SAINT OF THE DAY – April 30 పునీత 5వ భక్తినాథ (పయస్) పోపు | POPE ST. PIUS V

@pjsri

దొమినకను సభనుండి వచ్చిన పోపుగారు. గొప్ప సంస్కరణవాది, కార్డినలు 'అలేలెంద్రియానో'గా పేర్గాంచిన వారు. మతసాక్షి క్రీ||శ|| 1504-1572 ఇటలీలోని పీద్ మౌంటు ప్రదేశంలోగల అలెసాంద్రియకు దాపులోని బోస్కో అనే ఊల్లో 5వ పయస్ పోపుగారు క్రీIIశII 1504 జనవరి 17న ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వీరి జ్ఞానస్నానం పేరు అంతోనియో మిఖాయేలు గిట్లయేరి. వీరు చదువుకొని తమ 14వ ఏట వో ఘరా పట్టణంలోని ఒక దొమినికను మఠాలయం ప్రవేశంపొంది గురు శిక్షణ గడించారు.

క్రీ||శ|| 1528లో తమ 24వ ఏటనే పవి.గురు పట్టాభిషిక్తులయ్యారు. అటు తరువాత వారు గురు విద్యాలయాల్లోను దొమినికను మఠాలయాలోను నోవీసుల అధిపతిగాను సేవలందిస్తూ 16సం||లు తత్వశాస్త్రం, వేదాంత విద్యను బోధించారు. క్రీ||శ|| 1556లో 4వ పౌలు పోపుగారిచే నేపి మరియు బుటి మేత్రాసనంకు పీఠాధిపతిగా నియమితులయ్యారు. బిషప్ గిబ్లియేరిగారే మిలాను మరియు లొంబార్గి మహానగరాలకు మత నియమ నిబంధనలను విచారించే క్రైస్తవ న్యాయాధిపతిగా నియామకం చేయబడ్డారు.

క్రీ.శ. 1557లో కార్డినలుగా పదోన్నతి పొందుటయేగాక శ్రీసభ అంతటికి మత నిబంధనావళి న్యాయాధిపతిగా ఏర్పరచబడ్డారు. పవిత్రతకు విశ్వాసానికి మారు పేరైన కార్డినలు గిబ్లియేరిగారు తమ బాధ్యతల నిర్వహణలో ముక్కసూటిగాను నిక్కచ్చిగాను ఉండేవారు. ఎలాంటి పక్షపాతం సహించేవారుకాదు. అందువల్లనే 4వ పయస్ (భక్తినాథ) పోపుగారు బంధు ప్రీతితో తమకు దగ్గర చుట్టమైన ఒక 13సం||ల ప్రాయంగల ఫెర్డినాండు దే మెదిచి అను బాలుని కార్డినలుగా చేయడాన్ని గట్టిగా ప్రతిఘటించారు. అలాగే జర్మనీరాజ్య పాలకుడైన 2వ మ్యాక్సిమిలియను చక్రవర్తి గురువులకు బ్రహ్మచర్య వ్రతం అక్కరలేదని రద్దుపరచే నిబంధనను తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే క్రీ||శ|| 1566లో పోపుగారు గతింపగా క్రొత్త పోపుగారి ఎన్నిక సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో అలెసెంద్రియానో కార్డినలుగా ప్రసిద్ధికెక్కిన గైస్లిమేరిగారు క్రొత్త పోపుగా ఎన్నికై 5వ పయస్ (భక్తినాథ) పోపుగారిగా నామకరణం ధరించి క్రీ||శ|| 1566 జనవరి 7న శ్రీసభకు 226 పోపుగా సింహాసనాధీసులయ్యారు. అందుకు వీరికి అప్పటి ఇటలీకి జగద్గురు పాలనాసంఘ కార్యదర్శి, మిలాను అగ్రపీఠాధిపతులైన పునీత చార్లెస్ బొరోమియోగారి అండదండలు పుష్కలంగా లభించాయి. దాంతో సంస్కరణ వాదులదే పైచేయి అయ్యింది. అందువల్ల ఆ రోజులకు తగ్గట్టు మత కట్టడలు కఠినతరం చేయబడ్డాయి.

5వ భక్తినాథ పోపుగారు ట్రెంటు మహాసభ తీర్మానాల్ని వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఉత్తర్వు చేశారు. క్రీ||శ|| 1566లో క్రొత్తగా రచింపబడిన సత్యోపదేశం పుస్తకాన్ని ఆవిష్కరించారు. క్రీ||శ|| 1568లో గురువుల దైవార్చనా ఘడియ గ్రంథాన్ని సంస్కరింపజేశారు. క్రీ||శ|| 1570లో సరిదిద్దబడిన పూజాబలి ప్రార్థనా పుస్తకాన్ని వెలువరించారు.5వ పయస్ జగద్గురువులు క్రీ||శ|| 1567లో పునీత తో పూసు అక్వినాసుగార్ని తీసభ వేదాంత పండితునిగా ప్రకటించి వారి పూర్తి రచనావ్యాసంగాల్ని పునర్ముద్రింప ఆదేశించారు. వారు పేదలైన వారికి భూరి విరాళాలు ప్రకటించారు. 

ధృఢ విశ్వాసం, గొప్పభక్తి, ధర్మనిష్ఠతో గురుత్వ జీవితం పాటించారు. ప్రార్థన ధ్యానం వారి నిత్యకృత్యం. గొప్పహోదాలో ఉన్నాగాని ఆసుపత్రులు, రోగులను స్వయంగా సందర్శించి పరామర్శించేవారు. తనను తాను తగ్గించుకునేవారు. శ్రీసభ పాలక సంఘమైన కార్డినళ్లు తమ వైభవాన్ని విడనాడి అతి నిరాడంబరంగాను, ఆహారపు అలవాట్లలో కూడ పేద జీవితం గడపాలని ఆదేశించారు. పీఠాధిపతులు మేత్రాసన స్థాయి సెమినరీ గురుశిక్షణాలయాలను స్థాపించుకొని తమ పీఠం పరిధిలోనే క్రైస్తవ మత కార్యక్రమాల్లో నిమగ్నమై యుండాలని కోరారు. రాజకీయరంగంలోకూడ 5వ పయస్ జదురువులు కతోలిక రాజులకు మద్దతుగా నిలిచారు. వారి జీవితకాలమంతా ప్రొటెస్టెంటులతో అవిశ్రాంత పోరాటం సలిపారు. ప్రొటెస్టెంటుగా మారిన ఇంగ్లాండు రాణి 1వ ఎలిజబెత్ ను మత బహిష్కారంచేసి కతోలిక మద్దతుదారైన మేరి స్టూవర్టుగారిని సమర్ధించారు. ఆ రోజుల్లో తురుష్కుల నుండి క్రైస్తవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఈ ముష్కరులను ఎదుర్కొనేందుకు విశ్వాసులు సుకృత జపాలు, త్యాగ క్రియలతో విరాళాలందించాలని ప్రకటించారు. క్రీIIశII 1567లో అన్ని కతోలిక మఠ నిలయాలు, దేవాలయాలు తమ ఆదాయంలో దశమ భాగంను ఈ పవిత్ర కార్యంకై దానం చేయ కట్టడిచేశారు. | చివరకు తురుష్కులు కతోలిక దేశమైన సైప్రసు పై యుద్ధం ప్రకటింపగా కతోలిక రాజులందరిని సమైక్య పరచడంలో పరిశుద్ద పోపుగారు విశేష కృషి సల్పారు. 

ఆస్ట్రియా కతోలిక రాజైన డాన్ జ్వాన్ నాయకత్వంతో వెనిస్, జెనీవా, స్పెయిన్, శ్రీసభ సైన్యంనుకూడ కలుపుకొని నడిపింప అనుమతించి ప్రోత్సహించి ధనసాయం కూడ అందించారు. లేపాంటో ఓడరేవు వద్ద జరిగిన భీరక నౌకాయుద్ధంలో క్రీ||శ|| 1571లో కతోలిక రాజుల సమైక్య కూటమి ఘన విజయం సాధించింది. జపమాలను జపిస్తూ రోమునగర వీధుల్లో ఊరేగింపులతో విజయోత్స వాలు జరుపుకున్నారు. 5వ భక్తినాధ పోపుగారు జపమాల మాత పండుగను శ్రీసభ అంతటా జరుపుకొన ఉత్తర్వులిచ్చారు. దేవమాత గొలుసు ప్రార్థనలో “క్రైస్తవుల యొక్క సహాయమా !'' అను బిరుదము కూడ జోడించారు.

వారు క్రీ||శ|| 1572 మే 1వ తేదీన ఈ లోకంలో తమ జీవిత పరుగును ముగించారు. వారి మధ్యవర్తిత్వాన అనేక మేలులు, స్వస్థతలు జరిగినాయి. క్రీ||శ|| 1712లో 11వ క్లెమెంటు పోపుగారిచే వారికి పునీత పట్టా ప్రధానం చేయబడింది.


Michael Ghislieri, a Dominican friar from his fifteenth year, a teacher of religion at twenty, as a simple religious, as inquisitor, bishop, and cardinal, wasfamous both for the spotless purity of his own life and for his intrepid defense of the Church's faith and discipline. Surrounded in his time by great men and great Saints, in apostolic virtue he was surpassed by none.

As Pope, his first concern was to reform the Roman court and the capital city by the strict example of his own household and the punishment of offenders. He next endeavored to obtain from the Catholic powers recognition of the decrees of the Council of Trent, two of which he strictly enforced: the obligatory residence of bishops in their sees, and the establishment of diocesan seminaries. He revised the Missal and Breviary, and reformed ecclesiastical music.

He was not less active in protecting the Church outside Italy. We see him at the same time supporting the Catholic King of France against the Huguenot rebels, and encouraging Mary, Queen of Scots in the bitterness of her captivity. It is he who excommunicated her rival, the usurper Elizabeth, when the best blood of England flowed upon the scaffold and the measure of her crimes was full. The intrepidity of this Vicar of Christ found enemies. 

The holy Pope was accustomed to kiss the feet of the crucifix on leaving or entering his room. One day the feet moved away from his lips. Sorrow filled his heart, and he made acts of contrition, fearing that he must have committed some secret offense, yet he still could not kiss the feet. It was afterwards discovered that they had been poisoned by an enemy.

It was in the Lepanto victory that the Saint's power was most plainly manifest. There, in October of 1571, by the holy league which he had formed but still more by the prayers of the aging Pontiff to the great Mother of God, the defeat of the advancing Ottoman forces was obtained and Christendom was saved from the Turk. Six months later Saint Pius V died, having reigned only six years.

Add new comment

9 + 5 =