భారతదేశంలో సైలెంట్ కిల్లర్

భారతదేశంలో సైలెంట్ కిల్లర్

కాలుష్యం కారణంగా 2019లో భారత్‌లో 23 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఇదే అత్యధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదే  ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు  90 లక్షల మంది కాలుష్యం బారిన పడి మరణించారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వెల్లడించింది.ఉపరితల వాయు కాలుష్యం కారణంగానే 2019లో భారత్‌లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. ఇంటి లోపలి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా మరణాల సంఖ్య 2000 సంవత్సరంతో పోలిస్తే సగం తగ్గాయి.

కాలుష్యం కారణంగా సంభవిస్తోన్న మరణాల్లో చైనా రెండో ఉంది. 2019లో మన పొరుగు దేశంలో 22 లక్షల మంది కాలుష్యం బారిన చనిపోగా.. వాయు కాలుష్యం కారణంగా చైనాలో 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లెడ్ లాంటి విష రసాయనాల కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మరణాలు సంభవించాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.

 కాలుష్యం కారణంగా దేశ  ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి అని తెలిపింది.ఈ పొల్యూషన్‌ సమస్యను అదుపు చేయకపోతే 2024నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలన్న భారతదేశపు కలలు ఈ మరణాలు, ఆర్ధిక నష్టాల వల్ల అసాధ్యంగా మారతాయని ఐసీఎంఆర్‌ నివేదిక ఇది వరకే వెల్లడించింది.

దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు తీవ్రమైన వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. రాజధాని దిల్లీ నగరంలో PM 2.5 సూచి 300 వద్ద ఉంటే ఆ నగరంలో నివసించే ప్రతివ్యక్తి 15 సిగరెట్లు తాగిన దానికి సమానమైన పొగను పీల్చినట్లు లెక్క.
అలాంటి పరిస్థితుల్లో 20-30 ఏళ్లపాటు దిల్లీ నగరంలో నివసించిన ప్రతి ఒక్కరు ధూమపానం చేసినట్లే. ఊపిరితిత్తుల సమస్యల్లో 40% కేసులకు వాయు కాలుష్యమే కారణమని తెలుస్తుంది. మనమందరం ఇప్పటికైనా వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి .

Add new comment

6 + 0 =