SAINT OF THE DAY – May 13 ఫాతిమా జపమాల మాత |OUR LADY OF FATHIMA

@pjsri

1917 మే 13వ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడవ సంవత్సరం గడుస్తోంది. 80 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయం లోనే రష్యాదేశంలో బోలెవిక్ విప్లవం వచ్చి,లెనిన్, ట్రాట్ స్కీ నేతృత్వంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ సమయంలో పోర్చుగల్ దేశంలో ‘ఫాతిమా' అనబడే ఒక చిన్నపట్టణం ఉంది. ఆ పట్టణం వద్ద గొర్రెలు మేపుకునే లూసి, ఫ్రాన్సీస్, జసింత అనే మువ్వురు పిల్లలకు దేవుని తల్లి మరియమాత తొలిసారిగా దర్శనమయ్యారు. దఫాలు దఫాలుగా ఆరుసార్లు ప్రత్యక్షమవడం విశేషం. ఆ తల్లి ఆ పిల్లల ద్వారా లోకానికి ప్రత్యేక సందేశమందించారు.

యుద్దంచేత ప్రపంచం చిన్నాభిన్నం అవుతుందని ఆమె సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మానవులు తమ ఆలోచనలద్వారా, మాటలద్వారా, అనేక పనులద్వారా చేస్తున్న వివిధ పాపాలు, అన్యాయాలకుగాను ప్రభువు ఎంతో వ్యధ చెందుతున్నారని తెలియజేశారు. పాపాత్ములు మనస్సు మార్చుకోవాలి, చేసిన పాపాలకు దుఃఖపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ తల్లి తమ సందేశంలో మానవాళి శ్రేయస్సు కోరి హెచ్చరించారు.వీరిని నరకం నుండి రక్షించడమే ఆయమ్మ ప్రత్యేక సందేశ తాత్పర్యం.

ఏసునేర్పిన దేవుని ప్రేమ, సోదరప్రేమను మానవాళి ఆచరించాలని చెప్పకచెప్పారు.అంతే కాకుండా ప్రపంచ శాంతికోసం సమైక్యతకోసం భక్తితో జపమాలను ప్రార్థించమని ఆ తల్లి కోరారు. ప్రతిరోజు ఈ జపమాలను వల్లించడం మరువరాదని మరీ మరీ కోరారు. అలాగే ప్రతి గుర్తుకు చివరన “ఓనా ఏసువా! మా పాపములను మన్నిచండి. నరకాగ్నినుండి మమ్ము కాపాడండి. ఆత్మలన్నింటిని ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసికొనిపొండి”. అనే ప్రార్థనను కూడ వల్లించమని మాత కోరారు.

1917 అక్టోబరు 13వ తేదీన ఆ ముగ్గురు పిల్లలకు చివరిసారిగా ప్రత్యక్షమై “నేనే జపమాల మాతను. మానవాళి చేస్తున్న పాపాలకోసం ప్రాయశ్చిత్తం పొందాలని అడిగేందుకు నేను ఇచ్చటికి వచ్చాను. మనుష్యులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించారు.” అని తమ కడపటి దర్శనంలో దేవమాత తమ మనోవ్యధను వ్యక్తంచేశారు. ప్రతి శనివారము, మే మాసపు అన్నిరోజుల్లో ఆ తల్లి నేర్పిన జపమాలను ప్రత్యేకంగా చెప్పేందుకు శ్రీసభ ఏర్పాటు చేసింది. అనుదిన సాయంత్రాలు కూడా భక్తులు జపమాల చెప్తుంటారు.


Much has been written concerning the six famous apparitions of the Blessed Virgin Mary in a little town in Portugal between May 13 and October 13, 1917. Later it would be said, and rightly so, that everything She predicted there to the three little shepherds has been fulfilled point by point. The story is too long to tell in detail in a few words, and indeed it is not over yet. Our Lady of Fatima was sent to warn the 20th century that humanity had not followed the path that had been indicated to it by her Son; humanity had not developed as God intended, and the time of the last and worst enemy was fast approaching. 

She said that if Her requests for prayer and penance were not heard, Communism would spread its errors all over the earth. She appealed to the Apostles of the Latter Times to come forth, those who lived in humility, poverty and contempt for the world, repeating what She had already said at La Salette,France, in greater detail in 1846.During the final apparition on October 13th, She appeared as Our Lady of Mount Carmel, accompanied by Saint Joseph and the divine Child. Through Lucy of Fatima, Mary had promised a miracle to convince doubters of the reality of Her presence and the Will of God She had conveyed by Her words, and She fulfilled that promise. 

On October 13, 1917, the great Miracle of the Sun occurred, witnessed by all who were present at Fatima, an international crowd of 70,000 spectators. The sun whirled about and seemed to be plunging down as it sent off multicolored rays; many cried out that it was the end of the world.A large shrine was built at Fatima, and in the 1940's more than a thousand miracles had already been duly confirmed there. The famous Secret of Fatima, part of which was disclosed by the Vatican to certain heads of State in 1963, still remains largely a secret for most of the people who have been waiting for it since 1960, the year that the Virgin said it was to be made public.

Add new comment

1 + 3 =