ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తుంటారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.  1970 సెప్టెంబరు 27న UNWTO(ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) అధికారిక హోదాను అందుకుంది. అందువల్ల సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

కొత్త ప్రదేశాలు చూడటం, ప్రయాణించడం, జ్ఞాపకాలను సేకరించడం అంటే అందరికి ఇష్టమే.  మనం  ఎంత బిజీగా ఉన్నా  కుటుంబం, స్నేహితులతో  ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. కొంతమందికి పాత జ్ఞాపకాలను మర్చిపోవడానికి, మరికొందరికి పనుల ఒత్తిడి తగ్గించుకొనడానికి ఎంతగానో ఈ ప్రయాణాలు ఉపయోగపడతాయి.   
పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు మన తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.అరకు లోయ, బొర్రా గుహలు, పాపి కొండలు,  లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి. 'అరకు లోయ'..దీన్ని ఆంధ్ర ఊటీగా పిలుస్తుంటారు.
అరకు ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు,లోయలతో జానాలను తెగ ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది. అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన అడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. తూర్పు కనుమలులో ఉన్న ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.

 

 

Add new comment

1 + 1 =