పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేసిన HASSS

హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ ప్రాథమిక పాఠశాల నందు 25 జులై 2022 న హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవ సంస్థ (HASSS) వారి నేతృత్వంలో "గ్రీన్ అంబ్రెల్లా డ్రైవ్" నిర్వహించారు. 

"హరితహారం" తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. తెలంగాణ మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కార్డినల్ గా బాధ్యతలు స్వీకరించనున్న మహా పూజ్య పూల అంతోని గారు, Msgr వై బాలశౌరి గారు, సెయింట్ మేరీస్ ప్రధానోపాధ్యాయులు గురుశ్రీ ఇన్నయ్య గారు, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ప్రధానోపాధ్యాయులు గురుశ్రీ ఆరోగ్యరెడ్డి గారు, గురుశ్రీ విక్టర్ ఇమ్మానుయేల్ (ఛాన్సలర్), HASSS డైరెక్టర్ గురుశ్రీ మాదాను అంతోని గారు మరియు ఇతర గురువులు, మఠకన్యలు హాజరయ్యారు.

అగ్రపీఠాధిపతుల వారు "వృక్షో రక్షతి రక్షితః" అనే మాటతో ఈ కార్యక్రమం నిర్వహించడంలో ప్రాముఖ్యతను తెలియచేసారు. ప్రకృతిని మనంకాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని తెలిపారు. పొప్ ఫ్రాన్సిస్ గారి Laudato si లో కూడా వాతావరణం, దానిని కాపాడే భాద్యత ప్రతిఒక్కరిది అని అన్నారుఅని అందరికి గుర్తుచేసారు.

దాదాపు 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వారి విద్యార్థులు మరియు 20 మంది విచారణ గురువులు హాజరయ్యారు. "3000 మొక్కలు పంపిణి చేయడం జరిగిందని"  "కిచెన్ గార్డెనింగ్"ని ప్రోత్సహిస్తూ 50 సేంద్రీయ విత్తనాల ప్యాకెట్లను కూడా పంపిణి చేశారు. దీని ద్వారా  వ్యవసాయ పంటలతో పాటు కూరగాయల పంటలకు కూడా ప్రాధాన్యం ఉందని, ఈ సేంద్రీయ విత్తనాలు వాడడంతో కాన్సర్ నివారించవచ్చు అని గురుశ్రీ మాదాను అంతోని గారు RVA వారితో తెలిపారు. 

ప్రతి ఒక్కరు మొక్కను నాటించి హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళాలని కూడా తెలిపారు.

​ఈ గ్రీన్ అంబ్రెల్లా డ్రైవ్ 13 జులై 2022న అగ్రపీఠాధిపతులవారు తమ పీఠాధిపతుల భవనము నందు ప్రారంభించారు.

హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవ సంస్థ (HASSS) వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు అభినందిస్తున్నారు.

Add new comment

1 + 0 =