ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం| World Food Security Day 7 June 2021

ఆహార భద్రతా దినోత్సవాన్ని2021 జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆహారం పట్ల శ్రద్ధ, వృథా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార లోపంతో వచ్చే రిస్కులు తెలుసుకోవాలి. 

ఈ ఏడాది ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రేపటి ఆరోగ్యకరమైన ఉదయం కోసం ఇవాళ ఫుడ్ సేఫ్ చేయండి (Safe Food Today for a Healthy Tommorow) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఉత్పత్తిలోనే కాకుండా ఫుడ్ సేఫ్ చేయడంలోనూ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండి భౌగోళికంగా, ఆర్థికంగా వృద్ధి కావొచ్చు.

ప్రజలు, జంతువులు, మొక్కలు, పరిసరాలు మన భవిష్యత్ పై ప్రభావం చూపించే సంబంధాలే. పోషకాహార లోపం వల్ల ఐదేళ్ల లోపు పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారిపై దుష్ప్రభవాలు చూపిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2018 నుంచి జూన్ 7న వరల్డ్ సేఫ్టీ డే నిర్వహిస్తున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

Add new comment

4 + 0 =