ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం (World Meteorological Day)

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రకృతి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

వాతావరణ మార్పుల ఫలితంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వాతావరణం మరియు నీటి తీవ్రతలు చాలా తరచుగా మరియు తీవ్రంగా మారుతున్నాయి.COVID-19 సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత  క్లిష్టతరం చేసింది.
ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం సందర్భముగా వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయి.
వాతావరణ పరిశోధన చేసిన వాళ్ళకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హో వైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్-మమ్ అంతర్జాతీయ అవార్డు లు బహుమతులు అందజేయబడుతాయి.

 

 

Add new comment

9 + 9 =