SAINT OF THE DAY – June 15 పునీత కజిన్ జెర్మైయినమ్మ/ ST. GERMAINE

St.Germaine

(కన్యక, క్రీ||శ|| 1579 - 1601) ఫ్రాన్సుదేశంలో “తవుల్లోస్ అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పేద వ్యవసాయ కుటుంబంఉంది. వారు సామాన్య క్రైస్తవులు. ఆ కుటుంబంలో ఒక ఆడశిశువు జన్మించింది. జ్ఞానస్నానంలో జెర్మేయినమ్మ అని నామకరణం చేయించారు. వారినే జెరెయిన్ కజిన్ అనికూడ పిలుస్తారు. ఆ పాపకు పుట్టుకతో అవిటిచేయి. పైగా క్షయవ్యాధి సంబంధమైన ఒక విచిత్రమైన రోగంకూడ ఆమెను అంటి పెట్టుకొని పీడించింది.ఇలా అవిటితనంతో రోగంతో అసహాయస్థితిలో పెరుగుతున్న జెర్మేనమ్మకు కన్నతల్లే అన్ని విషయాలలో తోడ్పడుతూ కంటికి రెప్పలా సాకింది. అట్టితల్లి అకాల మరణంతో జెర్మేన్ నిస్సహాయురాలైంది. దిక్కులేని వారికి దేవుడేదిక్కని ఆ ప్రభువునే ప్రార్థించుకొంటూ కాలంగడి పేది.

జెర్మేయినమ్మ తండ్రి ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు. తనకు తోడుగాను పాపయొక్క ఆలన పాలనా చూసుకునేందుకుగాను ఒక యువతిని పెండ్లాడాడు. కాని ఆతని ఊహ తారుమారైంది. యవ్వనస్తురాలు, సుఖభోగాలనాశించే ఆ స్త్రీ జెర్మేన్ ను కన్నతల్లిలా చూడలేక పోయింది. సవతితల్లిలానే ప్రవర్తిస్తూ ఎడమొహం పెడమొహంగా సాచివేత ధోరణి ప్రదర్శింపసాగింది. ఇల్లు ఊడ్చమని, అంటు పాత్రలు కడగమని పురమాయించింది. అనేక ఆంక్షలు విధించి రాచిరంపాన పెట్టింది. అవిటిపిల్ల పైగా బలహీనురాలైన రోగిష్టిదని కూడా చూడకుండ తిట్టేది. కొట్టేది. భర్త ముందుమాత్రం పాపను బాగా చూసుకుంటునట్లు వగలుపోయేది. జెర్మేన్ సవతితల్లిని విధేయించడానికే శతాథాప్రయత్నించింది. వాస్తవాన్ని తండ్రికి తెలుపక పరలోకతండ్రికి మాత్రమే విన్నవించుకునేది. ఒక్కోసారి జెర్మేన్ కు కడుపునిండాతినడానికి మంచి భోజనంకూడ సవతి తల్లి పెట్టలేదు. పైగా “ఇంట్లో నాకన్నింటికి అడ్డమే” అని శాపనార్థాలు పెడ్తూ ఇంటిబైటే ఉండమని ఆ చిన్నారిని శాసించేది.

ఇట్టి దుస్థితిలో జెర్మేయినమ్మ జీవితమంతా బాధలమయంగా నెట్టుకొస్తుంది. సిలువధారియై కలువరిగిరినెక్కిన క్రీస్తు శ్రమలనే ధ్యానించేది. తనకు "ఓర్పు-నెమ్మది' అనే వరాన్నిమ్మని అధికాధికంగా ఒసంగమని ప్రభువును ప్రార్థించింది. దీనికి తోడు “మౌనం-భక్తి తో కూడిన జపతపాలు అలవర్చుకుంది. దివ్యసత్రసాదం లోకొనడమన్నా ఆ దివ్యనాధుని ఆరాధించడమన్నా ఎంతో ప్రీతి. దేవమాత యెడల ప్రత్యేక భక్తి కనబరచేది.

జెర్మేయినమ్మ తనకు చేతనైనంతమట్టుకు ఇంటిపనులన్నీ చేస్తూనే కొంత సమయాన్ని తీరిక చేసుకుని, గ్రామంలోని పిల్లల్ని ఒక చోట చేర్చి వారికి ప్రార్థనలు నేర్పించేది. ఏసుప్రభు బోధలను, మేరిమాత ఆదర్శంను కథలు, పాటల రూపంలో నేర్పించేది. ఈ విధంగా ఉపశమనం ఆధ్యాత్మిక ప్రశాంతత పొందేది. ఇంట్లో తనకు పెట్టబడే ఆ కాస్త భోజనంలో కొంతభాగాన్ని తనకంటే బీదస్థితిలో ఉన్నవారికి భిక్ష పెట్టేది. ఉపవాసంతో లేక అర్థాకలితో కాలం వెళ్లబుచ్చడం, తన అవిటితనపు నిస్సహాయతను క్రీస్తు విశ్వాసంకోసం భరిస్తూ పుణ్యం మూటగట్టుకునేది. ఆత్మ సంతోషంతో కళకళలాడేది.

జెర్మేయినమ్మకు యుక్తవయస్సురాగా ఆమె తన సర్వస్వం దేవునికే అర్పితమై పవిత్రతకు ప్రాముఖ్యతనిచ్చింది. లోకాశలు సుఖభోగాలపై ఆసక్తి కనబరచక సుకృత జపములు, త్యాగక్రియలకే అంకితమైంది. అనేకులు పలికే దైవదూషణలు, చేసే దుష్కీయలకు పరిహారము చేయనెంచి ఏసును మొర పెట్టుకునేది. ఫ్రాన్సు దేశంలోనే కాక ఎక్కడ కూడ క్రైస్తవం కు ఆపద రాకుండ శ్రీనభ మూడుపూవులు ఆరుకాయలుగా సుభిక్షంగా విలసిల్లాలని మౌనప్రార్ధనలు, బహిరంగ ప్రార్థనలు సల్పుతుండేది.

జెర్మేయినమ్మ ప్రార్థనా జీవితాన్ని, కన్యగానే కఠోరనియమాలతో నిష్ఠగా గడిపే విశుద్ధ బ్రతుకును సునిశిత దృష్టితో గమనించిన పెద్దలు, విశ్వాసులు 'ఏదో దివ్యశక్తి ప్రేరణవలన శ్రీసభలో తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. మత విరోధులు అదుపులో ఉన్నారు. కతోలికులను అనేక ఆపదలనుండి తప్పింపబడి వివిధ మేలులతో ఆశీర్వదింపబడ్డారని, అందుకు జర్మేయినమ్మ అఖండ జపతపాలే కారణం” అని నమ్మారు. తమ దివ్య ప్రేరణలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ భక్త కన్యామణి తన 22వ ఏట క్రీIIశII 1601లో ప్రభువునందు నిద్రించినది.

బాల్యంనుండి బాధలు, కష్టాలు, అవిటితనంవల్ల నిస్సహాయ ఆవేదనలు, త్యాగక్రియలు, ఎడతెగని ప్రార్థనలు, కన్యగా పవిత్రత కాపాడుకుంటుచేసిన ఉపవాసదీక్షలు విశ్వాస ప్రదర్శనకుగాను ఆమెకు పరలోకంలో గొప్ప బహుమానం ఇవ్వబడింది. శ్రీసభకూడ కన్య జెర్మేన్ కు క్రీIIశII 1867 జూన్ 29న 9వ భక్తినాథ పోపుగారిచే పునీత పట్టానిచ్చి ఆమె ఆదర్శంను కొనయాడింది. ఆయమ్మ సమాధి ఉన్న ‘పిబ్రాక్ దేవాలయం ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. జెరెయిన్ అనగా సోదరభావం, నిజమైన అని అర్థం.


Saint Germaine Cousin was born in 1579 in Pibrac, a small village not far from Toulouse, France. From her earliest years she was a frail, sickly child, and throughout her life was afflicted with scrofula, a tubercular condition affecting particularly the glands of the neck. In addition, her right arm and hand were deformed and partially paralyzed. In spite of her many afflictions, the emaciated child possessed a charming, sweet disposition. Germaine endured not only bodily sufferings, but harsh, cruel treatment from her stepmother, who had a deep aversion for the little girl. The child was almost starved to death and obliged to sleep in the barn on a pile of leaves and twigs under the stairway. At break of day, summer and winter, she would drive the sheep into the fields to graze, then watch them until evening. She had to spin during this time, and if the allotted wool was not spun, she was severely punished.

The village children, not sharing the hostility of the adults toward this forlorn child, loved to listen to her speak about the goodness and love of God while she guarded her flock. The only instruction Germaine ever received was the catechism taught after Sunday Mass in the village church, which she attended with joy. During the long hours of solitude she spent in the fields and in the stable at night, she remained in sweet communion with God, and never complained of her hard life.

Every morning she was at Mass, and afterwards went to kneel before Our Lady's shrine. To reach the church she had to cross what was ordinarily a small stream; but after a heavy rain it would become a raging torrent. Several times at those moments, the villagers were amazed to see the rushing waters separate when Germaine approached, and then to watch her cross on dry land. When she left her sheep to go to church, she would place her staff upright in the ground, and the sheep never went far from it. One day the stepmother was seen pursuing Germaine as she drove the sheep down the road. She was accusing the girl of having stolen some bread and concealing it in her apron. When Germaine unfolded her apron, fragrant flowers, foreign to that region, fell to the ground.

Germaine died one night in the year 1601, at the age of twenty-one, and was buried as was the custom in those days, in the village church. Forty-three years later, when a relative was to be buried near her and the stones were removed, the grave-digger found to his amazement, the body of a beautiful young girl in a state of perfect preservation. His pick had struck her nose, and the wound was bleeding. Some of the older residents identified the girl as Germaine Cousin. Miracle after miracle occurred, and in 1867 the neglected little waif of Pibrac was inscribed in the list of Saints by Pope Pius IX. Annually thousands of pilgrims visit the church of Pibrac, where the relics of Saint Germaine are enshrined.

Add new comment

11 + 4 =