జాలరులు ప్రశంసించిన ఫ్రాన్సిస్ పాపు గారు

Fishermen from ItalyFishermen from Italy

జాలరులు ప్రశంసించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

జనవరి 19 న దక్షిణ ఇటలీ నుండి వాటికన్ వచ్చిన జాలరులు బృందాన్ని ఫ్రాన్సిస్ పాపు గారు సాదరంగా ఆహ్వానించారు.

వీరు సాధారణ జాలరులు కాదు. వీరు సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న వారు. ఈ మేరకు ఇటలీలో ఒక చట్టం తేవడానికి కూడా వీరు కృషి చేస్తున్నారు.

"మీరు తీసుకున్న ఈ చొరవ ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది. మీరు శుభ్రం చేసిన ప్లాస్టిక్ వ్యర్ధాల పరిమాణం ఎంత ఎక్కువంటే, ఈ పని చెయ్యడం ద్వారా ఒక్క ఇటలీ పరిసర ప్రాంతాలలోనే కాకుండా ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్దులై ప్రపంచానికి ఒక మాతృక చూపించారు" అని పాపు గారు వారిని కొనియాడారు.

ఈ సత్కార్యం ఇంకా వ్యాపించాలంటే ఇది స్థానిక పరిధిలో మరి ఎక్కువగా వ్యాపించాలి అని ఆయన చెప్పారు.

"మీరు సముద్రంలో చేపలకు బదులు ప్లాస్టిక్ ను వేటాడడానికి  తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని అందరికి ఒక మాతృకను చూపించి నేటి ప్రపంచ సమస్యలను స్థానిక పరిధిలో ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది" అని పాపు గారు అన్నారు.

పవిత్ర గ్రంధంలో జాలరులు ప్రాముఖ్యతను గూర్చి పాపుగారు చెప్పారు. మొట్టమొదటి పాపు గారైన పేతురు గారు కూడా ఒక జాలరేనని, క్రీస్తుని మొదటి శిష్యులు కూడా జాలరులేనని పాపు గారు  గుర్తు చేసారు.

వారి విశ్వాసం వారికి నేర్పించిన మతతత్వం, కుటుంబం పట్ల గౌరవం మరియు సంఘీభావం వంటి విలువల్ని ఎన్నటికీ మరువకూడదని ఆయన వారిని కోరారు.

చివరిగా పాపు గారు ఆ జాలరులు ఆశీర్వదించి సమావేశాన్ని ముగించారు.

Add new comment

1 + 3 =