SAINT OF THE DAY – May 12 పునీతులు నెరేయు, అల్లేయు మరియు దొమితిల్లమ్మ |ST. NEREUS, ACHILLES AND DOMITILLA

@pjsri

(రోమను వేదసాక్షులు 1వ శతాబ్దం) పునీత నెరేయు, పునీత అఖిల్లేయు అనేవారలు రోము రాజ్యంలో వీర సైనికులు. కాలక్రమంలో వారు క్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. వారు దయ, సోదర ప్రేమకే కట్టుబడి ఉండాలని తమ దైవం క్రీస్తు చిందించిన రక్తఫలాల్ని తాము పొందుకొని అనుభవించాలని పదుగురికి పంచి పెట్టాలనే ధ్యేయంతో రాజు ఇచ్చిన ఆయుధాల్ని విసర్జించారు. 

అందుకు ట్రోజన్ చక్రవర్తి మర్రి వృక్షంలా విస్తరిస్తున్న క్రైస్తవంపట్ల మరింత పట్టు బిగించాడు. క్రైస్తవ విశ్వాసి అంటే నేరస్తుడులా శాసనం చేయించి క్రైస్తవరక్తం ఏరులు పారించాడు. అదే పద్దతిలో నెరేయు, అఖిల్లేయు సైనికుల్ని దేశ బహిష్కారంచేసి 'తెర్రాసినా' దీవికి పంపించి అక్కడ వారిని చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత వారి తలలను తెగనరికించాడు. 

ఆ పునీతుల మృతదేహాలు దొమితిల్లా స్మశాన వాటికలో ఖననం చేయబడ్డాయి. ఆ ప్రదేశంలో పూర్వకాలంలోనే ఒక దేవాలయం క్రీ||శ|| 390లో సిరిసియస్ జగద్గురువులు నిర్మింపజేశారు. అది రోమునుండి అర్దయాతైన్ మార్గంలో నెలకొని ఉంది.

అయితే పై ఇరువురు పునీత సైనికులు క్రైస్తవులుగా మారినప్పుడు వారు ఫ్లావియా దొమితిల్లా అను క్రైస్తవ మహిళ ఇంట ఆశ్రయం తీసుకున్నారు. ఈ కారణంగా ఆ మహిళను కూడ దేశ బహిష్కార చేశాడు ట్రోజన్ చక్రవర్తి. విగ్రహారాధనచేస్తే విడుస్తానన్నా ఫలితం లేకపోయింది. అందువల్ల ఆయమ్మ అష్ట కష్టాలు పడినా క్రీస్తు విశ్వాసానికే కట్టుబడి ఉండి పోయింది. 

అందుకు చివరకు వారిని గనగన మండేమంటల్లో వేసి కాల్చారు. అలా పునీత ఫ్లావియా దొమితిల్లాగారు దహన వేదసాక్షి అయ్యారు. పైన పేర్కొన్న పునీతులను ఖననం చేసిన స్మశానవాటికలోనే ఆయమ్మ అవశేషాల్ని భద్రపరిచారు. వారి పేరటనే అది పునీత దొమితిల్లా స్మశాన వాటిక అని పేరు పెట్టారు.


Nereus and Achilleus were Roman soldiers. Out of fear, they carried the cruel commands of the Emperor, until suddenly they gave up this way of life. They were converted to the Christian Faith and left behind them their shields and bloody arrows forever. St. Peter baptized these two new followers of Jesus, who were soon accused of being Christians. Nereus and Achilleus both professed their Faith and again, but they absolutely refused to sacrifice to the false gods of the Romans. For this, they were at last beheaded.

Domitilla was a rich Roman girl who had made up her mind to belong only to Jesus. The young man who had hoped to marry her was furious at her decision. He accused her of being a Christian, and she was put in prison. There she suffered much. When she still would not give up her Faith, she was burned to death.

Let us often think of the happiness which is waiting for us in Heaven. This thought will make it easier to keep God’s law all the time.

Add new comment

4 + 0 =