SAINT OF THE DAY – May 18 కాంటలిస్ నగర పునీతఫెలిక్సు|ST. FELIX OF CANTALICE

@pjsri

(మతసాక్షి క్రీIIశII 1518 - 1587) ఫెలిక్సు ఇటలీదేశంలోని అబ్రుజ్జి అనేచోట క్రీ.శ. 1518లో జన్మించారు. భక్తిలో పెరిగి పెద్దవాడ య్యా రు. కష్టజీవులైన తల్లిదండ్రులు వీరిని చదివించలేక పోయారు.వీరుకూడ తల్లిదండ్రులకు భారం కాకూడదని బాల్యంనుండే తాను ఒక వ్యవసాయ కూలీగా జీవితాన్ని మొదలు పెట్టారు. శ్రమజీవనాన్ని కొనసాగిస్తున్నాకూడా, ప్రార్థనా జీవితాన్ని వారు ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోతున్నాయి. కాని దేవునికోసం తానేం చేయగలుగుతున్నానని, గాను గెద్దులాంటి ఏమి బ్రతుకిది అనుకొని తన 29వ ఏట దైవ సేవపట్ల తపన ఆకర్షణ కలవారై తానొక బ్రదరుగా మరజీవితాన్ని కొనసాగించేందుకు క్రీIIశl 1547లో పునీత ఫ్రాన్సీస్ అస్సిసివారి కపూచియన్సభలో చేరారు.

పెలికుగారు తాను బ్రదరుగా చేరిననాటినుండి జీవితాంతం వరకు ఇటలీలోని సోమునగరంలో నివాసముంటూ మఠంకోసం, సభ్యుల అవసరాలకోసం ప్రతిదినం నగరవీదులో పాదయాత్రచేస్తూ విరాళాల్ని సేకరించేవారు. భిక్షాటనచేసేటప్పుడు ప్రజలు ఆదరంతో ధర్మంచేసినాగాని, లేక అవమానించి అవహేళనచేసినాగాని *మాదిరిగా స్పందిస్తూ “సర్వేశ్వరునికి వందనములు" అని అందర్నీ సాదరంగా దీవించేవారు. అందువల్ల ఫెలిక్సుగార్ని “సర్వేశ్వరునికి వందనాలబ్రదరు” అంటూ మారు పేరుతో సంబోధింస్తుండేవారు ప్రజలు.

ఫెలిక్సు చదువురాని వారైననూ ప్రార్థించడంలోను, పవిత్రంగా జీవించడంలోను, మఠంలో అందరికీ సహకారమందిచేబ్రదరుగాను పేరుగడించారు. ఆంతరంగ ఆథ్యాత్మిక దృష్టిగల దైవ సేవకునిగా ప్రసిద్దికెక్కారు. ఆరోజుల్లో ఇటలీలోని మిలాన్ పీఠానికి ఆర్చిబిషప్పుగా ఉన్న పునీత చార్లెస్ బొర్రోమియోగారు స్వతహాగాపండితులు. వారు ఒక రోజు మహాపండిత గురువైన పునీత ఫిలిప్ నేరిగార్ని కలసికొని గురువులకు కొన్ని కట్టుబాట్లు రూపొందించడం గురించి చర్చించాలని కోరారు. 

అయితే ఫిలిప్ నేరిగారు ఏమాత్రం సంకోచించకుండా ఇలాంటి నియమనిబంధనలకు సంబంధించిన విషయాలకు సరియైన సలహాలు సూచనలు ఫెలిక్సుబ్రదరుగారు బాగా ఇవ్వగలరని, వారిని సంప్రదించడం ఉత్తమంగా ఉంటుందని సలహానుఇచ్చారు. అంటే వేదాంతవేత్తలుకూడా వారి సమస్యల్ని ఫెలిక్స్గారికి విన్నవించుకొనేందుకు సంకోచించేవారుకాదని తెలుస్తుంది.ఫెలిక్సుగారికి ప్రజల అంతరంగ ఆలోచనలను ఆత్మలను చదివే వరశక్తిని దేవుడు ప్రసాదించడం ఒక విశేషం. 

వారు తరచు వీధుల్లోకి వెళ్లినప్పుడు ఎంతటి ఉన్నత పదవుల్లో వున్నవారినైనా, ఎంతటి ధనికులనైనా వారిని నిలదీసి వారి మలిన హృదయాలగురించి తెల్పేవారు. అవినీతి న్యాయమూర్తులు, లంచగొండి అధికారులు, విచ్చలవిడిగా తిరిగే యువతను మందలించి నీతిగా, దైవబిడ్డలుగా జీవించమని కోరేవారు. వారిని తమ శోధనల నుండి జయించుకోడానికి చక్కని సలహాలు నిర్దేశించేవారు. ఈ లోకజీవితము భవిష్యత్తులో తమ పరలోక జీవితంకు నాంది ఎలా కాగలదో వివరించేవారు. క్రీస్తును ఆదర్శంగా తీసికొని వారి సుబోధలను పాటించి వారు అందించిన మోక్షభాగ్య సంపదకు అర్హులుకమ్మని నచ్చజెప్పేవారు. 

ఫెలిక్సుగారు ఆ రోజుల్లో రోమునగరంలో ప్రతి ఏటా నిర్వహించే మద్యపాన వార్షికోత్సవాల్ని అరికట్టేందుకు ఒక ఉద్యమాన్నే చేపట్టారు. మితిమీరిన త్రాగుడు ధననష్టం ఆరోగ్యానికి హానికరం, సమాజగౌరవానికి భంగమేకాక అది సకల అనర్థాలకు అకృత్యాలకు కారణమవుతుందని హెచ్చరించారు. దేవుని రాజ్యంకోసం వెదకాల్సిన మానవులు ఇలా మద్యానికి ఇతర పిచ్చి అలవాట్లకు బానిసలు కారాదని, ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యకర సమాజం, ఆరోగ్యకర పరిపాలనకు అభివృద్ధికి దోహదపడి దైవాశీర్వారాలతో భువినే దివిగా మార్చవచ్చని గట్టిగా చెప్పారు. 

వీరి ఒత్తిడివల్లనే మద్యపాన వార్షికోత్సవాల్ని ప్రభుత్వం రద్దుచేసింది. ఫెలిక్సుగారికి ధన్యవాదాలు తెల్పుకుంది.ఫెలిక్సుగారికి పిల్లలంటే అమితప్రేమ. వారిని చేరదీసి మంచితనంయొక్క సౌందర్యాన్ని, పరిమళాన్ని, పాపం చేయుటవలన ఆత్మకు చుట్టుకునే మాలిన్యపుకంపును గురించి చిన్నచిన్న గీతాలద్వారా వారికి వివరించేవారు. నీతి పద్యాలు, పొడుపుకథలరూపంలో పెద్దవాళ్లకు ఆథ్యాత్మిక హితబోధల్నిచేసి క్రీస్తు సందేశాల్ని ప్రత్యక్షపరచేవారు. 

వినేవాళ్లు తమ పనులను మరచి తన్మయత్వంతో వారి ముచ్చటైన మాటలను విని ఆచరింప ప్రయత్నంచేశారు. ఇలా ఎందరో వారిమూలమున తమ జీవితాలను మెరుగుపరచుకున్నారు. జీవించేది ఎందుకో పరమార్థం తెలుసుకున్నారు. ఫెలిక్సుగారు గొప్ప వినయశీలి, నిరాడంబరుడు. ఆథ్యాత్మిక ఆనందం వారి ముఖంలో ఎల్లప్పుడూ తొణికిసలాడేది. తాను తమమఠంలో ఏది అవసరపడినా భిక్షమడిగో, ఖరీదుచేసో మోసికొచ్చి మఠసభ్యులను సంతృప్తి పరచేవారు. అందుకే ఫెలిక్సుగారు తనను గురించి తానే “కపూచియన్ మఠవాసులగాడిద' గా అభివర్ణించుకుని ఆహ్లాదపరచేవారు. వీరు తమ 69వ ఏట క్రీ||శ|| 1587లో పరలోకప్రాప్తినొందారు. పునీతునిగా గుర్తింపుబడినారు. ఫెలిక్సు అంటే ఆనందం.


It was in a small village at the foot of Mount Apennines named Cantalice, that Saint Felix was born in 1513 of pious but poor parents, whose names were Saint and Sainte. It was not long before the little boy, when he approached the other children, was hailed by them: Here comes Felix, the Saint! 

He showed a predilection for solitary prayer from his earliest youth, and as a little shepherd used to retire to a quiet place to kneel there and meditate on the Passion of Jesus.When he was a little older, he resolved to take the habit of the Capuchin Friars. The rigor of their rule could not deter him, but his obligations could; he was employed as a laborer. 

When his life was spared in an accident, during which two runaway bulls and a trailing plow should have killed him, the man for whom he was working saw the hand of God in his preservation and permitted him to leave, to enter religion. He was at that time nearly thirty years old, but the Superiors, observing his fervor, placed no obstacles.
In 1545 he pronounced his vows and was sent to Rome, where for forty years he begged for the community. 

His characteristic words to his companion were: Let us go, my Brother, with rosary in hand, our eyes to the ground and our spirit in heaven. He was of an exquisite politeness, extreme gentleness and great simplicity. The sick persons he visited at night became attached to him, and for his part, he sought them out everywhere in Rome, insofar as obedience permitted.

One day on the street he met two duelists with sword in hand. He begged them to repeat after him, Deo gratias! which finally they did, and after taking him as arbiter of their quarrel, they separated as good friends. Saint Felix met Saint Philip Neri in Rome, and they became friends who wished one another all possible torments for the love of Jesus Christ. They sometimes remained together without speaking for considerable periods, seemingly transported with joy.

Saint Felix had a great devotion to the most Blessed Virgin, reciting Her rosary with such tenderness that he could not continue at times. He loved the Holy Name of Jesus, and invited the children he would meet to say it with him. He slept only for about two hours, going afterwards to the church and remaining there in prayer until the office of Prime; then he would serve the first Mass and receive Communion every day.

When he was sick and was given the last Sacraments, he saw the Blessed Virgin and a beautiful troop of Angels coming to fortify him in this last journey. He cried out in joy, and gave up his soul peacefully to his Creator in 1587. He was canonized by Pope Clement XI in 1712. His body is in the Capuchin Church of Rome; a plenary indulgence is granted to those who, fulfilling the ordinary conditions, visit a church of his Order on his feast day.

Add new comment

1 + 1 =