ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020June 5th - World Enviornment Day 2020

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020

మనం తినే ఆహరం, మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు మరియు మనం నివసించడానికి అనువుగా ఉన్న ఈ వివాతావరణం అన్ని ఈ ప్రకృతి ప్రసాదాలు. ఉదాహరణకు నీటిలో ఉండే మొక్కలు మన పర్యావరణకు సగానికి పైగా ఆక్సిజన్ ను అందిస్తాయి, మరియు ఒక మహా వృక్షం వాతావరణములోని గాలిని శుభ్రపరచి 22 కిలోల కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చి మనకు అందిస్తుంది. మనకు ప్రకృతి ఎంతో సహాయం చేస్తున్నా మనం మాత్రం ఈ ప్రకృతికి హాని కలిగిస్తున్నాము. కనుక మనం ఆ దిశగా మార్పు తేవడానికి కృషి చెయ్యాలి.

చరిత్ర మరియు లక్ష్యాలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5 న కొనియాడబడుతుంది. మన పర్యావరణను పరిరక్షించడానికి మరియు ప్రజలలో అవగాహనను కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ఒక వారధిగా నిర్ణయించింది. ప్రతి ఏటా సుమారు 143 దేశాలు ఈ రోజును కొనియాడడం ద్వారా ప్రజలలో అవగాహన కలిగిస్తున్నారు. 1974 లో మొదటి సారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరపడం జరిగింది. అప్పటినుండి నీటి కాలుష్యం, అధిక జనాభా, భూఉపరితల ఉష్ణోగ్రతలతో మార్పులు, వన్య ప్రాణుల రక్షణ వంటి అంశాలను గూర్చి ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు.

ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎన్నో విధాలు గా కొనియాడడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణను గూర్చిన నాటకాలు ప్రదర్శించడం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం, చెట్లను నాటడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ రోజును అనేక దేశాలలో కొనియాడుతారు.

2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం

2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం నేడు ప్రపంచమంతటికి అత్యవసరమైన, అతి ముఖ్యమైన  జీవ వైవిధ్యం. కొంత కాలం క్రితం బ్రెజిల్, అమెరికా మరియు ఆస్ట్రేలియా లో ఎన్నో వనాలను దహించిన దావానలం నుండి, తూర్పు ఆఫ్రికా అంతటా వ్యాపించిన మిడుతల దండు మరియు నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వంటి వాటి మధ్య మనుషులు ఒకరి పై ఒకరు ఎలా ఆధారపడి జీవిస్తున్నారో చాటి చెప్పడం.

జీవ వైవిధ్యం మరియు మానవులకు దానితో ఉన్న సంబంధం.

నేల పైన జీవులకు, నీటి లో జీవించు సమస్త జీవరాశులకు జీవ వైవిధ్యం పునాది వంటిది. మానవుల ఆరోగ్యం, శుభ్రమైన గాలి మరియు నీరు అందించడం, పౌష్టికాహారం, ఔషదాలని వాటికి సంబందించిన జ్ఞానాన్ని, రోగ నిరోధక శక్తి, వాతావరణ మార్పులు వంటి వాటన్నిటి పైన దీని ప్రభావం ఉంటుంది. జీవ జాలం నుండి ఒక మూలకాన్ని తీసివేయడం వలన జీవజాలం అంత దెబ్బ తిని ఎంతో దుష్ప్రభావం ఉంటుంది.

అడవులను అధికంగా నరికివేయడం, అధిక వ్యవసాయం, వన్య ప్రాణుల జీవన స్థావరాలను ఆక్రమించడం వంటి వాటి వల్ల ప్రకృతికి మనిషి ఎంతో హాని కలిగించాడు. ఇదే విధంగా ముందుకు వెళ్తే జీవ వైవిధ్యంలో పెను మార్పులు జరిగి మనిషి ఆహార, ఆరోగ్యాలకు హాని తప్పదు.

మానవులకు ఆధారంగా ఉండే జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తే పరిణామానికి నిదర్శనమే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. కరోనా వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది అస్వస్తులౌతున్నారు మరియు ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. నేడు 75 శాతం వ్యాధులు జంతువుల ద్వారానే మనుషులకు సోకుతున్నాయి. దీనిని బట్టి ప్రకృతి మనకు ఒక ముఖ్య సందేశాన్ని ఇస్తుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎలా కొనియాడాలి ?

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కొనియాడాలంటే ముందు మన వల్ల ప్రకృతికి, ఈ భూమికి తగిలిన దెబ్బలను మాన్పడానికి మనం ముందుకు రావాలి. ఎవరో ముందుకు వచ్చి ఎదో చేస్తారు, అప్పుడు మనం కూడా వారితో కలిసి పని చేద్దాం అనుకుంటే ఏమి జరగదు. మనంతట మనం స్వచ్చందంగా ముందుకు రావాలి. ఎవరో వస్తారని ఎదురు చూసే కంటే ఆ ఎవరో మనం ఎందుకు కాకూడదు? మనం చేసేది కొంచమే అయినా మన వంతు చెయ్యడానికి ముందుకు రావాలి. ఒక గొప్ప ఆంగ్ల సామెతలో చెప్పినట్లుగా "ఔదార్యం మన ఇంటి నుండే మొదలు కావలి".

మనం చెయ్యగలిగిన కొన్ని మంచి కార్యాలు:

1 . మొక్కలు నాటడం: ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి. నాటడం మాత్రమే కాదు. ఆ మొక్క
     పెరిగి పెద్ద వృక్షం అయ్యే వరకు దానిని సంరక్షించాలి.
2 . పాలిథిన్ ను నిషేధించాలి: అందరు పాలిథిన్ ను వాడడం మానివేయాలి. వీలైనంతవరకు
      పాలిథిన్ తో తయారు చేసిన వస్తువులను వాడడం మాని వెయ్యాలి.
3 . ఈ - వ్యర్ధాలను రీసైకిల్ చెయ్యాలి: మన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్ టాపులు చెడిపోతే
     వాటిని ఇంట్లోనే ఉంచుకోకుండా రీసైకిల్ చేసే కర్మాగారంలో ఇవ్వాలి.
4 . హెర్బల్ లేదా సహజ వనరులు: వీలైనంతవరకు హెర్బల్ లేదా సహజ వనరులను
     ఉపయోగించాలి. నేల లో త్వరగా కలిసిపోయే హెర్బల్ లేదా సహజ వనరులను వాడితే
     పర్యావరణకు తక్కు హాని కలుగుతుంది.
5 . నీటిని జాగ్రత్తగా వాడాలి: నీటిని వ్యర్థం చెయ్యకుండా పొదుపుగా వాడడం నేర్చుకోవాలి.

Add new comment

8 + 0 =