్షణలో ఏసుకు సహాయపడే జీవితంకన్నా మనోహరమైంది ఏదీలేదు” అని చెప్పారు.

అదే దినాల్లో డాన్ బోస్కో అనే గురువు దోమినిక్గారి ఊరు వచ్చారు. వందలాది బాలురకు ఇటలీలోనే గల టూరిన్ పట్టణంలో విద్యాభ్యాసం చేయిస్తున్న గురువుగా వారికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. దోమినిక్ గారి గురించి డాన్ బోస్కోగార్కి విచారణ గురువు వివరించారు. టూరిన్లో తన వద్ద ఉండి చదువుకోడానికి బోస్కోగారు దోమినిక్ గారి అనుమతినిచ్చారు. దోమినిక్ గారికి టూరిన్లో బోస్కోగారి పాఠశాలలో చేరారు. తమ ఊర్లో మాదిరే అక్కడకూడ తరగతిలో ఆదర్శ విద్యార్థిగా ఉండి అందరికీ ప్రీతి పాత్రుడయ్యారు.

1854 డిసెంబరు 8న గొప్ప పండుగదినం. 9వ పయస్ (భక్తినాథ) పోపుగారు కన్య మరియాంబగారు “జన్మపాపం లేక జన్మించిన మాత' అన్న విశ్వాస సత్యాన్ని వెల్లడించారు. శ్రీసభ ఆరోజు ఆ పండుగను ఘనంగా కొనియాడింది. డాన్ బోస్కోగారి విద్యాలయంలోనూ గొప్ప ఉత్సవం జరుపుకున్నారు. దోమినిక్ గారు తనను మరియమాతకు పునరంకితం చేసుకుని తనను సదా పవిత్రంగా ఉండేలా కాపాడమని ప్రార్థించారు.1855 తపస్సుకాలంలో ఒక ఆదివారం పూజలో బోస్కోగారు పవిత్రత గూర్చి చెపూ “మీలో ప్రతి ఒక్కరూ పునీతులు కావాలి. అది దేవునికి ఎంతో ఇష్టం” అని చెప్పారు. తానూ పునీతుణ్నికావాలి అని దోమినిక్ గారు పదే పదే తలంచారు. ఆనాటినుండి ముఖం వ్రేలాడేసుకుని తలదించుకుని నవ్వక, మాట్లాడక దిగాలుగా ఉండసాగారు

బోస్కోగారు విషయం తెలుసుకుని “దోమినిక్ ! పవిత్రత అనేది ముఖం వేలాడేసుకోవడంలో లేదు. అనుక్షణం ఆనందంగా చిరునవ్వుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో ఉంది” అని నచ్చజెప్పారు. ఆ విధంగా దోమినిక్గారిలో తిరిగి ఆనందం పెల్లుబికింది. దోమినిక్ గారికి తోడిపిల్లలను మంచి పాప సంకీర్తనం చేయ ప్రోత్సహించేవారు.చెడ్డ పుస్తకాలు చదివే వారికి బుద్ది చెప్పేవారు. క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి దూరంగా ఉండాలని పిల్లలకు చెప్పేవారు. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయపడే అవకాశం కోసం ఎదురు చూసేవారు. రోగులను పరామర్శించి ధైర్యంచెప్పి ఆనందపరచేవారు.

దైవ దూషణ చేసేవారికి సంతృప్తికర సమాధానం చెప్పి నోరుమూయించేవారు. ఒకసారి దివ్య సత్రసాదంతో గురువు వెళ్తుండగా వర్షంపడి బురదగా ఉన్నాగాని మోకరిల్లి మర్యాద చూపారు. తన ప్రక్కనున్న సైనికుడు ఒకడు అలాచేసేందుకు సిగ్గుపడుతుండగా తన చేతి రుమాలును నేల పైపరచి మోకరిల్లి గౌరవించేటట్లు చేశారు. అలాగే పోట్లాడుకుంటున్న ఇద్దరు దోమినిక్ గారికి భక్తితో దివ్య సత్రసాదం లోకొనేవారు. అందుకు ముందు చరియు వెనుక కూడ చాలా సేపు జపాలు మరియు కృతజ్ఞతా ప్రార్థనలు సలిపేవారు. తీరిక దొరికి నప్పుడెల్లా గుడికి వెళ్లి జపించడం చేసేవారు. “నాతోడి బాలురనందర్ని దేవునివైపు మరల్చ కల్గితే నేను ఎంత ధన్యుణ్ని” అని బోస్కోగారితో అనేవారు. దోమినిక్ గారికి తోటి విద్యార్థులను సంఘటిత పరచి “అమలోద్బవిమాత” సంఘం ఏర్పరచారు. 

నిజమైన అపోస్తలుగా ఉండేందుకు పిల్లలకు సత్యోపదేశం నేర్పించడం వారిని పూజకు తీసుకెళ్లడం, ప్రార్థనలు చెప్పించడం చేసేవారు. వారికి నీతి కథలతో క్రైస్తవ విశ్వాసం పటిష్టపరచేవారు. తనను గట్టిగా కొట్టిన ఒక తోడి పెద్ద విద్యార్ధిని క్షమించారుకాని పిర్యాదు చేసి చాడీలు చెప్పక అతనిని మార్చారు. దోమినిక్ గారికి దూరంలో జరుగుతున్న విషయాలను తాను తెలుసుకొని చెప్పగల వరం దేవుని నుండి పొంది ఉన్నారు. ఒక వీధి చివర ఉన్న మూడంతస్తుల భవనంలో మరణావస్థలో ఉన్న ఒక వ్యక్తి అవసరాన్ని ఇలా తెలుసుకుని ఫాదర్ జాన్ బోస్కోగార్ని తీసికొనిపోయి మారుమనస్సు పొంది దేవునితో సఖ్యతపడదలచిన ఆ వృద్ధునికి మంచి పాప సంకీర్తనం కడపటి సాంగ్యం లభించేలా చేయకలిగారు. 

అలాగే మరోచోట పెద్దబంగళాలో తీవ్రంగా జబ్బుపడి ఆందోళనతో గురువుకోసం ఎదురు చూస్తున్న ఒకగ్రీ అవసాన కోరికను తన ఆత్మశక్తితో గ్రహించి బోస్కోగారిని తీసుకొనిపోయి ఆమెకు అవస్థనిప్పించి స్వర్గమార్గం సుగమం చేశారు. అలాగే మూడు మైళ్లదూరంలో తమ ఊల్లో తల్లి బ్రిజిత అనారోగ్యంతో ఉన్న సంగతికూడ దివ్య వరంతో తెలిసికొని పెద్దల అనుమతితో వెళ్లి సందర్శించి రిబ్బనుతో కట్టిన దేవమాత స్వరూపాన్ని తల్లి మెడలో వేయగా ఆమె స్వస్థతనొందింది.

టూరిన్ లో బోస్కోగారి విద్యాలయంలో విద్యార్ధిగా ఉన్న దశలోనే దోమినిక్ గారికి ఒకరోజు తలనొప్పి, దగ్గుతో అస్వస్థులయ్యారు. బోస్కోగారు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. కాని వారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణింపజొచ్చింది. "నేను ఈ లోకంలో ఇక ఎంతకాలం ఉండను. అనేక ఆత్మలను దేవునివైపు త్రిప్పేందుకు నాభావి జీవితాన్ని అర్పించాను.” అని దోమినిక్ గారికి చూడవచ్చిన మిత్రులతో మెల్లగా చెప్పారు.బోస్కోగారు దోమినిక్ గారి తండ్రిని పిలిపించి ఇంటికి పంపారు. ఆ సమయంలో దోమినిక్ గారికి తమ జ్ఞాన తండ్రి ఫాదర్ జాన్ బోస్కోగారితో “నేను పరలోకంనుండి మీకు సాయపడతాను....... మీకోసం నా సహచరుల కోసం ప్రార్థిస్తాను” అని చివరిసారిగా పలికారు.

ఇంటిని చేరిన దోమినిక్ గార్నిచూసి తల్లి బోరున విలపించింది. తండ్రి వైద్యుని తీసుకొచ్చాడు. డాక్టరు ఇంజెక్షనును సిద్ధంచేస్తూ “బాబూ ! భయపడకు....... ఆ వైపుతిరుగు” అన్నప్పుడు దోమినిక్గారు “డాక్టరుగారూ ! ప్రభువు చేతులు, కాళ్లలోదిగిన చీలలతో పోలిస్తే ఈ సూది ఎంతండీ !” అని నవ్వి ఊరుకున్నారు. ఎంతకూ వ్యాధి నయంకాకుండ తీవ్రం కావడంతో గురువును రప్పించి అంతిమ సంస్కారమిప్పించారు. దోమినిక్గారు తనతల్లిని ఓదార్చుతూ “అమ్మా ! ఆతృత చెందకు ఈ లోకంలో కంటే నేను పరలోకంలో ఉండటమే అధిక లాభదాయకం నేను పైనుండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. నా తోబుట్టువులందర్నీ సంరక్షిస్తాను” అన్నారు.
1857 మార్చి 9న తన 15వ ఏట దోమినిక్గారు “అమ్మా ! నేను మోక్షానికి వెళ్తున్నాను... ప్రభూ ! నా ఆత్మ తొలిసారిగా మీముందు నిలిచినప్పుడు నాపై దయచూపండి. 

నేను సదా మీ మహిమను కీర్తింతును. ఆహా ఎంతటి దేదీప్య మానమైన వెలుగును చూస్తున్నాను....” తలవాల్చిన దోమినిక్గారి ముఖం తేజోవంతమైంది. కొన్ని వారాల తర్వాత దోమినిక్గారు ఒక రాత్రి తండ్రికి అగుపించి “అవును.... నేనే నాన్నా ! నేను మోక్షంలో ఉన్నాను. నేను నిన్ను, అమ్మనూ, తమ్ముల్నీ, చెల్లెల్ని సంరక్షిస్తాను” అని చెప్పి అదృశ్యమయ్యారు. దోమినిక్గారి మరణానంతరం వారిని ప్రార్థించుటవల్ల ఎంతో మంది వరాలు పొందారు. 

అందులో గొప్పది ఏమనగా ఒక బాలుడు చనిపోయాడని డాక్టరు మరణధృవపత్రంపై సంతకం పెట్టిన తర్వాత ఆ బాలుని తల్లిదండ్రులు బంధుమిత్రులు దోమినిక్గారి మధ్యవర్తిత్వమున ప్రాణభిక్షకోసం ప్రార్థింపగా చనిపోయిన ఆ బాలుడు నిద్రనుండి లేచిన వానిలా లేచాడు. 1954 జూన్ 12న 12వ పయస్ (భక్తినాథ) పోపుగారు దోమినిక్గారికి పునీత పట్టానిచ్చి గౌరవించారు. కేవలం పది హేనేండ్ల పిల్లవాడైన దోమినిక్ సావియోను పునీతునిగా ప్రకటించడం తనకెంతో ఆనందంగా ఉందని నేటియువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు జగద్గురువులు నుడివారు. దోమినిక్ అనగా ప్రభువుకు సంబంధించిన, దేవునకు చెందిన అని అర్థం.


Saint Dominic Savio was born in Riva di Chieri, Italy, on April 2, 1842. He looked so frail and weak on the morning of his birth that his father rushed him that same evening to the parish church for Baptism. But Dominic survived and began serving Mass when he was five years old, one of his greatest joys. He was often seen at five o'clock in the morning in front of the church on his knees in rain or snow, waiting for the doors to be opened. On the occasion of his First Holy Communion he made the resolution to die rather than sin, as he had frequently expressed his determination and ambition to become a Saint.

The village pastor at Mondonio, recognizing in Dominic a soul of predilection, arranged to have him enter Don Bosco's Oratory at Turin. Don Bosco soon noted Dominic's consuming quest for sanctity, and pointed out to the boy that the path to holiness is not necessarily among hair shirts and tortures of the flesh, but in the cheerful bearing and offering of each day's small crosses.Steering the lad away from artificial practices, his loved master showed him that for a soul avid of penance, there is a superabundance to be had for the taking, through acceptance of the monotony and tribulations inseparable from the perfect fulfillment of the duties of one's state of life.

After a few months of life in the environment of the Oratory and under the saintly care of Saint John Bosco, Dominic's soul was fired with the zeal of his master, whose rule of life, Give me souls, Lord; You take the rest, the boy adopted for his own. Following the example of Don Bosco, who in season and out of season sought those souls wherever they were to be found, Dominic also went after them in his own little world. In the Oratory he founded and directed the Immaculate Conception Sodality, a group of boys who by prayer, word and example carried on an apostolate among their classmates and proved to be of valuable assistance to Don Bosco in his work.

On one occasion Dominic broke up a vicious duel with stones. Standing between the boy-duelists with dramatic suddenness, he flashed a crucifix and said: This is Friday. Today Christ died for love of us. Can you look at Him and still hate each other? When Dominic's health began to fail he was forced to leave the Oratory. Don Bosco and the boys were very sorry to see him leave; he had been a good friend to all. Don Bosco said of him: His cheerful character and lively disposition made him extremely popular even among those boys who were no great lovers of their faith. His death at his home on March 9, 1857, was sweet and peaceful. Pope Pius XII canonized him in June, 1954.

Add new comment

9 + 9 =