గోల్డ్‌ఫిష్‌

నదులు లోని ఇతర జలచరాలకు ఈ గోల్డ్‌ఫిష్‌లు పెద్ద ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు:

మీ అక్వేరియంలోని బంగారు వర్ణంలో మెరిసే  గోల్డ్‌ఫిష్ ఉందా ? ఆయితే దానిని అక్కడే ఉండనివ్వండి. ఎందుకంటే  అవి ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని నదులు, చెరువులల్లోని జీవులకు ఈ గోల్డ్‌ఫిష్‌లు ప్రమాదకరం గా  పరిణమిస్తున్నాయని తెలుస్తుంది. వీటిని పరిసరాల్లోని నదులు, చెరువుల్లో వదిలి పెట్టొద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీచేస్తున్నారు.

ఈ గోల్డ్ ఫిష్ శాస్త్రీయ నామం కైరేసియస్ అరాటస్. అక్వేరియంలో చూడటానికి ఈ చేపలు చిన్నగానే ఉంటాయి. అయితే, బయట నదులు, చెరువుల్లో వదిలిపెడితే, ఇవి చాలా పెద్దగా అవుతాయి. దాదాపు రెండు కేజీల వరకు బరువు పెరుగుతాయి.
వీటికి  సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే గోల్డ్‌ఫిష్‌లు ఒకసారి గుడ్లు పెట్టిన వెంటనే, మళ్లీ గుడ్లు పెడతాయి.సాధారణంగా చేపలు గుడ్లు పెట్టడానికి ప్రత్యేక సమయం ఉంటుంది.

బయట నదులు, చెరువులు, జలాశయాల్లో పెరిగినంత వేగంగా అక్వేరియంలలో గోల్డ్‌ఫిష్‌లు పెరగలేవని పరిశోధనలో తేలింది. నదులు, చెరువులలోని  చేపలు  సాధారణం గా దోమల లార్వాలు తింటే, ఈ గోల్డ్‌ఫిష్‌లు మాత్రం చేపల గుడ్లను తినేస్తాయని తేలింది.
గోల్డ్‌ఫిష్‌ లు ఆహారం కోసం నీటి అడుగు భాగంలో తిరుగుతుంటాయి. వీటి కదలికల వల్ల నీటి అడుగు భాగంలో ఉండే బురదతోపాటు అక్కడుంటే పోషకాలు కూడా పైకి తేలుతూ వచ్చేస్తుంటాయి. దీని వల్ల గోల్డ్‌ఫిష్‌కు ఆహారం దొరుకుతుంది కానీ జలాశయాల్లో నాచు పెరుగుతుంది. అంతేకాదు దీని వల్ల జలచరాలతోపాటు మనుషులకూ కొత్త జబ్బులు సోకే ముప్పుంది.
ఫ్లోరిడాలోని బనానా లేక్‌లో భారీ గోల్డ్‌ఫిష్‌ను అధికారులు మొదట గుర్తించారు. అనంతర పరిశీలనలో అక్కడి చేపలపై ఈ గోల్డ్‌ఫిష్‌లు దాడిచేస్తున్నట్లు తేలింది.ఈ చేపలు మొదట్లో చైనాలో మాత్రమే ఉండేవని, ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ పాకాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చేపలను చెరువులు, నదుల్లో వదిలిపెట్టొద్దని అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో అధికారులు ప్రజలకు సూచించారు.సహజ సిద్దమైన నదులను వాటిలో వుండే జీవరాసులు రక్షించుకునే బాధ్యత మనమీద ఉందని తెలిపారు.

Source:BBC Telugu

 

 

 

 

 

 

 

Add new comment

2 + 0 =