తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణలో ఎండలు దంచుతున్నాయి. ఇప్పటికే నాటికే 40 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రత నమోదైంది.  ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విపరీతంగా పెరుగుతోన్న దరిమిలా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ విభాగం(ఐఎండీ).

తెలంగాణలో ఉష్ణోగ్రలు పెరుగుతోన్న దరిమిలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా చేప్రాల 43.3, కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి 43.1, జగిత్యాల జిల్లా మద్దుట్ల 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Add new comment

3 + 5 =