మే 22 , 23 , 24 తారీఖులలో విశ్వరూపం చూపించనున్న భానుడు.

temperature rise విశ్వరూపం చూపించనున్న భానుడు

మే 22, 23, 24 తారీఖులలో విశ్వరూపం చూపించనున్న భానుడు.

తెలుగు ప్రజలు మే 22 నుండి మే 24 వరకు జాగ్రత్తగా ఉండాలని భారత దేశ వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. మే 22, 23, 24 తేదీలలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది.

ఈ రోజులలో ఎండలు తారాస్థాయికి చేరుకుంటాయని తెలిపింది. మరో వైపు గుంటూరు జిల్లా రెంటచింతలను గత మూడు రోజులుగా భానుడు భగభగలాడిస్తున్నాడు. నిన్న 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదయింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల 43 నుండి 45 వరకు ఉషోగ్రతలు నమోదైయ్యాయి.

మే 22 నుండి 24 వరకు ఆంధ్ర, తెలంగాణాలలో పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బైటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపినా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.

Add new comment

8 + 1 =