ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈరోజును అటవీ వృక్ష జంతు సంతతి యొక్క విభిన్న రూపాలను సంరక్షించడానికి వచ్చిన అవకాశంగా జరుపుకుంటారు. ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందిస్తారు.

 ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడే అటవీప్రాంతాలు రానురాను కుచించుకుపోయి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దీంతో అరుదైన జీవ, జంతుజాలాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. అరుదైన జంతువులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. సహజ పర్యావరణ అడవులు, సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు, వీటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి బాధ్యత అని మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51(A)(‌G) లో ఉంది. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన దేశం లో  నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (IBWL- Indian Board for WildLife) ను 1952 లో నెలకొల్పారు. దేశంలో మొత్తం సజీవ జాతులు 1,50,000 ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం దేశంలో100కు పైగా  జాతీయ పార్కులున్నాయి.అభయారణ్యాల సంఖ్య- 500 పైగా ఉన్నాయి.

మన దేశం లో వన్యప్రాణులు కాపాడుకోనేదుకు మన దేశంలో సంరక్షణ చట్టాలు (Wildlife Conservation Laws) ఏర్పాటు చేసారు .అవి మద్రాసు అడవి ఏనుగుల సంరక్షణ చట్టం-1873, భారతీయ ఏనుగుల భద్రతా చట్టం-1879, అటవీ పక్షులు, జంతువుల భద్రతా చట్టం-1912, బెంగాల్ ఖడ్గమృగ సంరక్షణ చట్టం-1932, అస్సాం ఖడ్గమృగ సంరక్షణ చట్టం-1954, జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 అడవుల సంరక్షణ చట్టం-1980 వంటి చట్టాలు ఏర్పాటు చేసారు.

అలాగే గిర్ జాతీయ పార్కు  --గుజరాత్ --సింహం , ఖాజిరంగా జాతీయ పార్కు --అసోం ---ఖడ్గమృగం ,సుందర్ బన్స్ జాతీయ పార్కు ---పశ్చిమబెంగాల్ --- పెద్దపులి (రాయల్ టైగర్),బందీపూర్ జాతీయ పార్కు---కర్ణాటక ---ఏనుగులు ,పెరియార్ జాతీయ పార్కు ---కేరళ ---ఏనుగులు ,రాన్ ఆఫ్ కచ్ జాతీయ పార్కు ---గుజరాత్---అడవి గాడిదలు, బోరివిల్లే జాతీయ పార్కు ---ముంబయి --- అరచే జింకలు,భరత్ పూర్ లేదా ఘనాపక్షి  సంరక్షణాకేంద్రం--- రాజస్థాన్ --- సైబీరియా కొంగలు, జిమ్ కార్బెట్ జాతీయ పార్కు--- ఉత్తరాఖండ్--- పెద్ద పులులు,  పర్కాల్ జాతీయ పార్కు --- ఆంధ్రప్రదేశ్--- చిరుతపులులు వంటి సంరక్షణ కేంద్రం లను కూడా ఏర్పరు చేసారు.

Add new comment

2 + 1 =