పర్యావరణను సంరక్షించడానికి ప్రపంచ మతాలను ఐక్యం చేస్తున్న "ప్రపంచానికి విశ్వాసం" (faith for earth).

Faith for EarthFaith for Earth

పర్యావరణను సంరక్షించడానికి ప్రపంచ మతాలను ఐక్యం చేస్తున్న "ప్రపంచానికి విశ్వాసం" (faith for earth).

ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్ధిక శక్తులలో విశ్వాస ఆధారిత సంస్థలు నాల్గవ స్థానంలో ఉన్నాయి. 50 శాతం వైద్యశాలలు, 50 నుండి 60 శాతం విద్యాసంస్థలు, 5 శాతం వాణిజ్య సంస్థలతో మొత్తం ఈ భూగోళంపై 10  శాతం భూవైశాల్యం లో ఉన్నాయి.

2017 లో "ప్రపంచానికి విశ్వాసం" (faith for earth)  అను ఒక ప్రణాళికకు ఐక్యరాజ్య సమితి అంకురార్పణ చేసింది. విశ్వాస ఆధారిత సంస్థలు అన్నీ కలసికట్టుగా 2030 నాటికల్లా సాధించవలసిన కొన్ని లక్ష్యాలను ఈ ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. 193 దేశాలు ఆమోదించిన ఈ ప్రణాళికలో పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యతా నిర్మూలన మరియు పర్యావరణ పరిరక్షణ అనునవి ముఖ్య అంశాలు.

విశ్వాస విలువలను ఆధారం చేసుకొని పర్యావరణ పరిరక్షణకు  నైతిక మరియు ప్రవర్తన మార్పులను తీసుకురావడానికి ప్రపంచంలోని అనేక విశ్వాసాలకు చెందిన అగ్ర నాయకులను ఒక సమాఖ్యగా తయారు చెయ్యడానికి కృషి చేస్తున్నాం" అని "ప్రపంచానికి విశ్వాసం" (faith for earth) ప్రధాన సమన్వయకర్త అయిన ఇయాద్ అబూమోఘ్లి అన్నారు.

ఇప్పటికే వనరులు అంతరించిపోతున్న మారుమూల పల్లెల్లో ఉంటున్న ప్రజల జీవితాలపై పర్యావరణ మార్పులు ఎంతో ప్రభావాన్నిచూపిస్తున్నాయని, ఆసియ, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా లోని ఎన్నో ప్రాంతాలు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, కనుక అక్కడి ప్రజలు మారుతున్న పర్యావరణాన్ని బట్టి మార్పు చెందాలని, అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించడానికి తగు చర్యలను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధము, ఇస్లాం, యూదులు మరియు క్రైస్తవులు వంటి ఎన్నో మతసంస్థలు ఈ ప్రణాలికను ఆచరిస్తూ ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందుతున్నాయి. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థ వారు వేలకొలది మొక్కలను నాటుతున్నారు.

శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను మతపరమైన నమ్మకాలకు, విశ్వాసాలకు జోడిస్తే ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన మార్పులను తీసుకురాగలం అని ఆశిస్తున్నాం అని ఇయాద్ అబూమోఘ్లి చెప్పారు.

ఈ ప్రణాళిక కోసం ఇప్పటికే 3000 మంది శ్రమిస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది దీనిలో భాగస్తులై పర్యావరణను సంరక్షించాలని ఆశిద్దాం.

Add new comment

1 + 5 =