నేపాలో భూకంపం - ఆరుగురు మృతి

నేపాల్‌ మారుమూల హిమాలయ గ్రామాలలో మట్టి ఇళ్ళను ధ్వంసం చేసిన భూకంపం వల్ల ఆరుగురు వ్యక్తులు, వారిలో నలుగురు పిల్లలు మరణించారు.

బుధవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 430 కి.మీ (270 మైళ్ళు) దూరంలో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనానికి సమీపంలో తక్కువ జనాభా కలిగిన దోటి జిల్లాలో సంభవించింది.

నైరుతి దిశలో 536 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీ వరకు ప్రకంపనలు వచ్చాయి.

"ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, వారిని చికిత్స కోసం ఖాట్మండుకు తరలించాము" దోతీ జిల్లా, భోలా భట్టా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ షేర్ బ‌హ‌దూర్ డౌబా గారు మృతుల కుటుంబాల‌కు సానుభూతిని  తెలియచేసారు.

 

Add new comment

7 + 13 =