ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది

ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. 30 నగరాల జాబితా లో భారత్ నుంచి 22 నగరాలు ఉన్నాయి.కాలుష్య దేశాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.  బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాలు వరసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్‌ (IQ Air) 2020 సంవత్సరానికి గాను ఈ నివేదికను వెల్లడించింది.

మన దేశం లో చూసుకుంటే  బిస్రఖ్, జలాల్‌పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా, ముజఫర్ నగర్, భీవారీ, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, రోహ్‌తక్, ధారుహేరా, ముజఫర్‌పూర్‌ (బిహార్)లు ఈ జాబితాలో నిలిచాయి.
చైనాలోని జింజియాంగ్‌ నగరం  ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది.

Add new comment

17 + 3 =