మన భూమిని కాపాడుకుందాం !

గత సంవత్సరాలను పరిశీలిస్తే  ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దేశాల్లో వరదలు,అకాల వర్షాలు,తుఫానులు ఇవన్నీ  తీవ్రమైన వాతావరణ మార్పులకు సంకేతమని విశ్లేషిస్తున్నారు.  ఇది ఇలానే కొనసాగితే సముద్ర మట్టాలు పెరిగే అవకాశం సైతం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హిమనీనదాలు కరిగిపోవడానికి, ఆర్కిటిక్‌లో మంచు కరిగిపోవడానికి 90 శాతం కారణం మానవ తప్పిదాలేనని నివేదికలు  స్పష్టం చేస్తున్నాయి.
కోప్26 లో జరిగిన సదస్సు లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు గురించి యువత ఆందోళన వ్యక్తం చేసారు .
మన దిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇదివరకే కాలుష్య తీవ్రతను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం వాహనాల వినియోగాన్ని నియంత్రించడానికి గాను సరి-బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చింది.    

మనం కూడా మనవంతు సహాయంగా మన భూమిని కాపాడుకొందాము.
అవసరం లేనప్పుడు లైట్లు, గృహోపకరణాలను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల వాతావరణ మార్పులపై పడే ప్రభావం కొంత మేర మనం తగ్గించవచ్చు .
మన ఇంటికి దగ్గర్లోని దుకాణాలకు నడుచుకుంటూ వెళ్లడం, సైకిళ్లపై వెళ్లడం వంటివి చేయడం వలన పర్యావరణానికి మేలు చేసినవారము అవుతాము మరియు మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిది.
చిన్నచిన్న పనులకు ,దగ్గర దూరాలకు కార్లను వాడకపోవడమే మంచింది.
మనవంతుగా,  భావితరాల  కోసం ఎక్కువ చెట్లు నాటాలి.భూతాపాన్ని కట్టడి చేయాలంటే కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడమే నిజమైన పరిష్కారము.
మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి .పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌, బ్యాగ్‌లనే ఉపయోగించండి. మనం చేసే చిన్నచిన్న పనులే పెద్ద ప్రభావం చూపిస్తాయి.

 

 

 

 

 

Add new comment

4 + 10 =