తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

తెలంగాణపై ఈశాన్య గాలులు ప్రభావంతో  ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.  రానున్న కొద్ది రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఐఎండీ వాతావరణ నిపుణులు తెలిపారు.హైదరాబాద్‌ నగరం లో  పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  తిర్యాని మండలం గిన్నెదరిలో  కనిష్ట ఉష్ణోగ్రతలు గా 8.3డిగ్రీలుగా ,  సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలుగా  నమోదయ్యాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. విశాఖలో ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లంబసింగి 5డిగ్రీలు, చింతపల్లిలో 6,డిగ్రీలు, అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో నాలుగైదు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జలుబు, జ్వరం, దగ్గులాంటి వాటి బారిన పడుకుండా  జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు .

Add new comment

2 + 6 =