స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి

International day of cooperativesInternational day of cooperatives

స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి 

 

ప్రపంచం లోని ఏ దేశము దీనికి మినహాయింపు కాదు. 1990 తో పోల్చుకుంటే నేడు హరిత గృహ వాయులు 50 శాతం అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా భూగోళం యొక్క వేడిమి అధికమవడం వల్ల మన భూగ్రహానికి చాల తీవ్రమైన నష్టం జరుగుతుంది. మనం త్వరిత గతిన దీనికి స్పందించకుంటే ఎంతో ప్రమాదకరం.

వాతావరణ మార్పులు ప్రపంచమంతటా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మరి ముఖ్యంగా రైతులు, యువత మొదలగు వారు ఈ మార్పులకు తగినట్లుగా మారవలసి ఉంటుంది.

ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడం ముఖ్య ఉద్దేశం గా ఉన్న సహకార సంఘాలు దీనికి కావలసిన చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి.

1923 నుండి ప్రతి సంవత్సరం జులై లోని మొదటి శనివారం సహకార సంఘాలు అన్ని కలిసి "ఇంటర్నేషనల్ డే అఫ్ కూపెరటివ్స్" అని ఒక రోజును గమనిస్తున్నారు.

1995 నుండి ఈ రోజుకు గాను ముఖ్య ఉద్దేశాన్ని ఐక్య రాజ్య సమితి మరియు అంతర్జాతీయ సహకార సంఘాలు కలిసి నిర్ణయిస్తున్నారు. మరిన్ని సహకార సంఘాలు ముందుకు రావాలని వీరు ప్రధానంగా ఆశిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి వారు ప్రస్తావించిన సమస్యలను అంతర్జాతీయ సహకార సంఘాల వారు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఇటువంటి ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని వారు ఆశిస్తున్నారు.

దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో ఈ సంఘాలు ఎంతో గుర్తింపును కూడా తెచ్చుకొన్నారు. ఈ సంఘాల సహాయం ద్వారా ఎందరో సహాయం పొంది, తమ చుట్టూ ఉన్న ప్రజలను, తమ దేశం యొక్క పోరోభివృద్దిలో భాగస్తులయ్యారు.

ఈ సహకార ఉద్యమం అనేది పూర్తిగా ప్రజాస్వామ్యత తో నడుస్తుంది. మనం మన స్వంతగా దీనిని నడిపించగలిగినా దీని నియమాలు పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించనవి. ఈ సంఘాల ద్వారా సభ్యులు తమకు ఉన్న కష్టాలను తమంతటతామే తీర్చుకోగలరు, మరియు సమాజానికి అవసరమైన సామాజిక స్పృహను ఈ సంఘాలు కల్పిస్తాయి.

Add new comment

2 + 1 =