ఇండోనేషియాలో పర్యాటక ఉత్సవం

ఇండోనేషియా ప్రాంతీయ సంస్కృతి మరియు మత ఆధారంగా పర్యాటక ఉత్సవాన్ని ఆగస్టు 8-15 వరకు ఫ్లోరిస్, పశ్చిమ మంగరాయ్ జిల్లా, లాబువాన్ బాజో వాటర్‌ఫ్రంట్‌లో రుటెంగ్ మేత్రాసనం వారు నిర్వహించారు.

పర్యాటకాన్ని, వైవిధ్యంగా, పర్యావరణానికి మేలు చేసేందుకు ఈ ఉత్సవాన్ని జరిపించారు.

ఈ కార్యక్రమం పశ్చిమ మంగరై స్థానిక ప్రభుత్వం మరియు పర్యాటక అధికారులు అమలు చేసే ఏజెన్సీ భాగస్వామ్యంతో జరిగింది.

రుటెంగ్ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య సిప్రియానస్ హోర్మాట్ మాట్లాడుతూ లాబువాన్ బాజోలో పర్యాటకం సంపన్నులకే కాకుండా స్థానికులందరికీ కూడా అని తెలిపారు.

"పర్యాటకం అనేది కేవలం డబ్బున్న వ్యక్తులదే కాదు, మనందరికీ చెందినది. ప్రజలందరికీ తప్పనిసరిగా ప్రవేశం కల్పించాలి. ఈ కార్యక్రమం మరింత ఆ దిశగా సాగుతుంది" అని చిన్న, మధ్య తరహా పరిశ్రమల (UMKM) ప్రదర్శనను సమీక్షిస్తూ పీఠాధిపతులవారు అన్నారు.

కథోలికులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం కొనసాగించాలని పీఠాధిపతులు కోరారు. 

ఇండోనేషియా ప్రభుత్వం లాబువాన్ బాజోను దేశంలో ప్రీమియం పర్యాటక కేంద్రంగా గుర్తించారు 

Add new comment

6 + 9 =