Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
నేటి ప్రపంచ పర్యావరణ ఎదుర్కొంటున్న మూడు క్లిష్టమైన సవాళ్లు
నేటి ప్రపంచ పర్యావరణ ఎదుర్కొంటున్న మూడు క్లిష్టమైన సవాళ్లు
21 వ శతాబ్దంలో ప్రపంచం పర్యావరణ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నది. వాటిలో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి.
1 . వాతావరణ మార్పులు
వాతావరణానికి అతి పెద్ద సవాలు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం. గ్రీన్పీస్ ప్రకారం ఈ శతాబ్దం చివరికి భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు చేరవచ్చు అని, దాని పర్యవసానం చాల దారుణం గా ఉంటుందని పేర్కొంది.
పునరుత్పాదక వనరులు మరలా తయారు చేయొచ్చు కానీ, శిలాజ ఇంధనాల కర్మాగారాలు నడుపు వారు ఈ వనరులను తయారు చెయ్యడానికి సుముఖంగా లేరు. ఈ పరిస్థితిని మార్చాలని గ్రీన్పీస్ కార్య నిర్వాహక దర్శకులైన జియూసెప్పె ఓను ఫ్రీయో అన్నారు.
భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తీవ్రమైన త్రాగు నీటి కొరత ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
నీరు మనం అనుకుంటున్నట్లు మనకు ఉచితంగా రావట్లేదని, రానున్న రోజులలో అది చాల పెద్ద సమస్య గా మారి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యం లేదని ఒకానొక సందర్భంలో పాపు గారు అన్నారు.
2 . అడవులను, వనాలను నాశనం కావడం
అడవులు, వనాలు నాశనం కావడం అనేది మరొక పెద్ద సమస్యగా మారింది. కొంత కాలం క్రితమే ఆస్ట్రేలియా, సైబీరియా మరియు కాలిఫోర్నియా లో అడవులు భయంకరమైన దావాగ్నికి నాశనం కావడం మనం చూసాం.
భూమికి ఊపిరి తిత్తుల వంటి అమెజాన్ అడవులు నిత్యం ముప్పునకు గురి అవుతున్నాయి.
గత అక్టోబర్ లో జరిగిన అమెజాన్ సినడ్ అక్కడి ఉనికిని కోల్పోతున్న దేశీయ తేగలను గూర్చి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి మూలంగా పరిస్థితి మరింత గడ్డుగా మారింది.
3 . మహా సముద్రాలు
మన సముద్రాలన్నీ చెత్త కుప్పలు గా మారిపోయాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలతో సముద్రాలను నింపుతున్నారు. వ్యర్ధాలను పారవెయ్యడానికి సరైన పద్ధతులు అవలంబించని కారణం చేత ప్రతి ఏటా ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రాలలో విడిచిపెట్టబడుతున్నాయి. అంటే 60 నుండి 80 శాతం వ్యర్ధాలు సముద్రాలలో వదిలెయ్యడం కారణంగా రాబోయే కాలంలో దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో అంచనాలకు కూడా అందడంలేదని గ్రీన్పీస్ అభిప్రాయం పడింది.
Article abstracted from: https://www.romereports.com/en/2020/05/24/three-key-environmental-challenges-of-our-time/
Add new comment