ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం :

విశాఖ అతిమేత్రాసనం,  ఆర్. వి నగర్ లోని "శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ "లో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఘనంగా  జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో  "శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ "  స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ హరీ ఫిలిప్స్ తో పాటు స్కూల్ సిబ్బంది  గురుశ్రీ ప్రభాకర్ మరియు  సిస్టర్  భాగ్యమేరీ,  సిస్టర్ పద్మ,  వెంకటలక్ష్మి , తిమోతి , లోవరాజు, సుబ్బారావు ,  ప్రశాంతి, జగదీశ్వర రావు , ఆరోగ్య మేరీ ,  ఆశ లతా ,  మణి , మాధవి , శ్రావణి మరియు  శిరీష  పాల్గొన్నారు.
పిల్లలందరూ వివిధ రకాల పోస్టర్స్ ను చేతపట్టి ప్రకృతిని రక్షిద్దాం అనే నినాదం తో ముందుకు సాగారు.వివిధ తరగతుల పిల్లలు ప్రజలను చైతన్య పరిచే  ప్రదర్శనలు ఇచ్చారు.  

స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ హరీ ఫిలిప్స్  మాట్లాడుతూ "పర్యావరణాన్ని, పచ్చదన్నాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పరిశ్రమలు వెదజల్లే వాయు, జల కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత దెబ్బ తిని ప్రకృతి వైపరీత్యాలు సంభవించి సునామీలు, భూకంపాలు వంటివి వస్తాయన్నారు. ప్రజలందరూ తమ భాద్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు.

"ప్రకృతిని రక్షిద్దాం....భావితరాలకు మంచి భవిష్యత్తు ఇద్దాం" అని సిస్టర్ భాగ్యమేరీ తెలిపారు.  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటాలని శ్రావణి సూచించారు.

జగదీశ్వర రావు గారు మాట్లాడుతూ "వాతావరణలో కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటడమే పరిష్కారమన్నారు.

సిస్టర్ పద్మ మాట్లాడుతూ మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడు సృష్టించిన  ప్రకతి  వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి అని బాధను వ్యక్తం చేసారు.  మనుషులే కాకుండా సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలని అభిలషించారు.

Add new comment

5 + 0 =