ప్రపంచ నీటి దినోత్సవం (World Water Day)

  • ప్రపంచ నీటి దినోత్సవం (World Water Day)

 

వేసవి కాలం  వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత తో  కనీసం తాగు నీరు దొరకక ఎంతో మంది బిందెలతో బారులు తీరి వీధుల్లో కనిపిస్తారు. ఇప్పటికి ఇలా నీరు లభించకుండా ఎన్నో గ్రామాలూ, పట్టనాళ్ళలో ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు.

ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భూమిపై 75 శాతం వరకూ నీటి వనరులు ఉన్నాయి. 

ఐతే గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.

 

Add new comment

8 + 4 =