SAINT OF THE DAY – MAY 2 పునీత అతనాసియసు|ST. ATHANASIUS

@pjsri

(బిషప్పు, శ్రీసభ పితామహుడు మరియు పండితుడు క్రీIIశII 297-373) ఈజిప్టులోని గొప్ప క్రైస్తవ విశ్వాసంగల కుటుంబంలో అలెగ్జాండ్రియా పట్టణంలో పునీత అతనాసియస్గారు క్రీIIశII 297లో పుట్టారు. గొప్ప వ్యాపార కేంద్రమైన ఆ పట్టణంలో మంచి విద్యగడించారు. మంచి భావాలు ఉన్నత ఆశయాలతో పెరిగారు. తెలివి, జానం స్వంతంచేసుకున్నారు. బంగారానికి పరిమళం అబ్బినట్లు ఉత్తమ భక్తిపరుడు కూడా అయ్యారు. వారు దేవుని సేవకుడుగా పనిచేయాలని డీకను కూడా అయ్యారు. వారి ప్రజ్ఞను ఎరిగి ఉండటంచే అలెగ్జాండ్రియా పీఠాధిపతియైన అలెగ్జాండరుగారు వారిని తమ కార్యదర్శిగా వేదాంత సలహాదారుగా నియమించుకున్నారు. 

క్రీ||శ|| 325లో అసియామైనరు(టి)లోని బితినియా మండలంలోని నైసియా పట్టణంలో అఖిల క్రైస్తవ పీఠాధిపతుల మహామండలి సమావేశం జరగా అలెగ్జాండరు బిషప్పుగారు పండితోత్తముడైన అతనాసియస్గార్ని కూడా తోడ్కొని వెళ్లారు. ఈ సమావేశంలోనే క్రీస్తు దైవ స్వభావాన్ని తిరస్కరించిన ఎరియన్లు ఆయన అనుచరులను మత బహిష్కారం చేయడం జరిగింది.క్రీస్తునిలో దైవ మానవస్వభావాలు అణిగి ఉన్నాయని తిరుగులేని విధంగా తీర్మానించడం జరిగింది. ఈ మహాసభల్లో పండుముసలివారైన తమ బిషప్పుగారి తరఫున అతనాసియస్గారే చర్చల్లో పాల్గొన్నారు. గలేరియన్ వేదహింసల్లో అష్టకష్టాలుపడి అంతగా మాట్లాడేశక్తి లేకున్న తన బిషప్పుగారి భావాల్ని అతనాసియస్ గారు చాలాచక్కగా విశదపరచగలిగారు.

క్రీ|శ|| 328లో అలెగ్జాండ్రియా పీఠాధిపతి మరణానంతరం అతనిసియస్ గారిచే ఆ ఖాళీ పూరింపబడింది. కేవలం 31వ ఏటనే వారు బిషప్పు అయ్యారు. వారి యొక్క 46 సంవత్సరాల సుదీర్ఘ అపోస్తోలిక పాలనలో తమ చిన్నమంద అభివృద్దికి ఆదర్శానికి పూర్తి శ్రద్ధ వహించారు. అయితే శ్రీసభకు వ్యతిరేకంగా పోతున్న ఎరియనిజం శాఖవారు చక్రవర్తి రాజరిక పలుకుబడితో కుట్రచేసి 17సం||ల వరకు బిషప్ అతనాసియస్గార్ని పదవీ భ్రష్టుల్ని చేసి దాదాపు 5సార్లు దేశ బహిష్కారం గావించారు.ఎన్ని జరిగినా క్రీస్తు దైవత్వాన్ని పరిపూర్ణంగా నమ్మి ప్రచారంచేసి ఆ విశ్వాసం కోసం ఎన్ని అపాయాలు, హింసలు ఎదురైనా క్రీస్తు దైవ యోధుడుగా పేర్గాంచారు.
పగ, కోపం, ద్వేషం అంటే ఏమాత్రం పొడగిట్టని బిషప్ అతనిసియస్గారు, కేవలం దయప్రేమలతో ఓపికతో మంచి మాటలతోనే విరోధులకు నచ్చజెప్ప ప్రయత్నించేవారు. 

వారు ఉన్న పళంగా మాట్లాడే చతురోక్తులు ఒక్కోసారి శత్రువులగుండెల్లో ఈర్ష్య పుట్టించేవి. ఆనాటి మతపరమైన రాజరిక వత్తిళ్లలో ‘ప్రపంచానికి ఎదురు నిలిచిన అతనాసియస్' అని అప్పటి పరిస్థితుల్ని బట్టి విశ్వాసులంటారు. మరియు కతోలిక శ్రీసభ విశ్వాస పితామహుడు. వేదాంత శాస్త్రంగా విజ్ఞాన శాస్త్రంగా రూపించి చెప్పగల సమర్థ పండితుడని కీర్తిస్తుంటారు. సుదీర్చ 50ఏండ్ల జటిల క్రైస్తవ చరిత్రలో కతోలిక క్రైస్తవ విశ్వాసానికి గౌరవానికి ఐక్యతకు వీరే ప్రధాన మద్దతుదారుల్లో ఒకరుగా విరాజిల్లారు. క్రీ||శ|| 381లో కాన్స్టాంట్ నోపుల్లో జరిగిన క్రైస్తవ మతాధిపతుల సమావేశంలో ఎరియనిజం పూర్తిగా ఓడింపబడి కతోలిక విశ్వాసం పూర్తి విజయం సాధించి అసలు సమస్య సద్దుమణగడంతో బిషప్ అతనాసియస్ గార్కి మంచి రోజులు మనశ్శాంతి లభించాయి. 

వారు తమ 76వ ఏట క్రీ||శ|| 373 మే 2వ తేదీన విరోధులచే హత్యగావింప బడి వేదసాక్షి మరణ చెంది మహానీయు పునీతునిగా ప్రకటింపబడ్డారు. పునీత అతనాసియస్గారు తమ 20సం||ల వయస్సులో డీకనుగా ఉన్నప్పుడే క్రీస్తు భగవానుని మనుష్యావతార మరణ పునరుత్థానాల పై ఒక పుస్తకం మరియు ఎరియనిజం ఖండన చరిత్ర వ్రాశారు. ఈజిప్టు నిర్జన ప్రదేశాలైన అడవుల్లో తపమాచరించే సన్యాసులు గురువులకు లేఖ ఇత్యాది రచనలు చేశారు.“అతనాసియస్ విశ్వాస సంగ్రహం' కూడ వెల్లడైంది కాని, అదివారు నేరుగా వ్రాసిందికాదు. వారి రచనల్లో నుండి వారు వెలుబుచ్చిన విశ్వాససత్యాల్నే కూర్చి విశ్వాసులు తయారుచేసిన జపంగా చెప్పబడుతుంది. పునీత అతనాసియస్గారు తమ జీవితంలో మానవాళికి అందించిన విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి ఒక్కరు ఈ లోక సుఖాలకై వెంపర్లాడక వైరాగ్య జీవితంకు ప్రాధాన్యతనివ్వాల'ని అర్థించారు.


Saint Athanasius was born in Alexandria, Egypt, towards the end of the third century, and from his youth was pious, learned, and deeply versed in the sacred writings. He left the paternal home to be raised by the bishop of Alexandria like a new Samuel in the Lord's temple, as befitted one whom God had chosen to be the champion and defender of His Church against the Arian heresy, which denied the Divinity of Christ.

While still a deacon, he was chosen by Saint Alexander, his bishop, to go with him to the Council of Nicea, A.D. 325. There he attracted the attention of all the prelates by the learning and ability with which he defended the Faith. Five months later, as Saint Alexander was dying, he recommended Athanasius for his successor as Patriarch of Alexandria, and in that office for forty-six years the new Patriarch bore the whole brunt of the Arian assault, often virtually alone and undefended.

When the invincible Athanasius refused to restore Arius to Catholic communion, he was exiled to Treves in France, and the Emperor ordered the Catholic Patriarch of Constantinople to receive the heresiarch. The end of that man of error is very instructive. He took an oath that he had always believed as the Church believes, though he taught that there was a time when the Word of God WAS NOT. 

Thereupon the Catholic Patriarch of Constantinople, with Saint James of Nisibe, who was in Constantinople at that time, Saint Athanasius in France and the Catholics everywhere, had recourse to fasting and prayer, that God would avert from the Church the frightful sacrilege. The day came for the solemn entrance of Arius into the great church of Saint Sophia.The heresiarch and his party set out, elated, in triumph. But before he reached the church, death smote him in an exemplary, swift and terrible way, and the dreaded sacrilege was averted.

Saint Athanasius stood unmoved against four Roman emperors, was banished five times, was the butt of every insult, calumny and wrong the Arians could devise, and lived in constant peril of death. Though strong as diamond in defense of the Faith, he was meek and humble, pleasant and winning in conversation, beloved by his flock, unwearied in labors, prayer and mortification, eloquent in speech, and unsurpassed in zeal for souls. 

From his places of exile he wrote many great works for the instruction and strengthening of his flock, writings rich in thought and learning, clear, keen and stately in expression. He is honored as one of the greatest of the Doctors of the Church.His admirers told the story of his response to a search party pursuing him downstream, as he retreated by boat. Knowing of their approach, he ordered the captain to change direction and return. When he crossed the search party on the river, they hailed him and asked whether he had seen the bishop of Alexandria pass by. He replied, Continue; he is not far from here. Restored to his see by the emperor Va lens for fear of a popular uprising, the stormy life of the Saint closed in peace on May 2nd of the year 373.

Add new comment

1 + 12 =