SAINT OF THE DAY – May 19 పునీత 5వ పీటర్ సెలస్టీన్|POPE ST. CELESTINE V 

@pjsri

(193వ పోపు, మతసాక్షి క్రీ||శ|| 1215 - 1296) ఇటలీదేశంలోని మొరోన్ పట్టణంలో పీటర్ సెలస్టీన్గారు క్రీ||శ|| 1215లో జన్మించారు. దక్షిణ ఇటలీలోగల అరణ్యాలలో నిత్యప్రార్థన ఆచరించే సన్యాసిగా వీరగణుతికెక్కారు. బెనెడిక్టుసభకు చెందిన గురువుగా వారు అభిషిక్తులై ఉన్నారు. క్రీ||శ|| 1294లో ఒకరోజు శ్రీసభకుచెందిన ముగ్గురు అగ్రమఠాధిపతులు, పెద్దసంఖ్యలో గురువులు, ప్రజాసమూహం పీటర్ సెలస్టేన్గార్ని సందర్శించి వారిని నూతన పోపుగారిగా ఎన్నుకున్నారు. ఇది ఎంతో వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. 

ఆనందబాష్పాలతో దైవచిత్తాన్ని సమ్మతించి తమ తాపస్విక ఏకాంతవాసాన్ని విడనాడి ప్రజల్లోకి వచ్చారు. ఒక గాడిద పైకూర్చుని పర్వతదారులవెంట అక్విలాపట్టణం చేరుకున్నారు. వారితో పాటు 2వ చార్లెస్ అనబడు నేపుల్స్ రాజ్యరాజు మరియు హంగరీదేశ ప్రఖ్యాతభక్తుడు చార్లెస్ మార్టల్ మరికొందరు భక్తగణంతో వారు నేపుల్స్లో విడిదిచేశారు. అప్పటికి ఈ నూతన పోపుగార్కి 79సం||ల వయస్సు, కురువృద్దులు. కాని గాలిపాటులా పోపు అత్యున్నత పదవివరించింది. నేపుల్సులోనే ఉండి కొంతకాలం శ్రీసభను పాలింపవలసిందిగా అక్కడ ప్రముఖులు, ప్రజలు కోరారు. కనుక వారు నేపుల్సులోనే బసచేసి తమపనులు నిర్వర్తించారు. అక్కడ వారు ఒకరిని మాత్రం తిరస్కరించి 13 మంది ప్రముఖులకు కార్డినలు పదవినిచ్చారు. 

అనేక ప్రయోజనాలు కూర్చే నిర్ణయాలు చేశారు. కార్యాలయాల స్థావన కు అనుమతినిచ్చారు. వారియొక్క అమాయకత్వం మూలంగా వారిని విమర్శించేవారిలో కొందరికి కూడా ఉన్నత పదవులివ్వడాన పోపుగారి అత్యున్నత క్యూరియా సమావేశాల్లో కొంతగందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక ఆరుమాసాలు గడిచాక 5వ పీటర్ సెలస్టీన్గారు తమ పోపు పదవికి రాజీనామాచేశారు. తన ఈ వయోభారంలో ఒక సన్యాసిగా జీవించడం ఉత్తమం అని చెప్పారు. ఈ ప్రపంచప్రజల్లో మెలగడం తనకు అనుభవంలేనందున సంపూర్ణ శక్తియుక్తలతో పనిచేయజాలనని చెప్పి తిరిగి తమ పూర్వస్థానమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. అనంతరం 8వ బోని ఫేసుగారు పోపు పదవినలంక రించారు. 

వృద్ధులైన పీటర్ సెలస్టీను పోపుగారి విరోధులేమైనా చేయగలరేమోనని వారిని అనాగ్ని పట్టణదాపులోని ఒక గుహలో పూర్తి భద్రతమధ్య ఉంచారు. అలా పదిమాసాలపాటు ప్రార్థన ఉపవాసాలతో గడిపి క్రీశ 1296లో తమ 81వ ఏట అంతిమశ్వాస విడిచారు.


Saint Peter #Celestine was the eleventh of the twelve children of a poor Italian farmer. As a child, Peter had visions of our Blessed Lady, Angels and Saints. His heavenly visitors encouraged him in his prayers and chided him when he fell into any fault. 

His mother, though only a poor widow, sent him to school, feeling sure that he would one day be a Saint. At the age of twenty, he left his home in Apulia to live in a mountain solitude. Here he passed three years, assaulted by the evil spirits and beset with temptations of the flesh, but consoled by the visits of Angels. 

After this his seclusion was invaded by disciples who refused to be sent away; and the rule of life which he gave them formed the foundation of the Celestines, a branch of the Order of Saint Benedict. Angels assisted in the church which Peter built; unseen bells rang peals of surpassing sweetness, and heavenly music filled the sanctuary when he offered the Holy Sacrifice; he had consented to be ordained, to find in the Holy Eucharist assistance against temptation.

Suddenly the poor anchorite found himself torn from his loved solitude, having been named by acclamation to the Papal throne, which had remained vacant for twenty-seven months. Resistance was of no avail. He took the name of Celestine, to remind him of the heaven he was leaving and for which he sighed. He was seventy-two years old. 

After a reign of five months, Peter judged himself unfit for the office, and summoning the cardinals to his presence, he solemnly resigned his trust.During the remaining three years of his life he worked many and great miracles. On the day after his abdication, his blessing after Mass healed a lame man. 

Saint Peter left the palace, desiring seclusion, but was brought back by the papal guards, for his successor feared a schism; crowds had followed Saint Peter. Lest he be prevailed upon to take back his office, he was put under surveillance at Anagni. Content, he remarked: I desired nothing but a cell, and a cell they have given me. And there he enjoyed his former loving intimacy with the Saints and Angels, and sang the Divine praises almost continually.

At length, on Pentecost Sunday he told his guards he would die within the week, and immediately fell ill. He received the Last Sacraments, and the following Saturday, as he finished the concluding verse of Lauds, Let every spirit bless the Lord! he closed his eyes to this world and opened them to the vision of God.

Add new comment

3 + 1 =