"బ్లూ ఫ్లాగ్ బీచ్" గా వైజాగ్ రుషికొండ బీచ్

beach
"బ్లూ ఫ్లాగ్ బీచ్" గా వైజాగ్ రుషికొండ బీచ్:
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ( Blue Flag Beach ) ల సరసన విశాఖపట్టణం స్థానం సంపాదించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు ఇచ్చే బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ దక్కింది.

మనదేశానికి చెందిన పలు బీచ్‌లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్‌లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్తిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు
ప్రపంచంలోనే 50 బ్లూ ఫ్లాగ్ బీచెస్ లో "పొల్యూషన్ కంట్రోల్ ప్రాక్టీసెస్" లో కూడా విశాఖపట్టణం మూడో స్థానం సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్‌ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.

ఓ వైపు కొండ..మరోవైపు లోపలకు చొచ్చుకొస్తున్నట్టుండే సముద్రతీరం.విశాఖపట్టణం లోని రుషికొండ బీచ్ సుమనోహరంగా ఉంటుంది.సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రజలందరూ పిలుచుకునే మన విశాఖపట్నం మరో అరుదైన ఘనతను సాధించింది ఇప్పుడు.
 బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు కష్టపడటం వల్లే బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ లభించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

Add new comment

4 + 3 =