SAINT OF THE Day – May 5 పునీత జెరుసలేం అంజెలో|ST. ANGELO

@pjsri

(కార్మెలైట్ గురువు, వేదసాక్షి క్రీ||శ|| 1145-1220) “మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని కనుగొంటిమి” (యోహా. 1:45) అని అపోస్తలుడైన పునీత ఫిలిప్పుగారు, పునీత నతానయేలు అనగా అపోస్తలుడైన బర్తలోమియోగార్కి వారు కొత్తగా క్రీస్తు శిష్యులుగా చేరేటప్పుడు జరిగిన సంభాషణ అది. అయితే వారే మెస్సయాటైన ఏసుక్రీస్తని వారు సాక్ష్యాధారాలతో తెలుసుకొని, నమ్మి, సేవించారు. అయితే మెస్సయా ఇంకా రాలేదని ఎదురుచూస్తున్న కొన్ని మతాలవారు ఇంకా ఉన్నారు ప్రపంచంలో. 

అలాంటి కోవలోకి చెందిన వారే ఇటలీదేశంలోని ఒక యూదు జాతి కుటుంబం. వారు ఎంతో భక్తిపరులు. ఆదర్శకుటుంబం. మానవజాతిని విముక్తం చేసే మెస్సయకోసం ఎదురు చూస్తూ ప్రార్ధిస్తుండేవారు. ఇలా ఉండగా మేమాసంలో ఒకరోజు ఆ యూద దంపతులకు పరిశుద్ద మేరిమాత దర్శనమయ్యారు. “మెస్సయా తన ప్రజలవద్దకు చాలా కాలం క్రితమే వచ్చారు. మానవాళినందరినీ విమోచించారు కూడా” అని పలికి ఆ దంపతులకు ఇద్దరు కవలలైన కుమారులు కలుగుతారని వారు ఒలీవుచెట్లవలె ఉన్నతంగా పెరుగుతారని ఒకరు బిషప్పుగాను ఒకరు మహిమగల గురువేదసాక్షిగాను దేవునికి అర్పించుకున్నవారు అవుతారని భవిష్యద్దర్శనం పలికారు.బాల్యంనుండే ఆ కవలపిల్లలు భౌతిక ఆథ్యాత్యిక వరాలతో పెరిగారు. 

18సం||ల నవయౌవన ప్రాయంలో కార్మెలైటుసభలో ప్రవేశించారు. అప్పటికేవారు గ్రీకు, లాటిను, హిబ్రూ భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నారు. అయితే అంజెలోగారు కార్మెలుకొండపై అయిదేండ్లు నిష్ఠగా ఋషి జీవితంలో జపం తపంతో దేవునికి మరింత దగ్గరయ్యారు. ఒక రోజు వారు ప్రార్థిస్తుండగా మన ప్రభువైన ఏసుక్రీస్తు దర్శనమై సిసిలీదేశంకు వెళ్లి తన అపార కృపానుగ్రహాలతో అక్కడ జీవితాన్ని బలిదానం చేయాల్సి ఉందని కోరారు.ప్రభువు ఆదేశానుసారం గురువుగా అభిషిక్తులైన అంజెలోగారు కార్మెలు మఠం నుండి బయలుదేరి వెంటనే సిసిలీకి చేరుకున్నారు. అక్కడ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. బోధించడమే జీవనంగా ఏసు పేరట అనేక అద్భుతాలు, స్వస్థతలుచేసి అపర క్రీస్తులా ప్రజల్లో మార్పు తేవడం మొదలు పెట్టారు. 

చాలామంది జ్ఞానస్నానాలు కూడా ఇచ్చారు. ఫలెర్మోపట్టణంలో నిష్టాగరిష్ఠులైన 200మం యూదులు అంజెలోగారి ప్రబోధాలకు పరవశులై క్రీస్తును నమ్మి బాపి పుచ్చుకున్నారు. అలాగే లియోకతా పట్టణంలో కూడ అంజెలోగారు ఇలాం విజయాన్నే సాధించారు. ఇలా జరగడంతో ఆ ప్రాంత పెద్దమనిషి బెరన్గారియస్కు ఆగ్రహం తెప్పించింది.ఒకరోజు పునీత అంజెలోగారు ఒక పెద్ద జనగుంపుకు క్రీస్తుగూర్చి వారి రక్షణ గూర్చి సవివరంగా చెప్పడం మొదలు పెట్టారు. నిజమైన దేవుడు, దేవుని లక్షణాలు దేవుని ఆజ్ఞలు గూర్చి ఎప్పటిలా ప్రబోధిస్తున్నారు. ఆ సమయంలో బెరంగారియస్ నాయకత్వంలో కొందరు క్రూరులైన వ్యక్తులు వచ్చి అంజెలోగార్ని క్రూరంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. 

రక్తం ఓడుతూనే ఆంజెలోస్వామి మోకాళ్లపై ఉండి తనను హత్యచేస్తున్నవారిని క్షమించి తన ప్రజలను ఎల్లవేళలా సంరక్షింపమని దేవుని ప్రార్థిస్తూ తన ఆత్మను ప్రభువుకు కానుకచేశారు. క్రీ||శ|| 1220లో వారి మరణానంతరం ఆ ప్రాంత ప్రజలు వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించి అనేక ఆశ్చర్యకర మేలులు పొందారు. అంజెలో లేక ఏంజిల్ అంటే దూత, వార్తాహరుడు, సన్మనస్కుడు అని అర్థం.


St. Angelo, who was one of the early members of the Carmelite Order, suffered martyrdom for the Faith at Leocata, Sicily. The story of his life, as it has come down, is not very reliable. It may be summarized as follows: His parents were Jews of Jerusalem who were converted to Christianity by a vision of our Lady. She told them that the Messiah they were awaiting had already come to pass and had redeemed His people, and she promised them two sons, who would grow up as flourishing olive trees on the heights of Carmel-the one as a patriarch and the other as a glorious martyr. 

From childhood the twins displayed great mental and spiritual gifts when, at the age of eighteen, they entered the Carmelite Order, they already spoke Greek, Latin, and Hebrew. After Angelo had been a hermit on Mount Carmel for five years, Our Lordappeared to him and bade him go to Sicily, where he would have the grace to offer the sacrifice of his life.
The saint immediately obeyed the call. During his journey from the East as well as after his arrival in Sicily, he converted many sinners by his teaching, no less than by his miracles. At Palermo over two hundred Jews sought Baptism as the result of his eloquence.

Similar success attended his efforts in Leocata, but he aroused the fury of a man called Berengarius, whose shameless wickedness he had denounced. As he was preaching to a crowd, a band of ruffians headed by Berengarius broke through the throng and stabbed him. Mortally wounded, Angelo fell on his knees, praying for the people, but especially for his murderer. #like #share

Add new comment

1 + 2 =