నదుల కోసం అంతర్జాతీయ దినోత్సవం

భూమి ఉపరితలంపై సుమారు 70 శాతానికిపైగా నీరే ఉంది. ఈ నీటిలో 97 శాతం ఉప్పు నీరే. మిగిలిన 3 శాతం మంచినీరు.

మన దేశంలో మంచినీరు ఎక్కువగా అందుబాటులో వున్నది గంగా, యుమున, బ్రహ్మపుత్ర, నర్మద,  గోదావరి, కృష్ణ, మహానది, కావేరి మొదలగు నదులు, ఉపనదులు, లక్షలాది చెరువుల్లో,  సరస్సుల్లో,  అందుబాటులో వుంది.
భారీ పరిశ్రమలు, ఇతర చిన్న పరిశ్రమల నుంచి కూడా వ్యర్థాలు ఎక్కువగా నదిలో కలిసిపోతున్నాయి. ఇది చాలాకాలంగా సాగుతోంది.  తగు జాగ్రత్తలు తీసుకుంటున్నం అని   కంపెనీలు చెబుతున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రమే.

మన దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి  గోదావరి. దీన్ని ‘దక్షిణ గంగ’ అని కూడా మనము పిలుచుకుంటున్నాము. అటువంటి మన గోదావరి తాగడానికి కాదు కదా  కనీసం స్నానం చేయడానికి, వ్యవసాయానికి కూడా పనికిరాని స్థితిలో గోదావరి నీటి ప్రమాణాలు ఉన్నాయంటే ఈ  సమస్య తీవ్రత ఎంత ఉందొ  అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం  నదీ జలాల పరిరక్షణకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులో గోదావరిని కూడా చేర్చింది.

ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యం వల్ల, ప్రజల్లో అవగాహనా లోపం, ఫ్యాక్టరీస్  కారణంగా నదులు, చెరువులు కాలుష్యమయమైపోతున్నాయి. లక్షలాది చెరువులు కబ్జాల పాలవుతున్నాయి. ఇది ఇలానే వదిలేస్తే భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందిచలేము.  నదీజలాల స్వచ్ఛతను, పరిశుభ్రతను మనము కాపాడాలి. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి స్వచ్ఛతను, నదుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ.

నదుల కోసం అంతర్జాతీయ దినోత్సవం  (International Day of Action for Rivers) సందర్భముగా మనమందరం కలసి ఒక్కఅడుగు ముందుకు వేసి నదుల కొరకు తగిన జాగ్రత్తలు తీసుకొందాం మన పిల్లలకు స్వచ్ఛమైన ప్రపంచాన్ని అందించుదాం.  నదులను, చెరువులను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మంచినీరును మనము  అందించగలం.
 

Add new comment

7 + 2 =