SAINT OF THE DAY – June 11 పునీత బర్నబాసు / ST. BARNABAS

St.Barnabas

(అపోస్తలుడు, పునీత పౌలుగారి సహచరుడు, వేదసాక్షి క్రీ||శ|| 1 - 60)బర్నబాసు యూదలేవీ వంశానికి చెందిన గొప్ప ధనవంతుడు. సైప్రసుద్వీపంలో జన్మించారు. కాని యెరూషలేములో స్థిరపడ్డారు. సౌలు విద్యాభ్యాసం చేసిన కాలంలోనే వీరుకూడ ప్రఖ్యాత గమాలివేల్ పండితునివద్ద విద్యనభ్యసించినట్లు తెలుస్తుంది. పెంతెకోస్తు ఉత్సవం తర్వాత క్రీ||శ|| 29 లేక 30లో వీరు క్రీస్తు భక్తుడుగా మారినట్లు చరిత్రవల్ల తెలుస్తుంది. ఏసుక్రీస్తు ప్రభుని పన్నెండుమంది అపోస్తలులలో పునీత బర్నబాస్ గారు ఒకరుకాకున్నా గాని, వారిని ఒక అపోస్తలుడుగానే మనం గౌరవిస్తున్నాం.

పునీత లూకా తన అపోస్తలుల కార్యములలో “ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను విశ్వాసముతోను నిండియుండెను.” (అ.కా. 11:24) అని వ్రాశారు. పరివర్తన చెందిన సౌలును యెరూషలేముకు ఆహ్వానించి మిగతా అపోస్తుళ్లకు పరిచయంచేసిన వ్యక్తి బర్నబాస్ గారే. అయితే అప్పటివరకు క్రైస్తవుల్ని హింసిస్తూ తీవ్రంగా అణచివేసిన సౌలు క్రైస్తవాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడని చెప్పడంతో ఆ విషయాన్ని పలువురు అపోస్తళ్లు నమ్మలేకపోయారు. (అ.కా. 9:26:27)

బర్నబాసుగారు యెరూషలేంనుండి సిరియాలోని అంతియోకు నగరానికి సువార్తా ప్రచారం నిమిత్తం ప్రయాణమైనట్లు మనం చరిత్రలో చదువుతాం. సిరేను నుండి సైప్రసు నుండి వచ్చి తన శిష్యుల ప్రచారంవల్ల అక్కడి గ్రీకులను క్రీస్తువైపు ఆకర్షించినట్లు విన్న బర్నబాస్ ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చారు. దైవానుగ్రహం యూదేతరులయెడల మొదటిసారివెల్లడై వాళ్లు క్రీస్తును నమ్ముకున్నందుకు బర్నబాస్ ఎంతో ఆనందించారు. ఆ తర్వాతకూడ సువార్తా ప్రచారం కోసం “బర్నబా సౌలును వెదకుటకై తార్సుకువెళ్లాను. అక్కడ సౌలును కనుగొని అతనిని అంటియోకునకు తీసికొనివచ్చెను.” (అ.కా. 11:25-26) తమ మొదటి సువార్తా ప్రచార కార్యక్రమంలో అంతగొప్ప అపోస్తలుడు పునీత పౌలుగారికి పునీత బర్నబాసుగారే తోడుగా ఉన్నారు.

అక్కడ ఒక ఏడాదిపాటు విస్తృతంగా పర్యటించి సువార్తను ప్రచారంచేశారు. బాల్య శ్రీసభ విస్తరణలో బర్నబాసుగారికి ఎంతగొప్ప ఆసక్తిఅంటే “అతడు తన సొంత భూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలులకు ఇచ్చివేసెను.” (అ.కా. 4:37) తనకంటే గొప్పవాడైన పౌలునకు నిస్సంకోచంగా సహాయకుడుగా ఉండటంద్వారా బర్నబా తనను తాను తగ్గించుకొన్నారు. మొదట తమ స్వార్జితమంతా, ఆ పిమ్మట తమ జీవితమంతా ప్రభు సేవకు అర్పించిన మహా అపోస్తోలిక హృదయుడు ఈ బర్నబాస్గారు. పౌలుగారు బర్నబాసుగారు ఇద్దరూ శ్రీసభ శైశవదశలో అపూర్వ సేవలు అందిచినందుకుగాను వీరిని కూడ అపోస్తళ్ల బిరుదుతో శ్రీసభ గౌరవించింది.

క్రీ||శ|| 45లో యెరూషలేం ప్రాంతం తీవ్రదుర్భిక్షానికి గురైనప్పుడు, అంతియోకు క్రైస్తవులు అందించిన సహాయంతో ఈ ఇద్దరు అపోస్తళ్లు శ్రీసభను కరువు నుండి కాపాడకలిగారు. బర్నబాసుగారి బంధువు అయిన జాన్ మార్క్గారిని వెంటనిడుకుని పౌలుగారు సైప్రస్ ద్వీపానికి సంబంధించి మొదటి ప్రచార యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆసియా మైనర్ (టర్కీ) తదితర ప్రాంతాలలో పర్యటించి సువార్త ప్రచారంచేశారు. కాని వీరి ప్రచారానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్కడి యూదులు వీరిని పలువిధాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా అనేకమంది క్రీస్తును ప్రభువుగా స్వీకరించారు. స్థానికబోధకుల సహకారంతో వారు క్రైస్తవసంఘాలను ఏర్పాటుచేశారు.

యెరూషలేము మహాసభ అనంతరం బర్నబాస్ గారు తన శిష్యుడైన జాన్ మార్క్గారిని వెంట నిడుకుని మరొకసారి సైప్రస్ మతప్రచార కేంద్రాలను సందర్శించారు. కాని ఆ తర్వాత వీరు నిర్వహించిన కార్యక్రమాలు, జీవితవిశేషాలు, మరణం గురించి పూర్తి వివరాలు తెలియవు. పునీత పౌలుగారు రోమునగరంలో చెరసాలశిక్ష అనుభవిస్తున్నప్పుడు జాన్ మార్క్గారు వారికి సహాయంగా అక్కడకు పంపబడ్డారు. అదేకాలంలో క్రీశ 61కి ముందే బర్నబాస్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు తెలుస్తుంది.

వ్యక్తిగతంగా బర్నబాస్ గారు చాలా నెమ్మదస్తులు. హుందామనిషి. ఏమైనా సమస్యలు చిక్కులు తలెత్తినప్పుడు వారు సమన్వయకర్తగా చాకచక్యంగా వ్యవహరించారు. చూపులకు రాజఠీవికలిగి పునీత పౌలుగారివలే గొప్ప వ్యక్తిత్వం ముందుచూపుగలవారు. ప్రారంభ క్రైస్తవులు వీరి వ్యక్తిత్వం, కలుపుగోలుతనం, చతురతకు గొప్పగా ఆకర్షితులైనట్లు తెలుస్తుంది. అందువల్ల ప్రజలు వారిని తగువిధంగా మేర మర్యాదలతో ఆదరించేవారు. పునీత బర్నబాస్గారి అవశేషాలను క్రీ||శ|| 482లో సైప్రస్లోని సలామిస్ వద్ద కనుగొన్నారు. పునీత మత్తయిగారు హీబ్రూభాషలో వ్రాసిన సువార్తా ప్రతినికూడ వీరి సమాధిలో కనుగొన్నారు. ఈ బర్నబా అసలు పేరు యోసేపు. కాని అపోస్తలులు వీరికి వీరి స్వభావమునుబట్టి “బర్నబా' అని పిలిచారు. బర్నబా అంటే ఉత్సాహపరుచువాడు' అని అర్థం (అ.కా. 4:36). బర్నబాసు అనగా ఓదార్పు కుమారుడు అనికూడా అర్థం.


We read that in the first days of the Church, the multitude of believers had but one heart and one soul; and none said that anything which he possessed was his own. (Acts 4:32)Amid this fervent company of Christians who practiced evangelical poverty, one only is singled out by name, Joseph, a rich Levite from Cyprus. He, having land, sold it, and bringing the price, laid it at the feet of the Apostles. They then gave him a new name, Barnabas, son of consolation. 

He was a good man, full of the Holy Spirit and of faith, and was soon chosen for an important mission, the rapidly growing Church of Antioch. Here he perceived the great work which was waiting to be done among the Greeks, and therefore he hastened to seek out and bring Saint Paul to Antioch, from his retirement at Tarsus. When the prophet Agabus at Antioch foretold a great universal famine, Barnabas and Paul were selected by the faithful, to take to the Church of Jerusalem their generous offerings for the poor of that city. It was also at Antioch that the two Saints were named for the apostolate of the Gentiles; and they sailed together for Cyprus and then to the cities of Asia Minor.

Their preaching struck men with amazement, and some cried out, The gods have come down to us in the likeness of men! calling Paul Mercury, and Barnabas Jupiter. The Saints traveled together once again, to the Council of Jerusalem, and told of the signs and wonders which God had wrought among the Gentiles during their missionary journey. Shortly after this they separated; Barnabas with John Mark went to Cyprus, while Paul with Silas returned to Asia Minor.

The tradition of Milan, Italy, reveals that Saint Barnabas went from Cyprus to Italy, and in Milan founded its church; he is still honored there as its first bishop. After seven years he consecrated Saint Anathalon to replace him, and returned to Cyprus to visit the churches. He crisscrossed the island several times to bring to every city and village the Holy Name of the Son of God. In Salamis, some of the recalcitrants plotted together to kill him. He was aware of the conspiracy; nonetheless, after foretelling to John Mark that he would die that same day, he went to the synagogue to preach as usual. It was there that he was stoned as a blasphemer, in the year 61 of our era. Saint John Mark succeeded in burying him near Salamis.

Comments

Pray for us Amen

Add new comment

2 + 8 =