SAINT OF THE DAY – June 13 పునీత పాదువ అంతోని / ST. ANTHONY OF PADUA

St. Anthony

(గురువు, అద్బుతకరుడు, మతసాక్షి క్రీ||శ|| 1195 - 1231) పోర్చుగల్ దేశంలోని లిస్బన్ పట్టణంలో 1195 ఆగష్టు 15వ తేదీన పునీత అంతోనిగారు జన్మించారు. పోర్చుగల్ రాజైన 2వ అల్ఫోన్లో కొలువులో సైనిక ఉన్నతోద్యోగిగా వీరి తండ్రి పనిచేసేవారు. ఉత్తమ క్రైస్తవ కుటుంబం. దాపులోని కథెడ్రల్ దేవాలయంలోనే ‘ఫెర్డినాండు' అని జ్ఞానస్నానంలో పేరు పెట్టబడింది.

కథెడ్రల్ పాఠశాలలోనే మునులు, గురువులు అధ్యాపకులుగా విద్యాభ్యాసం పూర్తిచేశారు. అంతా ఆధ్యాత్మికవాతావరణం కాన మంచి భక్తి భావాల్లో ఫెర్డినాండు పెరిగారు. కత్తిపోరాటం, గుర్రపుస్వారీకూడా తండ్రి నేర్పించాడు. ఫెర్డినాండుగారు తమ 15వ ఏట దైవపిలుపుకు బదులిడి లిస్బన్ పట్టణంలోని పునీత అగస్టీనువారి సభకు చెందిన పునీత విన్సెంటుగారి ఆశ్రమంలో మఠాధిపతి డాన్గొంజాగగారి ఆధ్వర్యంలో చేరారు. ఇక్కడవారు కేవలం రెండు సం||లు మాత్రమే ఉండకలిగారు.

వచ్చిపోయే బంధుమిత్రులవల్ల తన మౌనప్రార్థనా జీవితంకు అంతరాయం కలుగుతోంది. కనుక పోర్చుగల్ రాజధాని 175 కి.మీ. దూరంలోని కొయింబ్రా పట్టణంలోని ఆశ్రమానికి బదిలీచేయించుకొని వెళ్లారు. క్రీ||శ|| 1212లో పరిశుద్ద సిలువమఠంలో చేరుకున్నారు. కాని ఇక్కడి మఠాధిపతి మహారాజభోగికావడం వారికి సుతరాము నచ్చలేదు.తగిన బుద్ధిమాటలు నిర్మోహమాటంగాచెప్పి కొంతదారిలోకి తేకలిగారు. అటుపిమ్మట ఫెర్డినాండుగారు క్రీ|శ|| 1219 లేక 1220లో పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యా రు. క్రీ.శ 1221లో ఫ్రాన్సీస్ అస్సిసిసభకు చెందిన 5గురు బ్రదర్లు అప్పుడప్పుడు తనమఠంకు వచ్చి భిక్షతీసికొని వెళ్లేవారు, వారు ముస్లిందేశాలకు అనగా ఆఫ్రికా ఖండంలోని మొరాకోవంటి దేశాలకు బోధింపవెళ్లి వేదసాక్షి మరణంపొందారు.

ఇది చూచిన పెర్డినాండు తనకు కూడ క్రీస్తు ప్రేమకోసం అట్టి హతసాక్షిగా కావాలని ఆశించాడు. క్రీ||శ|| 1221లో ఫ్రాన్సీస్ వారి సభకు మారాడు. అప్పుడే అంతోని' అని నూతన పేరు తీసుకున్నారు. పేదరికం, పవిత్రత, విధేయత అనే పుణ్యవతాలు తీసికొని ఫ్రాన్సీసుసభ గురువుగా ఆఫ్రికాకు ఓడలో బయలుదేరారు. కాని తీవ్రజ్వరంకు గురిఅయ్యారు. పైగా ఆ ఓడ ప్రమాదానికి గురియై మునిగిపోలేదు కాని దారితప్పి సిసిలీద్వీపంకు తాకింది.

అలాగే క్రీ||శ|| 1221లో ఇటలీలోని అస్సిస్సిలో వారి సభ బ్రదర్లు గురువులకు గొప్ప జక్రాల్ సమావేశం ఏర్పాటు చేయబడగా ఫాదర్ అంతోనిగారు ఆ సభకు హాజరై ఫ్రాన్సీసుగార్ని కలసికొని ఆనందబాష్పాలు రాల్చారు.సమావేశం పిమ్మట అంతోనిగార్ని ఇటలీలోని ఏ ప్రాంతంలోనైనా సువార్తా ప్రచారంకు అనుమతి లభించింది. వారు మౌంట్ పౌలో ప్రాంతంలోని అ పెన్నయిన్ కొండ. ఆశ్రమంలో ఆరుగురు బ్రదర్లకు పూజలర్పిస్తూ గడిపారు. కొద్దికాలం పిమ్మట ఫోర్లి అనే పట్టణంలో గురుపట్టాభిషేకం ఒకటి జరుగబోతోంది.

ఆ ఉత్సవపూజలో ఫాదర్ అంతోనిగారు సందేశమందించాల్సి వచ్చింది. వారి మధుర ప్రసం, పలుకులు స్వర్గంనుండి జాలువారే సెలయేరులా సాగిపోయాయి. శ్రోతల మైమరిచిపోయారు. పూజానంతరం అంతో నిగారిని అభినందించనివారులేరు వారికీర్తి ఎంతో ఎత్తు ఎదిగింది.అంతోని స్వాములవారి సందేశాలవల్ల శ్రీ సభకు వెలుపలకు వెళి ఇతరశాఖలను అనుసరిస్తున్నవారు తిరిగి తల్లిమతం చేరుకున్నారు. 30సంత దుర్మార్గుడు తన చెడు జీవితం విడనాడి మంచి జీవితం చేపట్టాడు. రిమిన అనే ప్రాంతంలో ప్రజలు అంతో నివారి ప్రసంగాలకు హాజరుకాకుండగా, వారు సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్లి ప్రసంగింపగా చేపలన్నీ శిరములెత్తి ఆలకించాయి. ఆశీర్వదించి వెళ్లమన్నాకే అవి వెళ్లి పోయాయి. 

ఆ రోజులో దీవ్యసత్రసాదంలో క్రీస్తు లేరని కొందరు వితండవాదం చేస్తుండేవారు. ఒకసారి మూడు రోజులు తిండిలేకుండా మాడ్చిన గాడిదను తీసుకొనిరాగా ఒకప్రక్కగడి. వేరొకప్రక్క అంతోనివారు దివ్యసత్రసాదాన్ని ఉంచగా గాడిద ఆకలిమరచి గడి మేయ కుండ మోకాళ్లూని ప్రభువుకు నమస్కరించింది. సవాళ్లు విసిరిన అపమార్గులు అన్యులు ఎందరో ఈ వింత చూసి క్రీస్తును, దివ్యసత్రసాదంను నమ్మి శ్రీసభను అవలంబించారు.

ఫాదర్ అంతోనిగారు క్రీస్తు వాక్యం విన్పించడానికి ఫ్రాన్సుదేశం వెళ్లారు. అక్కడ ప్రసంగించి, తమ ప్రార్థనలో భాగంగా అల్లెలూయగీతం పాడారు. ఇటలీలో తమ మఠంలోకూడ మరచిపోక ఆపాట పాడించేందుకు అదే సమయంలో అంతోనివారు ప్రత్యక్షమై అల్లేలూయాగీతం ఆలాపించారు. అవును ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండే దివ్యవరం అంతో నిగారికి ఉంది. మరొకసారి ఒక బహిరంగస్థలంలో అంతో నిగారి ప్రసంగం ఏర్పాటు చేయబడింది. వారు ప్రసంగిస్తుండగా ప్రజలకు ఎవరిభాషలో వారికే చెప్తున్న అనుభూతి ప్రత్యక్షంగా గమనించారు. ఆశ్చర్యపోయారు. ఇంతలో పెనుతుఫానులా ఉరుములు మెరుపులతో వాన ఆరంభమైంది. ప్రజలు పారిపోబోగా అంతోనిగారు ఆశీర్వదించి ప్రజల్ని కూర్చోమని తమ ప్రసంగం కొనసాగించారు.

ఆ సభా ప్రాంగణంలో చినుకులేదు. కాని చుట్టూరా పెద్ద వరం, వరదలై పారిన నీరు చూపరులను అద్భుత పరవశుల్నిచేసింది. పాపాత్ములు సన్మార్గులయ్యారు. క్రీ.శ. 1226 అక్టోబరు 31న సభ పెద్దతల అయిన ఫ్రాన్సీసుగారు చనిపోయారు. అనంతరం బ్రదరు ఎలియాసుగారు మఠశ్రేష్ఠులుగా ఎన్నికవగా అంతో నిగారు ఊత్తం ఫాదర్ అంతోనీగారు అక్కడ ప్రసంగిస్తుండగా స్వర్గంనుండి 26న పానీస్ అస్సిసిగారు తమ హస్తాలు చాచి సభను ఆశీర్వదించిన దర్శనంచూచి తరించారు.

క్రీ.శII 1228 జూలై 16న అస్సిసి వచ్చి 9వ గ్రెగోరి ఊపగారు ఫ్రాన్సీసుగారికి పునీత పట్టం ఇచ్చిన సందర్భంగా అంతోని గురువర్యులు ఆరె ఆనంద పరవశులయ్యారు. ఆ సమయంలో పోపుగారు అంతోనిగార్ని చూసి అభినందించి సంతోషించారు.క్రీ||శ|| 1230లో అంతో నిగారు ఇటలీలోనే పొదువ అనే పట్టణంలో నివాసంచేశారు. ప్రదేశం అందంగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉండేది. అక్కడ ఒక విశ్వవిద్యాలయం కూడ ఉంది. విద్యార్ధులు, అధ్యాపకులంతా అంతోనిగారంటే ఎంతో అభిమానించేవారు. కాన అంతోనిగారు ఇక్కడే ఉండి ఇక్కడే సమాధికావాలని ఆశించారు. చుట్టుప్రక్కల గ్రామాల్లోకూడ అంతోనివారు పూజలర్పించి సందేశాలిచ్చి వస్తుండేవారు. లాటిను, గ్రీకు, స్పానిషు భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. మంచితనం - మానవత్వం, మర్యాద మానవ హృదయాల్లో ఉండాలనేవారు. ధనం ముళ్లకంప అనేవారు. పేదలనాదరించాలనేవారు.

పాపసంకీర్తనంను ఎక్కువగా ప్రోత్సహించారు. 40 రోజులు ఏకధాటి ప్రసంగాలు చెప్తుండేవారు. ఒకసారి మూర్చరోగంతో చనిపోయేస్థితిలో ఉన్న 3సంIIల పాపను అంతోని గురువర్యులు ఆశీర్వదించి స్వస్థతపర్చి జీవాన్నిచ్చారు. “క్రీస్తు దేవుని ప్రేమించు అనుభవించు క్రీస్తులేని జీవితం శూన్యం” అని తమ సందేశాల్లో తరచు విన్పించేవారు. క్రీ||శ|| 1231లో అంతో నిగారు అలసిపోయి నిద్రరాక తలనొప్పితో ఒక కుటీరంలో పడక పై ఉండగా ఒక దివ్య వెలుగు వారిని సమీపించింది. చిన్నారి బాలయేసు అంతోనిగారి దర్శనమై వారి నుదుటిపై మృదువుగా చిన్నిహస్తంతో రుద్ద సాగారు. అంతో నిగారి మిత్రుడు టిసో అటుగా వచ్చి ఈ దృశ్యం కండ్లారాచూశారు. అంతో నిగారు బాలయేసుని ఎత్తుకుని ముద్దాడినట్లు చెప్పబడింది.

కాలక్రమంలో ఆ కుటీరం స్థిరమైన దయ్యింది. అక్కడ పెద్ద దేవాలయం నిర్మింపబడి నేటికీ సాక్ష్యంగా ఉంది. ఇట్టి ఘనుడు క్రీ||శ|| 1231 జూన్ 31న తమ 36వ ఏట పరలోకప్రాప్తినొందారు. వారి శరీరం పాదువా పట్టణంలోని పునీత మేరి దేవాలయంలో ఖననంచేయబడింది. క్రీ||శ|| 1232 మే 30న 9వ గ్రెగోరి పోపుగారిచే పునీత పట్టమొసగబడింది. "భిన్నమతావలంబికుల పాలిట సమ్మెట” “మఠవాసాల పాలిట పెద్ద ఓడ” “అద్భుతాల వ్యక్తి” అని అంతోనిగారికి బిరుదులున్నాయి. వీరిని మొక్కుకున్నవారు “అంతేనివారి రొట్టె' పేరట ఆహారపదార్థాలు దానం చేస్తుంటారు. “పేదల పెన్నిధి”గా వారిని కీర్తి స్తుంటారు. “అణగారిన ప్రజలకు ఆదరువు'గా వారిని వందిస్తుంటారు. పోయిన వస్తువులు లభ్యమగుటకు పునీత అంతోనివారి మధ్యవర్తిత్వాన భక్తులు ప్రార్థించి మేలులు, స్వస్థతలు, సమస్యాపరిష్కారాలు పొందుతున్నారు.

వారు పోర్చుగల్ దేశంకు, ప్రయాణికులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలుకలుగని వంధ్యులకు నిర్భాగ్యులకు పాలక పునీతులుగా ఏర్పరుపబడినారు. వారు శ్రీసభ పండితుడని క్రీ||శ|| 1946లో 12వ పయస్ (భక్తినాథ) జగద్గురువులు వెల్లడించారు. 9 మంగళవారాలు నవీనా ప్రార్థనలతో అంతోనివారిని వేడుకొని భక్తులు తమకోర్కెలు నెరవేర్చుకుంటున్నారని కతోలికుల నమ్మకం. అంతోనీ అంటే వెలలేని, అమూల్యం, అతి ఖరీదైన అని అర్థం.


Doctor of the Church and Miracle-Worker (1195-1231) Born in Lisbon, Portugal, in 1195, Fernando de Bouillon was of a noble family related to the famous Godefroy de Bouillon, founder and first sovereign of the Latin Kingdom of #Jerusalem, who at the close of the Crusade of 1099 had refused to wear a crown, there where #Christ had worn one of thorns.

Favored by nature and grace, Fernand resolved at the age of fifteen to leave the world and consecrate himself to God in the Order of Canons Regular of #Saint Augustine. No flattery, threat or caress of his relatives could persuade him to leave that holy refuge. He asked to be transferred to another convent to avoid the family's solicitations, and was sent to Coimbra.

Still young, his sanctity became evident through miracles; he cured a poor religious whom the devil was obsessing, by covering him with his cloak. When this young monk decided, after witnessing the return of the martyred remains of five Franciscans who had gone to #Africa, to join that Order so favored with the graces of martyrdom, the Augustinians were desolate but could not prevent his departure, for Saint Francis himself appeared to him in a vision in July 1220, and commanded him to leave.

He was then sent by the Franciscans to Africa, but two years later was obliged to return to Italy because of sickness; thus he was deprived of the martyr's crown he would have been happy to receive. In 1222 Anthony, as he was now called, went with other Brothers and some Dominican friars to be ordained at Forli. There Fra Antonio rose under obedience to preach for the first time to the religious, and took for his theme the text of Saint Paul: Christ chose for our sake to become obedient unto death.

As the discourse proceeded, the Hammer of Heretics, the Ark of the Testament, the eldest son of Saint Francis, stood revealed in all his sanctity, learning, and eloquence before his rapt and astonished brethren. He had been serving in the humblest offices of his community; now he was summoned to emerge from this obscurity. And then for nine years France, Italy, and Sicily heard his voice and saw his miracles, whose numbers can scarcely be counted.

A crowd to which he was preaching outdoors one day, when the church was too small to hold all who came to hear him, amidst thunder and lightning felt not one drop of water fall upon them, while all around them the rain poured down. And men's hearts turned to God. We may wonder why we always see Saint Anthony with the Child Jesus in his arms. The account of this heavenly visitation was told only after his death, at the official process concerning his virtues and miracles. It was narrated by the man who witnessed the marvel in question; the Saint himself had never spoken of it.

Saint #Anthony was in the region of Limoges in France, and was offered hospitality, rest and silence by this businessman of the region, in his country manor. He was given a room apart, to permit him to pray in peace; but during the night his host looked toward his lighted window and saw in the brilliance a little Infant of marvelous beauty in the arms of the Saint, with His own around the Friar's neck.

The witness trembled at the sight, and in the morning Saint Anthony, to whom it had been revealed that his host had seen the visitation, called him and enjoined him not to tell it as long as he was alive. The town near Limoges where this occurred remains unknown; the original account of the inquiry does not name it, but says that the man in question narrated it, with tears, after Saint Anthony's death.

After a number of years of teaching of theology, unceasing preaching and writing, Saint Anthony, whose health was never strong, was spending a short time of retreat in a hermitage near Padua. He was overcome one day with a sudden weakness, which prevented him from walking. It progressed so rapidly that it was evident his last days had arrived.

He died at the age of thirty-six, after ten years with the Canons Regular and eleven with the Friars Minor, on June 13, 1231. The voices of children were heard crying in the streets of Padua, Our father, Saint Anthony, is dead. The following year, the church bells of Lisbon rang without ringers, while in Rome one of its sons was inscribed among the Saints of God.

Add new comment

2 + 5 =