ప్రపంచ జనాభా దినోత్సవం | World Population Day

@pjsri

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. గత 30ఏళ్లుగా మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ఏడాదేడాదికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల వలన జరిగే పరిణామాలపై చర్చించుకునేందుకు 1989లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1987 జూన్ 11న ప్రపంచ జనాభా 500కోట్లు దాటగా.. దానిపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

అయితే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. మానవ వనరులు చాలా అవసరం. కానీ జనాభా పెరిగితే వనరులు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా దేశాల్లో నీటికి విపరీతమైన కొరత ఉంది. ఎన్నో దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.


Observed every year on 11th July globally. Aims to raise awareness about the global population. Say 'No' to overpopulation to Have a Better Life.
 

Add new comment

10 + 0 =