భారీ వర్షాలకు శ్రీలంక విలవిల

భారీ వర్షాలుకొలంబో

గత కొన్ని రోజులుగా శ్రీలంక దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, కొలంబోలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆగిపోయాయి, కానీ కొన్ని గంటల తర్వాత, రాజధాని లోని అనేక రహదారులను భారీ వర్షం మరియు వరద నీరు ముంచెత్తింది. 

తీవ్రమైన ఈ వర్షాల కారణంగా, 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. అక్టోబరు 16-17 తేదీల్లో కుండపోత వర్షం కారణంగా అత్తనగల్లుయోయలో నీటిమట్టం ఎక్కువగానే ఉంది.

గంప కందాన, గంప జాల ప్రధాన రహదారుల వెంబడి పలు ప్రాంతాలు నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురయ్యాయి. కటన కిబులపిటియ గుండా ప్రవహించే అత్తనగల్లు ఓయ యొక్క ఉపనది పొంగిపొర్లడంతో అనేక ఇళ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కాగా అక్టోబరు 17న గాలె జిల్లాలో చదురుమొదురు జల్లులు పడ్డాయి.

బద్దెగామాలో ఉన్న జింగ్ రివర్ వాటర్ గేజ్ వద్ద అక్టోబర్ 18న 3.5 మీటర్ల గా నమోదు అయ్యింది. గింగి నది నీటిమట్టం పెరగడంతో గనేగామ, వక్వెల్ల ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంబలంగూడ, బాటపోల, గల్లే ఎల్పిటియ రహదారులలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీల్వాలా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. 

మాతర ప్రాంతం చుట్టూ సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఆయా ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేదు.

కలుతారా, నువారా ఎలియా, రత్నపురా, కేగల్లె మరియు కొలంబోతో పాటు ఇతర జిల్లాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి మరియు ప్రాణ నష్ట నివారణ చర్యలు అమలులో కొనసాగుతున్నాయి.

ఇంగిరియ, వాలల్లావిట, పలిందనువార, బులత్‌సింహాల ప్రాంతీయ సచివాలయాలలోని భూములకు మూడవ స్థాయి రెడ్‌వార్నింగ్‌లు జారీ చేసినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. వర్షాలు ఇలాగే కొనసాగితే నదుల వెంబడి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని నీటి పారుదల శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల కరుణానాయక్ మాట్లాడుతూ,  ద్వీపంలో రుతుపవనాల మధ్య కాలం కావడంవల్ల ఈ ముప్పు జరిగిందని వెల్లడించారు.

సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ద్వీపం అంతటా వర్షాలు కురుస్తాయి. పశ్చిమ, గాల్లే, మాతర జిల్లాలతో పాటు సబరగామువా, సెంట్రల్ ప్రావిన్స్‌లలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 50 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కరుణానాయక్ తెలిపారు. తాత్కాలికంగా బలమైన గాలులు మరియు ఉరుములు కూడా సంభవించవచ్చు. పుట్లం నుండి కొలంబో మీదుగా పోతువిల్ వరకు తీరప్రాంతం వెంబడి కొన్నిచోట్ల జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వర్షం పడే అవకాశాలు పెరుగుతాయి అని వాతావరణ శాఖ తెలిపింది. 

Add new comment

4 + 0 =