SAINT OF THE Day – May 1 కార్మికుడైన పునీత యోసేపు / ST. JOSEPH THE WORKER

@pjsri

అది 1955 మే 1వ తేదీ ఇటలీ దేశములోని రోమ్నగరంలో ఉన్న పునీత పేతురు దేవాలయ ఆవరణమంతా ఎంతో సందడిగా ఉంది. ఇటలీ కతోలిక కార్మిక సంఘ సభ్యులతో కిటకిటలాడుతోంది. వారంతా శ్రీసభ అమలుచేస్తున్న సాంఘిక కార్యక్రమాల యెడల తమ సుహృద్భావాన్ని విధేయతను వెల్లడిస్తూ, మరొకసారి తమ కార్మిక సంఘం పదవ వార్షికోత్సవం సందర్భంగా తమ అంకిత భావానికి ప్రతీకగా ప్రతిజ్ఞ చేసేటందుకు సంసిద్ధంగా ఉన్నారు. 

ఆ రోజున 10వ పయస్ (భక్తినాథ) పోపుగారు అచటచేరిన వారందరి సమక్షంలో మే నెల 1వ తేదీని కార్మికుడైన పునీత యో సేపుగారికి అంకితంచేసి ఆ రోజున ప్రతి సంవత్సరము కార్మిక దినోత్సవం కొనియాడి ఆ దీన శ్రమైకజీవి ఆదర్శాన్ని, ఆశీర్వాదాన్ని బడసి తరింపుడని శ్రీసభ మాటగా సందేశమిచ్చారు. ఇంకా పోపుగారు తమ ఉపదేశంలో ప్రపంచంలోని యావత్తు శ్రామిక వర్గాన్ని కాపరిగా, సంరక్షకుడుగా. తండ్రిగా పునీత యోసేపుగారు సహాయంగా సహకారిగా ఉంటారని ప్రకటించారు. స్వయంగా శ్రమజీవియైన యో సేపుగారు తన కాయకష్టంతో చెమటోడ్చి వడ్రంగి వృత్తి పై వచ్చే ఆదాయంతోనే ఏసు, మరియ యేసేపులన బడే పవిత్ర తిరుకుటుంబాన్ని పోషించుకున్నట్లు బైబిలుద్వారా స్పష్టమవుతోంది. 

ఈ కారణమును బట్టి పునీత యో సేపుగారికి కార్మక వర్గానికి సారూప్యతకలిగి అపూర్వ అవినాభావ సంబంధముందనడంలో సందేహంలేదు. ఇదిలా ఉండగా పరిశుద్ద 13వ లియో (సింహరాయలు) పోపుగారు 1889లో పునీత యోసేపుగారిని శ్రామికులు, కార్మికులు, కష్టజీవులు, నిర్లక్ష్యం చేయబడిన దీన జనాళికందరికి పాల కునిగా, మార్గదర్శకునిగా శ్రీ సభ తరపున పునరుద్ఘాటించారు. 

అలాగే కార్మికులు, చెమటోడ్చి కుటుంబ పోషణ భారాన్ని మోసేవారంతా పునీత యోసేపుగారిని మాతృకగా గైకొని తమ ప్రత్యేక మార్గచూపరిగా భావించి, వారిని స్వర్గరాజ్య పోషకునిగా గౌరవించాలని పోప్ 15వ బెనడిక్ట్ గారు ఆదేశించారు. నాస్తిక కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకుగాను శ్రీసభ సంరక్షకులుగా పునీత యో సేపుగారినే ఎంపికచేశారు 11వ పయస్ (భక్తినాథ) జగద్గురువులు.

కార్మిక ప్రజా తరగతికి చెందిన యోసేపుగారు పేదరికపు భారాన్ని మోస్తూ, జీవితాంతం వరకు శ్రమించి, మొదుకష్టంచేసి పరిశుద్ద తిరుకుటుంబ పోషకులుగా నిలిచారు. అందుకే అనునిత్యం తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ శరీరకష్టంతో చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించేవారికి యోసేపుగారు ఆదర్శంగా ఉన్నారని 11వ పయస్ (భక్తినాథ) జగద్గురువులే వివరించారు.

ఇలా కార్మిక దినోత్సవం దినాన పునీత యోసేపుగారి ఉత్సవాన్ని ఏర్పాటు చేయబడటం వల్ల ఈ దినానికి గొప్ప విశిష్ఠత ఆపాదింపబడిందనవచ్చును. శ్రమ, పని, కృషి, మానవప్రయత్నంకు ఎనలేని గౌరవం, ప్రాధాన్యత, ఘనత, విలువ, గుర్తింపు ఇవ్వబడిందనవచ్చును. పనికి తగ్గ ప్రతిఫలం గుర్తింపు లేనియెడల మానవ హృదయం ఒకింత కలత పడుతుంది. వ్యధచెందుతుంది. కాని పునీత యోసేపుగారి మధ్యవర్తిత్వంన కాయకష్టం ఏనాడూ వృథాపోదు.

కష్టేఫలి యని తన జీవితంలో దీనత్వం పేదరికం వల్ల పునీత యో సేపుగారు ఆశీర్వదింపబడి మంచి మరణంపొందారు. ఏసు మరియ హస్తాల్లో పట్టుకొనబడి పరలోక ప్రాప్తినొందారు. సజీవ మహిమ కిరీటాన్ని ధరించారు. భూ పరలోకాల్లోని ఆస్థిపాస్తులకు, శ్రమైక జీవులకు సంరక్షకునిగా పోషకునిగా తండ్రిగా దైవంచే ఎన్నుకొనబడినారనడంలో అనుమానం లేదు.

కాన కార్మిక కుటుంబాలను పునీత యోసేపుగారు అను నిత్యం తన జ్ఞాన ధృక్కులతో, దీవెనలతో కాచికాపాడుతారు. అసలు వారి తత్వమే అదికదా! క్రైస్తవ కార్మికుడికి సజీవ మాతృకయై నిరంతర మాదిరియై ఆదర్శ ప్రాయులైన పునీత యోసేపుగారిని గౌరవించడం, మన కుటుంబాల్లోకి ఆహ్వానించి మర్యాద చేయడం మన కనీస బాధ్యత. శ్రమను గౌరవించడమే యో సేపుగారిని గౌరవించినట్లు. బాధ్యతతో అరమరికలు లేక కష్టపడి పనిచేయడంలో ఎలాంటి సమస్యలు, చిక్కులు తారసిల్లినా వాటిని సామరస్యంగా పరిష్కరింప యోసేపుగారు తయారుగా ఉన్నారు. వారు కార్మికులకు అన్నివిధాలా వారి నైజంను బట్టి తోడ్పడతారు.

అందువల్ల ప్రతి క్రైస్తవ కార్మికుడు ఏ సంస్థలో, ఏ వృత్తిలో, ఏ హోదాలో ఎలాంటి పనిచేస్తున్నా శ్రమ యెడల పూజ్యభావంకలిగి పని అంటే ప్రభుని పూజించడమేయని భావించి సమయంను వ్యర్థపరచక బాధ్యతగల కార్మికునిగా ఆ పునీత యోసేపుగారి అడుగుజాడల్లో పయనింప ప్రయత్నించాలి. శ్రమ ఒక్కటే. శ్రమైక జీవులంతా ఒక్కటే. యో సేపు అంటే దేవుడు సమృద్ధి చేయును, హెచ్చించును లేక యెక్కువ చేయును అని అర్థం.


On May 1, 1955, Pope Pius XII granted a public audience to the Catholic Association of Italian Workers, whose members had gathered in Saint Peter's Square to celebrate the tenth anniversary of their society. They were solemnly renewing, in common, their promise of loyalty to the social doctrine of the Church, and it was on that day that the Pope instituted the liturgical feast of May 1st, in honor of Saint Joseph the Worker. 

He assured his audience and the working people of the world: You have beside you a shepherd, a defender and a father in Saint Joseph, the carpenter whom God in His providence chose to be the virginal father of Jesus and the head of the Holy Family. He is silent but has excellent hearing, and his intercession is very powerful over the Heart of the Saviour.

We can conclude from the role for which Saint Joseph was chosen and named by Heaven that he was a man of tried virtue and consummate holiness. No other mortal man would ever hold a higher office. Saint Joseph surpassed all the Saints of the Old Law in sanctity; in him the virtue of his ancestors reached its culmination and perfection. Like Abraham, he was a man of faith and obedience; like Isaac, one of prayer and vision; like Jacob, he was patient and self-sacrificing; like Joseph of Egypt, his chastity was inviolable. 

And like David, of whom he is the direct descendant, he is a royal intercessor according to the heart of God. Saint Joseph — Go to Joseph; to Joseph of Egypt, the pharaoh told the needy to go for assistance to receive the grain that would save their lives. To the new Joseph, the just man to whom the Son of God Himself was subject as to a father, all Christians can go with confidence, and he will see to their spiritual and temporal needs with paternal goodness.

Add new comment

1 + 9 =