SAINT OF THE DAY – May 14 పునీత మత్తియాసు|ST. MATHEW THE APOSTLE

@pjsri

(అపోస్తలుడు, వేదసాక్షి 1వ శతాబ్దం) పునీత మత్తియాసుగారి గురించి అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఏసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిజం పొందిన కాలంనుండి ప్రభువు అనుచర్లులో ఒకరుగా ఉంటూవచ్చారు. ప్రభువునకు నమ్మక ద్రోహం చేసిన యూదా ఇస్కారియోతో ఆత్మహత్య చేసుకోవడంతో ఏసువారి ప్రండ్రెండు మంది ప్రధాన శిష్యుల్లో ఒక ఖాళీ ఏర్పడింది. వేదవాక్యం నెరవేరునట్లుగా ఆ ఖాళీ పూరింపబడాల్సి ఉంది (అ.కా. 1:20) మరో శిష్యున్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. 

అందుకోసం ఏసుప్రభువు వారి మోక్షారోహణం అనంతరం అపోస్తళ్లు ఇరువురు అనుచరుల్ని ఎంపికచేశారు. వారిలో ఏ ఒక్కరినో అదృష్ట చీట్లువేసి ఎన్నుకోవాలనుకున్నారు. వారిరువురిలో ఒకరు యూస్తు అను మారు పేరుగల బరబ్బా అనబడిన యోసేపు మరియు మత్తియాసు (మత్తయ) గారు. అపోస్తళ్లు ప్రభువువారి పరిశుద్ద నామమున ప్రార్థించి అదృష్ట చీట్లు వేశారు. చీటి మత్తియాస్ గారి పేరట వచ్చింది. దాంతో పండ్రెండవ అపోస్తలునిగా చేర్చుకోబడ్డారు(అ.కా. 1:23-26). 

సీమోను పేతురుగారు శ్రీసభ జగద్గురువులుకాగా మిగతా అపోస్తళ్లందరు పీఠాధిపతులుగా క్రీస్తువారు జీవించిన రోజుల్లో తమ మాటలు చేతలతో అభిషేకితులైనవారే. కొంతమంది చెబుతున్న దానిప్రకారం అపోస్తలుడైన మతాసుగారు యూదయా, ఇతియోపియా ప్రాంతాలలో క్రైస్తవాన్ని గురించి బోధించి, అక్కడే సిలువ వేయబడినారని తెలుస్తోంది. మరికొందరి వాదన ప్రకారం యెరూషలేంవద్ద వారు క్రూరంగా శిరచ్ఛేదనం గావింపబడ్డారని ప్రచారంలో ఉంది. మొత్తంమీద క్రీస్తువారి విశ్వాసంకోసం వేదసాక్షి మరణం పొందారని రూఢిఅవుతుంది. 

పునీత మత్యాసుగారిని దర్జీపనివాళ్లు, వడ్రంగి పనివాళ్లకు త్రాగుడు మానేవారికి పాలక పునీతులుగా శ్రీసభ నియమించింది. మశూచి ప్రబలినప్పుడు మత్తియాసు గారిని ప్రార్థిస్తే అది తగ్గిపోతుందని ఆనవాయితీగా వస్తున్న సనాతన నమ్మకం. మతాసు అనగా దేవుడిచ్చిన కానుక అని అర్థం.


After our Blessed Lord's Ascension His disciples came together, with Mary His mother and the eleven Apostles, in an upper room at Jerusalem. The little company numbered no more than one hundred and twenty souls. They were waiting for the promised coming of the Holy Ghost, and they persevered in prayer. Meanwhile there was a solemn act to be performed on the part of the Church, which could not be postponed. 

The place of the fallen Judas had to be filled, that the number of the Apostles might be complete. Saint Peter, therefore, as Vicar of Christ, arose to announce the divine decree. What the Holy Ghost had spoken by the mouth of David concerning Judas, he said, must be fulfilled. Of him it had been written, His bishopric let another take. 

A choice, therefore, was needed of one among those who had been their companions from the beginning, who could bear witness to the Resurrection of Jesus.Two were named of equal merit, Joseph called Barsabas, and Matthias. After praying to God, who knows the hearts of all men, to show which of these He had chosen, they cast lots, and the lot fell upon Matthias, who was thereby numbered with the Apostles.

It is recorded of the Saint, wonderfully elected to so high a vocation, that he was remarkable for his mortification of the flesh. It was thus that he made his election sure.He preached in Judea where he was persecuted by both Jews and Gentiles, and died by stoning, a victim of their pursuits, in the year 63. His body was taken to Rome by Saint Helena, mother of Constantine, some 250 years later. A church there bears his name.

Add new comment

2 + 7 =