Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పర్యావరణ పరిరక్షణకు మతపెద్దలు మరియు శాస్త్రవేత్తల సమావేశం
పర్యావరణ పరిరక్షణకు మతపెద్దలు మరియు శాస్త్రవేత్తల సమావేశం
వాటికన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీ దేశాలు సంయుక్తంగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులను మరియు శాస్త్రవేత్తలను రోము నగరానికి ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 4 న జరగబోవు సమావేశంలో ప్రకృతిలోని మార్పులను గూర్చి చర్చించడానికి ఈ ఆహ్వానం ఇవ్వడం జరిగింది.
"విశ్వాసము మరియు విజ్ఞానము: COP26 దిశగా " అనే పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహిచబోతున్నట్లు, నవంబర్ 1 నుండి 12 తేదీలలో జరుగు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ముందు ఈ సమావేశం జరగనున్నందున ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకొంది.
ఈ సమావేశంలో పాల్గొనే దేశాలన్నీ పరిపూర్ణ కాలుష్య రహిత వాతావరణాన్ని 2050 వ సంవత్సరానికి కల్లా సాధించడానికి తగిన ప్రణాలికను తయారు చేస్తారు.
ప్రపంచంలో ఉన్న మత పెద్దలలో సుమారు 40 మందిని మరియు ప్రపంచ నలుమూలలనుండి 10 మంది సుప్రసిద్ధ శాస్త్రవేత్తలను ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వీరందరూ అనేక సంఘాలను, సంస్థలను ప్రేరేపించి, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి చేసిన ప్రణాళికలను అమలు చేస్తారు.
ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది మతపరమైన విశ్వాసాలు ఎక్కువగా కలిగి ఉంటారు వారిని ప్రేరేపించి పర్యావరణ పరిరక్షణ చేయ్యవచ్చు అని రోము లోని బ్రిటన్ రాయబారి అయిన శాలి జేన్ అన్నారు.
పలు దేశాలు తమ దేశాలలో పర్యావరణ పరిరక్షణను గూర్చిన అవగాహనను కలిగించడానికి దోహదపడేలా చెయ్యడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం.
కొంతకాలం క్రితం అమెరికా రాయబారి అయిన జాన్ కెర్రీ గారితో సమావేశమైన ఫ్రాన్సిస్ పోప్ గారు, నవంబర్ లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి తానూ కూడా హాజరు కావాలని ఆశిస్తున్నట్లు తన మనోవాంఛను తెలిపినట్లు సమాచారం.
Article by
Arvind Bandi
Online Producer
Add new comment