SAINT OF THE DAY – May 17 పునీత పస్కాల్ బైలోన్ |ST. PASCHAL BAYLON

@pjsri

(గురువు, మతసాక్షి క్రీ.శ. 1540 - 1592) స్పెయిన్ దేశంలో అరగాన్ మండలంలో క పునీత పస్కాల్ బేలొన్ ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబంలో క్రీ.శII 1540లో జన్మించారు. పెంతెకోస్తు రోజు పుట్టడాన వారికి పస్కాల్ అని పేరు పెట్టడమైంది. స్పెయిన్లో పెంతెకోస్తును పస్క ఆఫ్ ది హోలి స్పిరిట్ అనగా పవిత్రాత్మ రాకడ అంటారు. బాలుడు పెరుగుతున్న కొద్ది ముఖవర్చస్సులో దైవభక్తి ఉట్టిపడుతుండేది. అదే ఒరవడిలో ఆ బాలుడు దివ్యసత్రసాద ఏసుని ఆరాధనతో ప్రత్యేకతను ధృఢ భక్తిని కలిగి ఉన్నారు. వారు తమ 22వ ఏట వరకు గొర్రెలకాపరిగా పనిచేశారు. 

ఆ తర్వాత క్రీ.శII 1562లో ఫ్రాన్సీస్ వారిసభలో ప్రవేశించారు. అల్సాంతరిన్ రచించిన సంస్కరణలతో ఉత్తమ సన్యాసి జీవిత కట్టుబాట్లతో ఉన్న ఆ సభలో తమభక్తి సేవించడం మొదలు పెట్టారు. ఆ సభవార్ల అనేక మఠాలయాల్లో ప్రధాన గేటు లేక తలుపు వద్ద కాపలాదారుగా స్పెయిన్ అంతటా పనిచేశారు. నిత్య మర్యాదస్థుడు, దయ కనికర దానమూర్తి కావడాన పేదలు, కష్టాల్లో ఉన్న వారికి ఒక ఆదరణ కర్తగా పేరు గడించారు.

వారికి దివ్యసత్రసాద భక్తి మెండుకావడాన గంటలకొద్ది ఆ ఆరాధనలోనే గడి పేవారు. మనమధ్య దేవుడు మనతో వాసముండే దేవుడు, మన మొరలను ఆలించి పాలించే దేవుడు ఏసుప్రభువును ఈ దివ్యసత్రసాదంద్వారా సాక్షాత్కరించుకుంటున్నామనిభక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. తద్వారా అనేక విశ్వాససత్యాలు, జ్ఞాన సంబంధ సమస్యలకు సమాధానాలు వారివద్ద మనకు లభించే దైవాశీర్వాదం వారికి మెండుగా ఉండేది. పస్కాల్గారికి ప్రాథమిక విద్యమాత్రమే తెలుసు. కాని ఆథ్యాత్మిక విద్యలో మాత్రం నిష్ణాతుడయ్యారు. సమకాలీన అనగా ఆరోజుల్లో ఆ చుట్టు ప్రక్కల నివశించిన ఎందరో పుణ్యాత్ములు, జీవిస్తున్న పునీతులతో పరిచయాలు పెంచుకొని ఎక్కువ సఖ్యత కలిగి ఉండేవారు. 

గొప్ప దైవిజ్ఞుడుగా పేరొందిన పస్కాల్గారి యొద్దకు వివిధరంగాలకు చెందిన ప్రజలు విరివిగా వచ్చి సలహా సంప్రదింపులతో సంతోషంగా వెళ్లేవారు. క్రీIIశII 1570లో పునీత పస్కాల్ గారు ఫ్రాన్సుదేశంలోని హ్యుగుయెనాట్ పట్టణం కు కాలినడకన వెళ్లారు. అతికష్టమైన ప్రయాణాన్ని సులభంగా చేయకలిగారు. అలాగే ఆ పట్టణంలో దివ్యసత్రసాద భక్తుడైన పస్కాల్గార్ని కేల్వనిస్ట్ ప్రొటెస్టెంటులు చుట్టుముట్టారు. పస్కాల్గారు దివ్యసత్రసాదంలో ఏసుప్రభువు సంపూర్ణంగా సాక్షాత్కరించి ఉన్నారని కతోలిక మత సిద్దాంతాన్ని సోదాహరణంగా వివరించారు. అక్కడ ఉన్న ఒక కేల్వనిస్టు మత శాఖకు చెందిన న్యాయాధిపతి న్యాయాన్యాయాలు ఎంచక అక్కడ గుమికూడిన ప్రజల్లో అత్యధికులు పస్కాల్గార్ని వ్యతిరేకిస్తున్నారు కాన వారిని దోషిగా నిర్ణయించారు. 

క్రీ||శ|| 1592లో పస్కాల్ బైలోన్గారు పరమపదించారు. దివ్యసత్రసాద మహాసభలు, సమావేశాలకు, పండుగ ఆరాధనలకు పునీత పస్కాల్గారు పాలక పునీతునిగా నియమింపబడ్డారు. పాస్కల్ అనగా ఈస్టరు దినమున పుట్టాడు అని అర్థం.


From his childhood Saint Paschal seems to have been marked out for the service of God. Amid his daily labors as a shepherd, he found time to instruct and evangelize the rude herdsmen who kept their flocks on the hills of Aragon. At the age of twenty-four he entered the reformed Franciscan Order near the town of Mon-fort, Spain, where he remained, out of humility, a simple lay brother, occupying himself by preference with the roughest and most servile tasks.

He was distinguished by his ardent devotion and love for the Blessed Sacrament. He would spend hours on his knees before the tabernacle, often being raised from the ground in the fervor of his prayer. And there, from the authentic and eternal Truth, he drew such stores of wisdom that, unlettered as he was, he was considered by all a master in theology and spiritual science. Shortly after his profession he was sent to Paris on business connected with his Order. 

The journey was full of perils, owing to the hostility of the Huguenots, who were numerous at the time in the south of France; and on four separate occasions Paschal was in imminent danger of death at their hands. Twice he was taken for a spy; but it was not God's will that His servant should obtain the crown of martyrdom which he so earnestly desired, though he regarded himself as unworthy of it. He returned in safety to his convent, where he would later die in the odor of sanctity in 1592.

Multitudes witnessed the miracles which took place during the three days his body was exposed for veneration. He was canonized in 1690, and in 1897 declared patron of all Eucharistic congresses and confraternities.

Add new comment

1 + 0 =