SAINT OF THE DAY – June 5 Saint Boniface / పునీత బొనిఫాసు

Saint Boniface

యూరపుఖండ మధ్య ప్రాంతంలోని జర్మనీదేశ కొండజాతి ప్రజలలో క్రైస్తవం విస్తరించిందంటే ఆ కృషిఫలితమంతా పునీత బొనిఫాసుగారికే దక్కుతుంది. అందుకే వారికి జర్మనీదేశ అపోస్తలుడు' అని బిరుదుకూడ వచ్చింది. వారు ఇంగ్లాండుదేశంలోని డేవన్ షైర్ నగరంలోని క్రెడిటన్ అను పేటలో క్రీ||శ|| 673లో జన్మించారు. జ్ఞానస్నానం పేరు విన్ఫ్రిడ్.వారు చిన్నప్పుడు కొందరు సన్యాసి గురువులు వారి ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవారు. వారి సంభాషణలు వినడంద్వారా వారివలె తానుకూడ పెద్దయ్యాక మంచి క్రైస్తవ గురువుకావాలనే దైవపిలుపు వారి హృదయంలో ఒక నిప్పుకణికలా ఉండిపోయింది. వారు ఏడవఏట ఎక్స్టర్ అనే గ్రామం దగ్గరలోని ఒక మఠపాఠశాలలో చేరి చదువుకున్నారు. తమ 14వ ఏట శిశుకేంద్రం-నిర్వహిస్తున్న ఒక బెనెడిక్టియను మఠంలో ప్రవేశం పొందారు. అక్కడ మఠాధిపతియైన విన్ బెర్ట్ గారికి శిష్యరికంచేసి పైచదువుల్లో నెగ్గి ఆ మఠ డైరెక్టరుగా కూడ నియమితులు కావడం విశేషం. విన్ ఫ్రిడ్ గారు సాహిత్యం, సువార్తలను బోధించడంలో నిష్ణాతులని పేరుగడించారు. క్రీ.శII 715లో గురుపట్టం పొందారు.

ఫాదర్ విన్ ఫ్రిడ్గారికి ఫ్రీస్లాండు (ఉత్తర నెదర్లాండు)లో అధిక సంఖ్యలో తమ బంధువులైన ఆంగ్లోశాగనులున్నారు. వారిని ఎలాగైనా క్రైస్తవంలోకి తీసి కొనిరావాలని తీవ్ర వాంఛ కలిగి ఉన్నారు. ఇప్పటికే కొంతమంది. ఆంగ్లేయగురువులు అక్కడ పనిచేస్తున్నారు. తానుకూడ వెళ్లి 3సం||లు పనిచేశారు. ఒకసారి ఫాదర్ విన్ఫ్రిడ్ రో ముసందర్శించినప్పుడు క్రీ||శ|| 718లో 2వ గ్రెగోరి జగద్గురువులు వారిని జర్మనీవెళ్లి క్రీస్తు సందేశం విన్పించాలని కోరారు. అందుకు విధేయించి వారు జర్మనీవెళ్లగా అక్కడి పాలకులు వారిని సాదరంగా ఆహ్వానం పలికారు. ఫాదర్ విన్ఫ్రిడ్గారు సాహిత్య ప్రకాండుడు కావడాన అక్కడి ప్రజలకు అర్ధమయ్యే భాషలో, యాసలో మాట్లాడటం మొదలు పెట్టారు.

జరునీదేశంలో హెస్సియాపట్టణ ప్రాంతంలోని కొండజాతి ప్రజలు ఏవోరదేవుళను పూజిస్తుండేవారు. వారిలోని మూఢనమ్మకాల్ని, అజ్ఞానాన్ని తొలగిస్తే వారిని సరియైనగాటిలో పెట్టవచ్చని తలంచారు ఫాదర్ విన్ఫ్రిడ్. అందుకు ముందుగా గిస్మర్ పట్టణం దాపులోని గూడెన్ బర్గ్ పర్వతం పైగల ఒక సిందూరపు దగరకు ఒక గొడ్డలి తీసికొనివెళ్లారు. అక్కడి కొండజాతి జనం ఆ చెట్టుకు ఎంతో ఇదిగా పూజలు చేస్తుండేవారు. సృష్టికర్త దైవంను విడిచి సృష్టివస్తువులైన ఇటు, జంతువులు, గ్రహాలను పూజించి ప్రయోజనం లేదని వారికి నచ్చజెప్పారు. అనిచెటవలె ఆ సిందూరపు చెట్టుకూడ ఒకటని, దాన్ని నరికినా ఏమీకాదని అరమయ్యేలా చెప్పారు. పిమ్మట తన చేతిలోని గొడ్డలితో ఆ చెట్టును నరకడం మొదలు పెట్టారు. ఎలాంటి కీడు జరగకుండ ఆ చెట్టు కూలిపోయింది. ఆ ప్రజల అతి విశ్వాసాలన్నీ భ్రమలని, కల్పితాలని అర్థంచేసుకుని వస్తుపూజ విసర్జించారు. ఆ క్రైస్తవగురువును వెంబడించి క్రైస్తవమతావలంబికులై జ్ఞానవంతులయ్యారు. ఇక ఫాదర్ గారు తమ సువార్తా పనిని కొనసాగింప తురంగియా పట్టణం చేరుకున్నారు.

క్రీ||శ|| 722లో 2వ గ్రెగొరి జగద్గురువులు ఫాదర్ విన్ ఫ్రిడ్గార్ని రప్పించుకొని జర్మనీకంతటికి పీఠాధిపతిగా వారిని అభిషేకించి, క్రొత్తపీఠాలు నెలకొల్పడం వాటికి బిషప్పులను ఏర్పరచడానికి పూర్తిహక్కును ప్రసాదించారు. ఆ సమయంలోనే ఫాదర్ విన్ఫ్రిడ్గారు తమ పేరుకు లాటినుఅర్ధంలో బిషప్ బొనిఫాసుగా మార్చుకున్నారు. నూతనోత్సాహంతో విచ్చేసిన బిషప్ బొనిఫాసుగారు జర్మనీలోని గురువులు మఠవాసినులందరిని ప్రేమతో కూడగట్టుకొని క్రైస్తవ మతవ్యాప్తికి విశేషంగా కృషిసల్పారు. మఠాలయాలు అనేకం నెలకొల్పారు. ముఖ్యంగా ఒహుద్రుఫ్, రిచెనో, ముర్బక్, ఫ్రిట్జ్లర్, ఫుల్గా అనే పట్టణాలలో క్రైస్తవ మఠాశ్రయాలు తెరిచారు. విశ్వాసాన్ని, నాగరికతను ప్రజలకు నేర్పించారు.  క్రీ||శ|| 747లో మెయింజ్ నగరం అగ్రపీఠంగా నెలకొల్పబడి దానికి అగ్రపీఠాధిపతిగా బొనిఫాసుగార్ని నియమిస్తూ పునీత ఒకరిపోపుగారు ప్రకటించారు. జర్మనీ, గౌల్ రాజ్యాల తరపున వారే అపోస్తోలిక ప్రతినిధిగా వెల్లడించారు. జర్మనీ, ఫ్రాన్సుల్లో బొనిఫాసుగారు పీఠాల్ని, మఠాల్ని సంస్కరించి చైతన్యవంతంచేశారు. ఫ్రాన్సు రాజ్యపాలకుల్ని క్రైస్తవంలోకి వచ్చేలా చేశారు. “జర్మనీ పౌలు”గా పేర్గాంచారు.

క్రీ||శ|| 754లో జూన్ 5న పెంతెకోస్తు పండుగరోజున ప్లీస్ లాండు (ఉత్తరహాలెండు)లోని దుక్కుం పట్టణంలో ఒక డేరాలో కొందరు విశ్వాసులకు భద్రమైన అభ్యంగమునకు తయారు చేస్తుండగా అవిశ్వాసులగుంపు దాడిచేసి డేరాకు నిప్పుపెట్టారు. 12 మంది గురువుల్ని, 40 మంది భక్తుల్ని చంపారు. బోనిఫానుగారి మృతదేహం పుట్టాపట్టణంలో సమాధిచేయబడింది. తాను విశ్వసించిన శ్రీసభ విశ్వాసం కోసం వారు ప్రాణాలర్పించారు. వారు ఈ విధంగా వ్రాశారు. 'ప్రపంచ సాగర ప్రయాణంలో శ్రీసభ అనే ఓడకు జీవిత ఆటుపోటులు తప్పవు. అందువల్ల ఓడను త్యజించడంకాదు కొనసాగించడం మన విధి.” 9వ పయస్ (భక్తినాథ) పోపుగారు క్రీ||శ|| 1874లో వారికి పునీత పట్టం అలంకరించారు. బోనిఫాస్ అనగా బాగుగా పనిచేయు వ్యక్తి అని అర్థం.


Saint Boniface was born in Devonshire, England, in the year 680. Some missionaries staying at his father's house spoke to him of heavenly things and inspired in him a desire to devote himself, as they did, to God. He entered the monastery of Exminster and was trained there for his apostolic labors. His first attempt to convert pagans in Holland having failed, he went to Rome to obtain the Pope's blessing on his mission, and returned with the authority to preach to the German tribes.

It was a slow and dangerous task; his life was in constant peril, while his flock was often reduced to abject poverty by wandering bands of robbers. Yet his courage never flagged. He began with Bavaria and Thuringia, next visited Friesland, then passed on to Hesse and Saxony, everywhere destroying the idol temples and raising churches in their place. He endeavored to make every object of idolatry contribute in some way to the glory of God. On one occasion, having cut down an immense oak honored in the name of Jupiter, he used the tree in building a church which he dedicated to the Prince of the Apostles.

After being recalled to Rome and consecrated bishop by the Pope, he returned to extend and organize the rising German Church. With diligent care he reformed abuses among the existing clergy, while establishing religious houses throughout the land. At length, feeling his infirmities increase, and fearful of losing his martyr's crown, Saint Boniface appointed a Superior for his monastery and set out anew to convert a pagan tribe.

While he was about to administer Confirmation to some newly baptized Christians, a troop of pagans arrived, armed with swords and spears. His attendants would have opposed them, but the Saint said to his followers: My children, cease your resistance; the long expected day has come at last. Scripture forbids us to resist evil. Let us put our hope in God; He will save our souls. Scarcely had he stopped speaking, when the barbarians fell upon him and slew him, with all his attendants, fifty-two in number.

Add new comment

10 + 3 =