SAINT OF THE DAY – May 11 పునీత లకోని ఇన్యాసి|ST. IGNATIUS OF LOCONI

@pjsri

(కపూచియన్ గురువు, శాంతి స్థాపకుడు క్రీ.శ 1701 - 1781) లకోని ఇన్యాసిగారు ఇటలీలోని సార్డీనియాలో ని' అనే ఊల్లో క్రీ||శ|| 1701లో పుట్టారు. వీరి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సీస్ చేసియస్ విన్సెంట్. పెరుగుతున్నకొద్ది బక్కపలచగా బలం లేకుండ ఒక జబ్బు సిగా ఉండేవారు. అట్టి బాలునికి తండ్రితో పాటు పొలంలో కష్టించి పనిచేయడం వల్ల ఇంకా కృశించిపోయేవారు. తమ 17వ ఏట వారు మరింత బలహీనత మరియు జబ్బువల్ల ప్రాణాంతకమైంది. తాను బాగుపడితే తమ జీవితాంతం ఫ్రాన్సీస్ అస్సిసివారికి అర్పించుకుని బ్రతుకుతానని మొక్కుబడి చేసుకున్నారు. 

ఇన్యాసివారి జబ్బు ఆశ్చర్యకరంగా నివారణయై సంపూర్ణ ఆరోగ్యం, కండబలం వచ్చింది. కపూచియన్ సభలో చేరాలని తమ నిర్ణయంను తండ్రి ఏదోఒక సాకు చెప్పి వాయిదా వేస్తున్నాడు. ఇవ్వాళ కాదు రేపు..... ఈ నెలకాదు..... వచ్చేఏడు.... మొక్కుబడి వెంటనే తీర్చాలనేమిలేదుకదాయని విసుగు పుట్టిస్తున్నాడు. ఎదిగిన కొడుకును చేతిక్రిందనే ఉంచుకోవాలని ఆశించాడు. కాని ఇన్యాసిగారి హృదయంలోని సన్యాసి జీవితార్పణ ఆశయం గజ్జల గుర్రంలా వేగం పుంజుకుంటుంది. 

తండ్రి కుంటిసాకులతో తాత్సారం చేస్తున్నా ఇన్యాసిగారు ఏదో ఒక సన్యాసి మఠంలో చేరడానికి వాకబుచేసుకున్నారు. కేగ్లియరి పట్టణంలోని బెనెడిక్టుసభలో ప్రవేశంకు రాయబారాలు నడిపారు. చివరకు ఒక కపూచియను బ్రదరుగా ప్రవేశం పొందకలిగారు. నోవిసు బ్రదరుగా శిక్షణలో ఉన్నాడు. బ్రదరుగా మాటపట్టు ఉత్సవం రోజున ఇన్యాసిగారి విషయం అనుమానాస్పదమైంది. కాని రెట్టింపు ఉత్సాహంతో ఇన్యాసిగారు తమ శిక్షణలో సంపూర్ణ మార్కులు సాధించారు. క్రీ||శ|| 1722సం||ర్ర అంతంలో వారికి మాటపట్టు ఇవ్వబడింది. ఆలస్యం. ఆలస్యం. ఆలస్యం అది గతకాలం. ఇప్పుడు నిర్ణీత సమయం... నిర్ణీత సమయం.... నిర్ణీత సమయం . ఇది బ్రదర్ ఇన్యాసిగారి జీవితంలోని మార్పు.

తమ జీవితమంతా కూడ కపూచియన్ బ్రదరుగా సభ కట్టుబాట్లను తప్పక పాటించేవారు. దేవుని ప్రేమలోను తోడి మనుష్యుల ప్రేమలోను రోజురోజుకు ఎదిగారు. క్రీ||శ|| 1741లో ఇన్యాసి బ్రదరుగారికి కపూచియను బ్రదరులందరి పోషణకై ఆహార పదార్థాల్ని ఊల్లో బిక్షమెత్తుకొని తీసికొచ్చే పనిని అప్పగించారు. తన 40సం||ల జీవిత కాలమంతా వీరికి అప్పగించిన ప్రధాన ఉద్యోగం ఇదే. ఎంతో విధేయతతో పరిశుద్ధతతో స్వేచ్చా పూర్వక దారిద్ర్యంతో క్రీస్తు విశ్వాస వ్యాప్తి కోసం తన మొక్కుబడిని చక్కగా నెరవేర్చారు. వారు భిక్షాటన చేసేటప్పుడు పేదలను, రోగులను కూడ సందర్శించేవారు.

అజ్ఞాన ప్రజలకు ఏసు దైవం గూర్చి, రక్షణ గూర్చి, ప్రార్థనా విధానం గూర్చి బోధించి వారిలో ఎంతో మార్పు తీసికొని వచ్చారు. కల్పిత దబ్బరదేవుళ్ల పూజలు మాని నిజమైన దైవం క్రీస్తు నాధుని సేవింప నేర్పించారు.పగలంతా బిక్షాటనే పనిగా గల వారికి స్వీయ ప్రార్థనకు అట్టే సమయం ఉండేదికాదు. అందువల్ల రాత్రుళ్లు తన ప్రార్థనను సుదీర్ఘంగా సలిపేవారు. కేవలం రెండు గంటలు మాత్రం నిద్రపోయేవారు. నేలపై పడుకునేవారు. ఒక చెక్కదుంగను తలగడగా వాడేవారు. అయినా వారి ఆరోగ్యంకు డోకాలేదు. 80వ ఏటకూడా పరిపుష్టంగా ఉన్నారు. వారు క్రీ||శ|| 1781 మే నెల 11వ తేదీన అకస్మాత్తుగా మరణ శయ్యపై ఉండిపోయారు. వారికి క్రీIIశ 1951లో 12వ భక్తినాథ పోపుగారి దివ్యహస్తాలమీదుగా పునీతపట్టా లభించింది. ఇన్యాసి అంటే అగ్నిజ్వాల, రగిలేడి నిప్పు, ఆరని మంట అని అర్థం.


Ignatius was the son of a poor farmer in Laconi, Italy. He was born on December 17, 1701. When he was about seventeen, he became very ill. He promised to be a Franciscan if he would get better. But when the illness left him, his father convinced him to wait. A couple of years later, Ignatius was almost killed when he lost control of his horse. Suddenly, however, the horse stopped and trotted on quietly. Ignatius was convinced, then, that God had saved his life. He made up his mind to follow his religious vocation at once.

Brother Ignatius never had any important position in the Franciscan order. For fifteen years he worked in the weaving shed. Then, for forty years, he was part of the team who went out from house to house. They requested food and donations to support the friars. Ignatius visited families and received their gift. But the people soon realized that they received a gift in return. Brother Ignatius consoled the sick and cheered up the lonely. He made peace between enemies, converted people hardened by sin and advised those in trouble. They began to wait for his visits.

There were some difficult days, too. Once in a while, a door was slammed in his face, and often the weather was bad. Always, there were miles and miles to walk. But Ignatius was dedicated. Yet people noticed he used to skip one house. The owner was a rich moneylender. He made the poor pay back much more than they could afford. This man felt humiliated because Ignatius never visited his home to ask for donations. He complained to Brother Ignatius' superior. The superior knew nothing about the moneylender so he sent Ignatius to his home. Brother Ignatius never said a word, but did as he was told.

He returned with a large sack of food. It was then that God worked a miracle. When the sack was emptied, blood dripped out. "This is the blood of the poor," Ignatius explained softly. "That is why I never ask for anything at that house." The friars began to pray that the moneylender would repent.Brother Ignatius died at the age of eighty, on May 11, 1781. He was proclaimed a saint by Pope Pius XII in 1951.

Add new comment

2 + 0 =