మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు  తెలుగు రాష్ట్రాల్లో  పలు ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా,  వాయుగుండం ప్రభావంతో కొన్ని  ప్రాంతాల్లో  తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది.

ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్సాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశంలోని భిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కరైకాల్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  ఉత్తర, మధ్య భారతదేశంలో ఎండలు కొనసాగుతున్నాయి.

 

 

 

Add new comment

6 + 5 =