SAINT OF THE Day – May 3 పునీత ఫిలిప్ప,అపోస్తలుడైన పునీత చిన్న" యాకోబు (జేము/యాగప్ప)/Saints Philip and James Apostles

@pjsri

గెన్నెసరేతు సరస్సుకు ఒడ్డునగల బెత్సయిదా పురనివాసి ఈ ఫిలిప్ గారు. ఏసుక్రీస్తు ప్రభుని పండ్రెండు మంది తొలి అపోస్తుల్లో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. చాలామంది ఆడపిల్లల తండ్రి. ఎప్పటినుండో వేద ప్రవచనం చొప్పున ఎదురుచూస్తున్న మెస్సియ కంటికగుపించి శిష్యుడుగా చేరిన వెంటనే, తన ఈ ఆనందాన్ని పంచుకోడానికి తన ఆప్తమిత్రుడైన నతనయేలు వద్దకువెళ్లి “మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి.

ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియును అగు యేసు” అనిచెప్పారు. “నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా ?” అని నతనయేలు ప్రశ్నింపగా “వచ్చిచూడుము'' అని జవాబు చెప్పింది ఫిలిప్పుగారే (యోహా 1:45, 46) నతానయేలు (బర్తలో మియో)గారు కూడ ఫిలిప్పుగారితో పాటు వెళ్లి ఏసునాధుని శిష్యులవ్వడం మనకు తెలుసు.

థియోడోరెత్ మరియు ఎవు సేబియస్గార్లు గట్టిగా చెప్పేదేమంటే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీహించిన పిమ్మట ఫిలిప్పుగారు కన్యకలుగా ఉన్న తన కుమార్తెలను వెంట నిడుకొని ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్తా ప్రచారంచేసి, ప్రిసియా ప్రాంతంలోని హీరాపొలిస్ ఊరిలో సిలువలో కొట్టబడి చంపబడ్డారు. బహుశ క్రీ.శ. 80లో కావచ్చు. వీరి గుర్తు రెండు రొట్టెలు ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్థం.

పునీత చిన్న యాకోబుగారినే జేము అని కూడా అంటాం అనగా యాగప్పగారు. వారు అల్పయి కుమారుడు (అ.కా. 1:13) వీరు ఏసు ప్రభువుకు శిష్యుడు, వరుసకు సహోదరుడు అవుతారు. (మ. 13:55, మా. 6:3, గల 1:19) చిన్నయాకోబుగారి తల్లి క్లోఫా మరియ(యో. 19:25), కన్య మరియమ్మ అక్కాచెల్లెండ్రవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్నయాకోబుగారు. అనగా యాగప్పగారు అందమైన, భక్తిగల, విరక్తత్వముగల వ్యక్తియని తెలుస్తుంది. 

చిన్న యాకోబుగారు పవిత్ర నగరం జెరుసలేం పీఠంకు బిషప్పుగా సేవలందించారు. ప్రేమదాతృత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేద ప్రచారంకు అతుక్కుపోయి ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినప్పుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేకపోతున్నందుకు గాను మవునంగా రాజీనామా చేశారు. 

పునీత యాకోబుగారు వ్రాసిన లేఖను వారు క్రీ||శ|| 47లో వ్రాశారు. ఈ లేఖ సిరియా శ్రీసభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే. క్రొత్తగా వచ్చిన దైవ ప్రేమ సహోదర ప్రేమ పునాది పైగల క్రైస్తవ వేదం అనుసరించడంవల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడటం, అణగదొక్కబడటం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసులకోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాశారు. 

బట్టలు ఉతికే వారల సంవుంవారు ఆగ్రహంతో విరుచుకుపడి చిన్నయాకోబుగార్ని దేవాలయంకు ఉన్న పిట్టగోడ పై నుండి బలంగా విసరివేసికొట్టి చంపారు. వారు క్రీ||శ|| 62లో వేదసాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్టులు, చాకలి వృత్తివారు, దొరటోపీ తయారీదార్ల పాలకపునీతులు.


(First century) (అపోస్తలుడు, వేదసాక్షి క్రీ.శll – 80/62) Philip was one of the first chosen disciples of Christ. On the way from Judea to Galilee Our Lord found Philip, and said, Follow Me. Philip straightway obeyed; and then in his zeal and charity sought to win Nathaniel also, saying, We have found Him of whom Moses and the prophets wrote, Jesus of Nazareth. 

And when Nathaniel in wonder asked, Can any good come out of Nazareth? Philip simply answered, Come and see, and brought him to Jesus.Another saying of this Apostle is preserved for us by Saint John. Christ in His last discourse had spoken of His Father; and Philip exclaimed, in the fervor of his thirst for God, Lord, show us the Father, and it is enough! 

The tradition of the ancients has established that he died a martyr at Hierapolis in Phyrgia. There the remains of a church known to be dedicated to him have been identified, north of the entrance to the great necropolis. His relics were later transported to Rome, to the church of the Holy Apostles.

Saint James the Less (the Younger), author of the canonical Epistle, was the son of Alpheus, the brother of Saint Jude and a cousin of Our Lord, whom he is said to have resembled. Saint Paul tells us that he was favored by a special apparition of Christ after the Resurrection. (I Corinthians 15:7)On the dispersion of the Apostles among the nations, Saint James remained as Bishop of Jerusalem, where the Jews held in such high veneration his purity, mortification, and prayer, that they named him the Just. He governed that church for 30 years before his martyrdom.

Hegesippus, the earliest of the Church's historians, has handed down many traditions of Saint James's sanctity. Saint James was a celibate Nazarite consecrated to God; he drank no wine and wore no sandals. 

He prostrated himself so long and so often in prayer that the skin of his knees was hardened like a camel's hoof. It is said that the Jews, out of respect, used to touch the hem of his garment. He was indeed a living proof of his own words, The wisdom that is from above is first of all chaste, then peaceable, modest, ready to listen, full of mercy and good fruits. (James 3:17) 

He sat beside Saint Peter and Saint Paul at the Council of Jerusalem. When Saint Paul at a later time escaped the fury of the Jews by appealing to Caesar, the people took vengeance on James, and crying out, The just one has erred! stoned him to death. During his martyrdom he prayed for his persecutors in the same words pronounced by Jesus: Heavenly Father, forgive them, they know not what they do.

Add new comment

11 + 0 =