SAINT OF THE DAY – June 14 పునీత 1వ మెథోడియస్/ ST. METHODIUS I

St. Methodius I

(కాన్స్టాంట్ నోపుల్ ప్రధాన గురువు క్రీIIశll - 847) 9వ శతాబ్దంలో జీవించిన మెథోడియస్ సిసిలీలో పుట్టారు. కానీ, స్వగ్రామం ఇటలీదేశంలోని సిరాకుసు. ఇక్కడేవారు విద్యావంతులై కాన్స్టాంటినోపుల్ రాజ్యంలో ఏదోక ఆస్థాన ఉద్యోగం సంపాదింపవెళ్లారు. అక్కడ ఒక క్రైస్తవ గురువుతో మాట్లాడటం తటస్థించింది. ఈ లోకం సుఖాలు క్షణభంగురాలని క్రీస్తుప్రేమ క్రీస్తు చూపించిన రాజ్యం శాశ్వతమని తెలుసుకున్నారు. తానుకూడ సన్యాసి జీవితం యెడల ఆకట్టుకుని గురువు అయ్యారు. అక్కడే దగ్గరలో ఉన్న చెనోలక్కోస్ మఠనిలయంలో చేరారు.

క్రీ.శ.815లో 5వ అర్మేనియా లియో చక్రవర్తి క్రైస్తవంపట్ల ద్వేషభావం పెంచుకొని వారి పరిశుద్ధ స్వరూపాల్ని ఎక్కడికక్కడ నాశనంచేస్తు అడ్డుపడినవారిని హతమార్చుతూ ఉన్నాడు. ఆ సమయంలో మెథోడియస్ గురువు ఆ పవిత్ర విగ్రహాల్ని విరగగొట్టవద్దని అడ్డుకున్నారు. వాటిని గుర్తుగా, జ్ఞాపకార్థంగానే గౌరవిస్తాంకాని, అవే దేవుళ్లు దేవతలని పూజించమని నొక్కిచెప్పారు. దీనికి పూర్తి మద్దతుగా నిలచి రాజాజ్ఞను ధిక్కరించిన ప్రధాన గురువు పదవిలో ఉన్న పునీత నిసిఫారస్ గార్ని హింసించి దేశ బహిష్కారం గావించారు. అట్టి దుస్థితిలో మెథోడియస్ స్వామి రోమునగరం వెళ్లి 1వ పాస్కల్ జగద్గురువులకు పూర్తి నివేదికనిచ్చారు. 5వ లియో చక్రవర్తి మరణించేవరకు రోములోనే ఉండిపోయారు.

క్రీ||శ|| 821లో మెథోడియస్ గారు పోపుగారినుండి ఒక లేఖ తీసికొని కాన్స్టాంట్ నోపుల్ వచ్చారు. అప్పటి చక్రవర్తి మైకేల్ ను కలిశారు. ఈ చక్రవర్తికి నత్తి ఉండేది. పునీత నిసెఫొరస్గార్ని దేశ బహిష్కారశిక్ష రద్దుచేయమని ఆ లేఖ సారాంశము. చక్రవర్తి ఆ లేఖ చదివి మెథోడియస్గారి పై రాజద్రోహనేరం ఆపాదించి వారిని కొరడాలతో కొట్టి తన రాజ్యంనుండి తరిమివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా ఏడేండ్లు పునీత అంద్రెయ దీవిలోని జైలులో హింసాయుత జీవితం భరించారు. అనంతరం విడుదలకాగా థియోఫిలస్ అను క్రొత్తచక్రవర్తి సింహాసనమెక్కాడు. మెథోడస్గార్ని తనముందు ప్రవేశ పెట్టమని ఆదేశించాడు.

ఈ చక్రవర్తి కూడ పాత చరిత్రనే తిరుగదోడుతూ పోపుగారీ లేఖను ఆక్షేపించేటప్పుడు మెథోడియస్ గారు మిక్కిలి ధైర్యంతో “విగ్రహాలను నాశనంచేసినా వారినుద్దేశించి చేసే వందనములు గౌరవపూజలు నాశనం చేయలేవ''ని బుద్ధిచెప్పారు. క్రీ||శ|| 842లో ఈ చక్రవర్తికూడా చనిపోయాడు. వెంటనే ఆయన భార్య థియోడోరా రాణి పసిబాలుడైన 3వ మైకేల్ చక్రవర్తి తరఫున రాజ్యం ఏలింది. ఆమె మెథోడియస్గారి వాదనను సమర్థించి సమాధానంతో విడుదలచేసింది. అనంతరం మెథోడియస్ గురువు తమ మఠంకు క్షేమంగా చేరుకున్నారు. ఖాళీ ఏర్పడిన స్థానంకు పెట్టియార్కుగా నియమితులయ్యారు. వీరి హయాంలో నైసియాసభ శాసనాలు అమలుపరిచారు.

విగ్రహాలు తొలగించాలనే రాజశాసనాన్ని రద్దుపరచ రాణి థియోడోరాగారి సాయం తీసుకున్నారు. విగ్రహాలకు సంబంధించి గురువుల్లో ఉన్న భిన్నాభిప్రాయాలకు ఓపిక వహించేటట్లు చూశారు. వీరు క్రీ||శ|| 847 జూన్ 14వ తేదీన ఉబ్బసం వ్యాధితో కాన్స్టాంట్ నోపుల్ పట్టణంలో కన్నుమూశారు. వారు వ్రాసిన చరిత్రపుస్తకాలు ముఖ్యంగా పునీత మరీనా, పునీత అగత, పునీత కాస్మస్, దమియాను ఇంకా పునీత థియో ఫేన్స్ అనువారివి నేటికీ భద్రపరచబడి ఉన్నాయి. మెథోడియస్ అనగా నిజమైన త్రోవ అని అర్థం.


Patriarch of Constantinople, modem Istanbul. He was born in Syracuse, Sicily, and builta monastery on the island of Chios. After some time in Constantinople, he was sent to Rome in 815 as the representative of Patriarch Nicephorus, who was exiled by Emperor Leo V the Armenian for refusing to yield to the imperial decrees on the destruction of icons.

Methodius returned in 821 and was himself scourged and imprisoned for seven years. Finally, in 842, Empress Theodora arranged for his elevation as patriarch of Constantinople. In this office, he convened a council and promoted orthodoxy and the veneration of icons after the long years of iconoclasticism. Methodius was a prolific writer, being the author of a life of St. Theopanes.

 

Add new comment

6 + 2 =