
కరోనా వల్ల మనం తెలుసుకున్న కొన్ని మంచి విషయాలు
కరోనా వల్ల మనం తెలుసుకున్న కొన్ని మంచి విషయాలు

షాపింగ్ మాల్స్, వ్యాయామశాలలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఈ ప్రాపంచిక వస్తువులు లేకుండా ఎలా జీవించాలో తెలుసుకున్నాం.

పరిశుభ్రత ఎలా పాటించాలో, మన ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం

మనకున్నది ఎంత విలువైనదో తెలుసుకున్నాం ఆహరం, గృహం, కుటుంబం ఇలాంటివి ఎంత విలువైనవో తెలుసుకున్నాం ఎందుకంటే కొందరు వీటిలో కొన్నిటిని పోగొట్టుకున్నారు.

మనకు హాని ఉందని తెలిసినా ఇతరులకు సహాయం ఎలా చెయ్యాలో తెలుసుకున్నాం

అపరిచితులకు సాయం చేసి వారిని గురించి పట్టించుకునేవారిని అభినందించడం నేర్చుకున్నాం

గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచమంతా ఐకమత్యంగా ఉండి పోరాడడం నేర్చుకున్నాం

మన చుట్టూ చనిపోతున్న వేలమందిని చూసి జీవితం యొక్క విలువ తెలుసుకున్నాం.

అన్నిటికంటే ముఖ్యంగా మనం బలహీనులమైన మానవులం మనకు మన శక్తి సరిపోదు, మనకు ఒక బలమైన శక్తి తోడు కావలి అదే దేవుడు
Add new comment