బుధవారం భానుడు ఒక్కసారిగా నిప్పులు కురిపించాడు.

బుధవారం  భానుడు ఒక్కసారిగా నిప్పులు కురిపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్‌ వ్యవస్థలు దెబ్బతినే స్థాయిలో ఈ కిరణాలు నమోదైనట్టు కోల్‌కతా‌లోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా (సెస్సీ) వెల్లడించింది.భారత్‌, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో వీటి ప్రభావం స్పష్టంగా కనిపించినట్టు సెస్సీ నిపుణులు గుర్తించారు. సూర్యుడి జ్వాలలు కారణంగా హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించడం, ఉపగ్రహాలు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తాయి.   

సౌర చక్రంలో పరిస్థితులు ప్రభావంతో సూర్యుడి ఉపరితలం మరింత వేడెక్కుతుండటం వల్ల కరోనల్ మాస్ ఎజెక్షన్‌ అనే విస్ఫోటనం ఏర్పడిందని, అది భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం మనకు  తెలిసిందే.

సౌర తుఫానుల వల్ల మనుషులకు నేరుగా ప్రమాదం కలిగే అవకాశాలు అతి స్వల్పమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, వాతావరణం కలిసి.. సూర్యుడి ప్లాస్మా వికిరణాలను, రేడియేషన్‌ను చాలావరకు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. చాలా శక్తివంతమైన సౌర తుఫానులు భూమిని తాకితే.. నేరుగా ఎండ తగిలే లా ఉన్నవారిపై కాస్త రేడియేషన్‌ ప్రభావం ఉండొ చ్చని, కానీ అది స్వల్పమేనని స్పష్టం చేస్తున్నారు.

Add new comment

3 + 3 =