ప్రపంచ సముద్ర దినోత్సవం

ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని ఐరోపా దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.

తాబేళ్లు, తిమింగళాలు, ఇతర జలచరాలు ప్లాస్టిక్‌ను మింగడం లేదా వాటిల్లో చిక్కుకొని మరణిస్తున్నాయి. సముద్రాల్లో అంతరిస్తున్న జలచరాలకు, ప్లాస్టిక్‌ నుంచే ముప్పు ఎక్కువ. తాబేళ్లు, జెల్లీ ఫిష్‌లు పొరపాటున ప్లాస్టిక్‌ కవర్లు తినడంతో వాటి జీర్ణవ్యవస్థ పాడై చనిపోతున్నాయి. సముద్ర పక్షులు ప్లాస్టిక్‌ను చేపలుగా భావించి తింటున్నాయి. ఇలా చనిపోయిన వాటిలో దాదాపు 80 శాతం పక్షుల కడుపుల్లో ప్లాస్టిక్‌ ఉంటున్నది. ఏటా దాదాపు ఎనిమిది మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లు ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రాలలో పడేస్తున్నారు. భూమిపై 29 శాతం నేల ఉంటే మిగిలిన 71 శాతం సముద్ర నీరే ఉంది. ఈ ధరణిపై నివసించే ప్రాణులన్నీ ప్రత్యక్షంగా , పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కడలి బాగుంటేనే  జీవరాశులన్నీ బాగుంటాయి.

Add new comment

1 + 1 =