water man

వాటర్‌మ్యాన్ @ ఇంద్రా కుమార్

ఈ వేసవి కాలంలో దేశమంత నీటికోసం అలమటిస్తున్నాయి , చెన్నై మహానగరం లో ఐతే త్రాగడానికి గ్రుక్కెడు నీరు కూడా దొరకక ప్రజలు అలమటిస్తున్నారు .అయితె చెన్నై నగరమంతా చుక్క నీరు దొరక్క ప్రజలంతా ఇక్కట్లు పడుతుంటే, ఒక్కరు మాత్రం బిందాస్‌గా ఉన్నారు. ప్రభుత్వ కుళాయి నీరు తీసుకోరు... ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కోరు... మరి ఆయన ఎలా జీవిస్తున్నారు?

మహానగరాల్లో అత్యధికులు నీటి కోసం ఆధారపడేది ప్రభుత్వ నల్లాల/కుళాయి మీదనే. ఓ నాలుగు రోజులు నీళ్లు రాలేదంటే జీవితాలు తలకిందులైనంత పనవుతుంది. కానీ, చెన్నైలోని ఓ వ్యక్తి మాత్రం తనకు అసలు ప్రభుత్వ నల్లానే వద్దంటున్నారు.
ఆయనే ఇంద్రా కుమార్.
ఇటీవల చెన్నైలో వానలు పడినప్పుడు దాదాపు 18 వేల లీటర్ల నీటిని ఒడిసి పట్టాను. నేను అలా చేయకపోయి ఉంటే, వాన నీళ్లన్నీ మురికి కాలువల ద్వారా సముద్రంలో కలిసి, వృథా అయ్యేవి' అని అంటున్నారు ఇంద్రా కుమార్.
మేము వాన నీరు భూమిలో ఇంకేలా చేస్తున్నాం. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. ఇప్పుడు నిల్వ చేసిన నీటితో ఒక కుటుంబానికి నెల రోజులు సరిపోతాయి. వర్షపు నీటిని ఒడిసిపడుతున్నాం కాబట్టి మాకు నీటి ఇబ్బందులు ఎప్పుడూ రాలేదు' అని ఆయన వివరించారు.
మా ఇంటి మీద పడే వర్షపు నీరు నేరుగా ఫిల్టర్లలోకి చేరతాయి. ఫిల్టర్‌లో నాలుగు పొరలుంటాయి. పైపు ద్వారా ఒకటో ఫిల్టర్ నుంచి రెండో ఫిల్టర్‌కు నీళ్లు చేరతాయి. రెండో ఫిల్టర్ నుంచి బావిలోకి పోతాయి' అని వర్షపు నీటిని ఎలా శుద్ధి చేస్తోరో ఆయన వివరించారు.
దీన్ని పెట్టుబడిలా చూడాలి. భవిష్యత్తు కోసం డబ్బులు ఎలా మదుపు చేస్తామో ఇదీ అంతే. నేడు నిల్వ చేసిన నీరే రేపు కష్టాల్లో ఆదుకుంటుంది" అని అంటున్నారు ఆయన.
ఆక్సిజన్ కోసం మేడ మీద అంతా ఆయన మొక్కలు పెంచుతున్నారు.
వాన చుక్కలను ఒడిసి పట్టి, నీటి ఎద్దడిని అధిగమించడంలో విజయం సాధించిన ఇంద్ర కుమార్, చెన్నై నీటి కష్టాలకు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నారు.
ఇది మన అందరి బాధ్యత కూడా . ప్రతి ఒక్కరం వర్షపు నీటిని ఒడిసి పట్టుకోగల్గితే భావితరాలకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినవారమౌతాము .మన ప్రకృతిని మనమే కాపాడుకొందాము .
-Radio Veritas Asia Telugu

Add new comment

7 + 11 =